మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం హస్తినాపుర సింహాసనం కోసం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. పాండవ సైన్యం 7 అక్షౌహిణులు. కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. కౌరవులకు భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. పాండవ సైన్యానికి దృష్టద్యుమ్నుడు సర్వసేనాధిపతిగా వ్యవహరించాడు. శ్రీకృష్ణుడు పాండవుల తరఫున అర్జునునికి రథసారథిగా వ్యవహరించగా, ఆయనకు చెందిన యాదవ సైన్యం కౌరవుల పక్షం వహించింది. రుక్మికి చెందిన విదర్భ రాజ్యం, కృష్ణుని అన్న బలరాముడు ఏ పక్షం వహించకుండా తటస్థులుగా ఉన్నారు. యుద్ధానికి ముందే ఇరు పక్షాల తరఫున నాలుగు శాంతి రాయబారాలు జరిగాయి. కానీ అవన్నీ విఫలమైనాయి. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. (ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.