కేపీ శర్మ ఓలీ
ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి (జననం 22 ఫిబ్రవరి 1952) నేపాల్ రాజకీయ నాయకుడు మాజీ నేపాల్ ప్రధాన మంత్రి. [1][2]ఇప్పటి వరకు మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు.[3][4][5]2015 భారత ప్రభుత్వంతో కఠిన వైఖరితో ఉన్నాడు.భారతదేశంతో ఉన్న కొన్ని భూభాగాలు మవే అని రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ మ్యాప్‌ను నవీకరించాడు.దీని వల్ల కొంత దేశీయ ప్రశంసలు, జాతీయవాదిగా ఖ్యాతిని పొందాడు.[6][7]
కేపీ శర్మ ఓలీ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి 1952 ఫిబ్రవరి 22 టెహ్రథుమ్, నేపాల్ |
జాతీయత | నేపాలీ |
రాజకీయ పార్టీ | నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2018–2021) |
జీవిత భాగస్వామి | రాధిక |
సంతకం |
జీవితం తొలి దశలో
కేపీ శర్మ ఓలీ 1952 ఫిబ్రవరి 22 న టెహ్రథుమ్‌లో జన్మించాడు.తల్లిదండ్రులు మోహన్ ప్రసాద్, మధుమయ.రైతు కుటుంబ నేపథ్యం కలవారు.[8][9][10]ఓలికి నాలుగేళ్ల వయసులో తల్లి మశూచితో మరణించడంతో[11] అతని అమ్మమ్మ వద్ద పెరిగాడు.తన ప్రాధమిక పాఠశాల విద్యను టెహ్రథుమ్‌లో పూర్తి చేశాడు.[12] కేపీ శర్మ ఓలీ రాధికను వివాహం చేసుకున్నాడు.
రాజకీయ జీవితం
1966లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి 1970లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు.1970లో మొదటిసారిగా అరెస్టయ్యాడు. ఒక సంవత్సరం తర్వాత అతను పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా,ఝాపా ఉద్యమ ఆర్గనైజింగ్ కమిటీకి చీఫ్ అయ్యాడు. 1972. ఓలి నిరంకుశ పంచాయతీ వ్యవస్థకు వ్యతిరేకంగా 1973 నుండి 1987 వరకు వరుసగా 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.1987 లో జైలు నుంచి విడుదలైన తరువాత, ఆయన కేంద్ర కమిటీ సభ్యులు అయ్యారు.[13]2015లో నేపాల్ కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కె.పి.శర్మ ఓలీ కొత్త ప్రధాని అయ్యారు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది.అయితే జూలై 2016లో ఇతర పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.ప్రధానమంత్రిగా మూడు సార్లు పనిచేశాడు.
ఆరోగ్య సమస్యలు
ఓలీకి రెండు సార్లు కిడ్నీ మార్పిడి జరిగింది. మొదటి 2007 లో అపోలో హాస్పిటల్ , న్యూఢిల్లీ జరిగింది రెండో సారి 2020 లో ఖాట్మండు జరిగింది.[14] [15]
రాజీనామాలు
- ఓలీ నేతృత్వంలోని సీపీఎన్ ప్రభుత్వంలో భాగస్వాములైన మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకోగా, రాష్ట్రీయ ప్రజాతంత్ర, మాదేసి జనాధికార ఫోరంతోపాటు మరో రెండు చిన్నపార్టీలు సైతం పక్కకు తప్పుకున్నాయి. దీంతో మైనారిటీలో పడ్డ ఓలీ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చింది.అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరకముందే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి 24 జూలై 2016న రాజీనామా చేశారు.అవిశ్వాస తీర్మానానినికి ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మద్దతు తెలిపింది.
వివాదాలు
- రాముడు నేపాల్ కు చెందిన వాడు అని జన్మస్థలం అయోధ్య నేపాల్ లోని బిర్గుంజ్ పశ్చిమాన థోరి వద్ద ఉన్నప్పటికీ భారతీయులు రాముని జన్మస్థలం భారదేశమని అంటున్నారు అని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి వ్యాఖ్యానించారు. అందుకే నిజమైన అయోధ్య నేపాల్ లోనే వుందంటూ ఒలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
- యోగా నేపాల్‌లో ఉద్భవించిందనీ 21 జూన్ 2021న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[16][17] [18]
- భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలోకి కరోనా వైరస్ వస్తోందని ఆరోపించాడు.పార్లమెంట్‌లో ప్రసంగించిన కేపీ శర్మ భారత్ నుంచి అక్రమ మార్గాల ద్వారా నేపాల్‌కి వచ్చిన వారు దేశంలో వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారని అన్నారు. చైనా, ఇటలీ నుంచి వచ్చే వైరస్ కంటే ఇండియా నుంచి వచ్చే వైరస్సే ప్రాణాంతకమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.