లావోస్

18°N 105°E / 18°N 105°E / 18; 105

Lao People's Democratic Republic

  • ສາທາລະນະລັດ ປະຊາທິປະໄຕ ປະຊາຊົນລາວ  (Lao)
  • Saþalanalat Paxaþipatai Paxaxōn Lao (Romanisation)
  • République démocratique populaire lao  (French)
Flag of Laos
జండా
Emblem of Laos
Emblem
నినాదం: "ສັນຕິພາບ ເອກະລາດ ປະຊາທິປະໄຕ ເອກະພາບ ວັດທະນະຖາວອນ"
"Santiphab ekalad pasaþipatai ekaphāb vadþa na þauaōn" (Lao romanisation)
"Paix, indépendance, démocratie, unité et prospérité"
(English: "Peace, independence, democracy, unity and prosperity")
గీతం: "Pheng Xat Lao"
(English: "Lao National Anthem")
Location of  లావోస్  (green)

in ASEAN  (dark grey)  —  [Legend]

రాజధానిVientiane
17°58′N 102°36′E / 17.967°N 102.600°E / 17.967; 102.600
అధికార భాషలుLao
Recognised languagesFrench[1]
Spoken languages
జాతులు
(2005[2])
  • 53.2% Lao
  • 11% Khmu
  • 9.2% Hmong
  • 3.4% Phouthai
  • 3.1% Tai
  • 2.5% Makong
  • 2.2% Katang
  • 2.0% Lue
  • 1.8% Akha
  • 11.6% othera
మతం
Buddhism 64.7%
Tai folk religion 31.4%
Christianity 1.7%
Islam 0.8%
Other 1.3%
పిలుచువిధంLao
Laotian
ప్రభుత్వంUnitary Marxist–Leninist one-party socialist republic
• Party General Secretary and President
Bounnhang Vorachith
• Vice President
Phankham Viphavanh
• Prime Minister
Thongloun Sisoulith
• President of the National Assembly
Pany Yathotou
శాసనవ్యవస్థNational Assembly
Formation
• Kingdom of Lan Xang
1353–1707
• Kingdoms of Luang Phrabang, Vientiane & Champasak
1707-1778
• Vassals of Siam
1778–1893
• French protectorate
1893–1953
• Unified Kingdom
11 May 1947
• Independence
22 October 1953
• Monarchy abolished
2 December 1975
• Current constitution
14 August 1991
• Joined ASEAN
23 July 1997
విస్తీర్ణం
• మొత్తం
237,955 km2 (91,875 sq mi) (82nd)
• నీరు (%)
2
జనాభా
• Estimate
6,758,353[3] (103rd)
• 2015 census
7,096,3766,492,228[4]
• జనసాంద్రత
26.7/km2 (69.2/sq mi) (151st)
GDP (PPP)2019 estimate
• Total
$58.329 billion[5]
• Per capita
$8,458[5]
GDP (nominal)2019 estimate
• Total
$20.153 billion[5]
• Per capita
$2,670[5] (131st)
జినీ (2012)36.4[6]
medium
హెచ్‌డిఐ (2018)Increase 0.604[7]
medium · 140th
ద్రవ్యంKip (₭) (LAK)
కాల విభాగంUTC+7 (ICT)
తేదీ తీరుdd/mm/yyyy
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+856
ISO 3166 codeLA
Internet TLD.la
  1. Including over 100 smaller ethnic groups.

