లడఖ్‌లోని లేహ్ సమీపంలోని హన్లేలో ఉన్న వేధశాల, భారతీయ ఖగోళ వేధశాల (IAO). ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, గామా-రే టెలిస్కోప్‌ల లకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేధశాలల్లో ఒకటి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ ఈ వేధశాలను నిర్వహిస్తోంది. 4,500 మీటర్ల ఎత్తున ఉన్న ఇక్కడి టెలిస్కోపు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఆప్టికల్ టెలిస్కోపుల్లో ఇది పదో స్థానంలో ఉంది. భారత ఖగోళ అబ్జర్వేటరీ ఆగ్నేయ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో, హాన్లే లోని దిగ్ప-రత్స రి పర్వతంపై ఉంది. చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ అబ్జర్వేటరీని చేరుకోవడానికి లేహ్ నుండి పది గంటల ప్రయాణం అవసరం. 1980ల చివరలో ప్రొఫెసర్ బివి శ్రీకాంతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక కమిటీ జాతీయ స్థాయిలో పెద్ద ఆప్టికల్ టెలిస్కోపును ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. 1992 లో ప్రొఫెసర్ అరవింద్ భట్నాగర్ నేతృత్వంలో అబ్జర్వేటరీ స్థలం కోసం అన్వేషణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు హాన్లేలో ఈ స్థలాన్ని కనుగొన్నారు. బెంగుళూరు లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CREST), హాన్లేల మధ్య ఉపగ్రహ లింకును అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి డాక్టర్. ఫరూక్ అబ్దుల్లా 2001 జూన్ 2 న ప్రారంభించాడు. 2001 ఆగస్టు 29 న ఈ అబ్జర్వేటరీని జాతికి అంకితం చేసారు. (ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.