లావోస్[8] /ls, ˈlɑːɒs, ˈlɒs/;[9][10] అధికారికంగా " లావో పీపుల్సు రిపబ్లిక్కు " అని పిలువబడుతుంది. ఆగ్నేయ ఆసియాలో ఇది ఏకైక భూపరివేష్టిత దేశంగా గుర్తించబడుతుంది. ఇండోచైనా ద్వీపకల్పం నడిబొడ్డున ఉన్న లావోస్ వాయవ్య సరిహద్దులో మయన్మార్ (బర్మా), చైనా, తూర్పు సరిహద్దులో వియత్నాం, ఆగ్నేయ సరిహద్దులో కంబోడియా, పశ్చిమ, నైరుతి సరిహద్దులో థాయిలాండ్ ఉన్నాయి.[11] ప్రస్తుత లావోస్ " లాన్ క్జాంగ్ హోం ఖావో (వైట్ పారాసోల్ ఆధ్వర్యంలో ఒక మిలియను ఏనుగుల రాజ్యం)గా చారిత్రక, సాంస్కృతికంగా గుర్తించబడుతుంది. ఇది 14 వ శతాబ్దం మధ్య నుండి 18 వ శతాబ్దం వరకు అతిపెద్ద ఆగ్నేయాసియా రాజ్యాలలో ఒకటిగా ఉంది.[12] భౌగోళికంగా ఆగ్నేయాసియాలో లాన్ క్సాంగు కేంద్ర స్థానంగా ఉన్న కారణంగా ఈ రాజ్యం ఒక ప్రసిద్ధ వాణిజ్యకేంద్రంగా మారి ఆర్థికంగా సాంస్కృతికంగా సంపన్నదేశంగా మారింది.[12] కొంతకాలం అంతర్గత వివాదం తరువాత లాన్ క్సాంగు మూడు వేర్వేరు రాజ్యాలుగా విడిపోయాయి; లుయాంగు ఫ్రాబాంగు, వియంటియాను, చంపసాకు. 1893 లో మూడు భూభాగాలు సమైఖ్యం అయిన తరువాత ఇది ఒక ఫ్రెంచి రక్షిత ప్రాంతంగా మారి ఇప్పుడు లావోస్ దేశం అని పిలువబడుతుంది. జపాను ఆక్రమణ తరువాత 1945 లో కొంతకాలం స్వాతంత్ర్యం పొందినప్పటికీ 1949 లో స్వయంప్రతిపత్తిని గెలుచుకునే వరకు తిరిగి ఫ్రెంచి ఆధిపత్యంలో కొనసాగింది. 1953 లో లావోస్ స్వతంత్రదేశమై సిసావాంగు వాంగు ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన రాచరికం దేశంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొద్దికాలానికే సుదీర్ఘ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది సోవియటు యూనియను మద్దతుతో సాగిన కమ్యూనిస్టు ప్రతిఘటనను ఎదుర్కొన్నది. మొదట రాచరికపాలన తరువాత లావోసు అనేక సైనిక నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడింది. దీనికి యునైటెడు స్టేట్సు మద్దతు ఉంది. 1975 లో వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత కమ్యూనిస్టు పాథెటు లావో ఉద్యమం అధికారంలోకి రావడంతో అంతర్యుద్ధం ముగిసింది. 1991 లో సోవియటు యూనియను రద్దు అయ్యే వరకు కమ్యూనిస్టు పాలన మొదటి సంవత్సరాలలో లావోస్‌కు సోవియటు యూనియను మద్దతుతో సైనిక, ఆర్థిక సహాయం లభించింది.

2018 లో ఆగ్నేయాసియాలో తలసరి జిడిపి (పిపిపి)లోలావోస్ (సింగపూర్, మలేషియా, థాయిలాండ్ తరువాత) 4 వ స్థానంలో ఉంది.[13] అదే సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో ప్రపంచదేశాలలో లావోసు 139 వ స్థానంలో ఉంది. [14] లావోస్ ఆసియా-పసిఫికు వాణిజ్య ఒప్పందం, ఆగ్నేయాసియా దేశాల సంఘం, తూర్పు ఆసియా సమ్మిటు, లా ఫ్రాంకోఫోనీలలో సభ్యదేశంగా ఉంది. 1997 లో లావోస్ ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నది; 2013 ఫిబ్రవరి 2 న దీనికి పూర్తి సభ్యత్వం లభించింది.[15] ఇది " ఏక పార్టీ సోషలిస్టు రిపబ్లికు "గా ఉన్న లావోస్ " లావో పీపుల్సు రివల్యూషనరీ పార్టీ " చే పాలించబడుతూ మార్క్సిజం-లెనినిజాన్ని సమర్థిస్తుంది.

లావోస్‌ రాజధాని, అతిపెద్ద నగరంగా వియంటియాను నగరం ఉంది. ఇతర ప్రధాన నగరాలుగా లుయాంగు ప్రాబాంగు, సవన్నాఖెటు పాక్సే ఉన్నాయి. లావోస్ అధికారిక భాష లావో. లావోస్ బహుళ జాతి ప్రజలున్న దేశం. లావో స్థానిక జాతికి చెందిన ప్రజలు రాజకీయంగా, సాంస్కృతికంగా ఆధిపత్యం వహిస్తూ జనాభాలో 55% ఉన్నారు. వారు అధికంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నారు. పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న మోన్-ఖైమర్ సమూహాలు, మోంగు, ఇతర దేశీయ కొండ తెగలకు చెందిన ప్రజలు జనాభాలో 45% ఉన్నారు. నదుల ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్తును దాని పొరుగు దేశాలైన థాయిలాండ్, చైనా, వియత్నాంలకు విక్రయించడం లావోస్ అభివృద్ధి వ్యూహాలలో భాగంగా ఉంది. అలాగే నాలుగు కొత్త నిర్మాణాల ద్వారా "భూమార్గంలో-అనుసంధాన" దేశంగా మారడం లావోస్ చొరవ మీద ఆధారపడి ఉంది. రైలుమార్గాలు లావోస్‌ను పొరుగుదేశాలతో అనుసంధానిస్తుంది.[16][17] ప్రపంచ బ్యాంకు లావోస్‌ను ఆగ్నేయాసియా - పసిఫికు ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేర్కొంది. వార్షిక జిడిపి వృద్ధి 2009 నుండి సగటున 7.7%.[18][19]

పేరు వెనుక చరిత్ర

లావోస్ అనే ఆంగ్ల పదం ఫ్రెంచి భాష ఆధారంగా సృష్టించబడింది. 1893 లో ఫ్రెంచి ఇండోచైనాలోని మూడు లావో రాజ్యాలను ఏకం చేశారు. లావో అంటే సంప్రదాయానికి అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తూ ఆధిపత్య ధోరిణి ప్రదర్శించే సమూహానికి చెందిన ప్రజలు అని అర్ధం.[20]

ఇంగ్లీషు మాట్లాడేవారు కొన్నిసార్లు "లావోస్" ను తప్పుగా ఉచ్చరిస్తారు. వారు దీనిలో 'ఎస్' ను నిశ్శబ్ధ అక్షంరంగా ఉచ్చరించాలని తప్పుగా భావిస్తారు.[21] లావోస్‌లోని 'ఎస్' ఎప్పుడూ మౌనంగా ఉండదు.[22][23][24]

లావో భాషలో దేశం పేరు "మువాంగ్ లావో" (ເມືອງ ລາວ) లేదా "పాథెట్ లావో" (ປະ ເທດ ລາວ), రెండూ అక్షరాలా "లావో దేశం" అని అర్ధాన్ని సూచిస్తాయి.[25]

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

వియటియానేలోని లావోస్ జాతీయ చిహ్నం ఫా దట్ లంగు

ఉత్తర లావోస్‌లోని అన్నమైటు పర్వతాలలో ఉన్న తమ్ దట్ లింగు గుహ నుండి ఒక పురాతన మానవ పుర్రెను స్వాధీనం చేసుకున్నారు; ఈ పుర్రె కనీసం 46,000 సంవత్సరాల పురాతనమైనదని విశ్వసిస్తున్నారు. ఇది ఆగ్నేయాసియాలో ఇప్పటివరకు కనుగొనబడిన ఆధునిక మానవుని పురాతన శిలాజంగా మారింది.[26] ఉత్తర లావోస్‌లోని లేట్ ప్లీస్టోసీన్ నాటి ప్రదేశాలలో హోబిన్హియన్ రకాలతో వంటి రాతి కళాఖండాలు కనుగొనబడ్డాయి.[27] క్రీస్తుపూర్వం 4 వ సహస్రాబ్దిలో ఈ ప్రాంతంలో వ్యవసాయ సమాజం అభివృద్ధి చెందిందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. [28] పరిశోధనలో లభించిన ఖననం జాడి, ఇతర రకాల సమాధులు, క్రీ.పూ 1500 కాలంనాటి కాంస్య వస్తువులు ఈ ప్రాంతంలో ఒక సంక్లిష్ట సమాజం నివసించినట్లు సూచిస్తున్నాయి. ఇక్కడ లభించిన ఇనుప ఉపకరణాలు క్రీ.పూ 700 నాటికి చెందినవని భావించబడుతున్నాయి. ప్రోటో-చారిత్రాత్మక కాలంలో చైనా, భారతీయ నాగరికతలతో వీరికి పరిచయం కలిగి ఉండవచ్చు.[ఆధారం చూపాలి] 8 వ -10 వ శతాబ్దాల మధ్యకాలంలో తాయి భాష మాట్లాడే తెగలకు చెందిన ప్రజలు గ్వాంగ్జీ నుండి నైరుతిదిశగా పయనించి లావోస్, థాయిలాండు భూభాగాలకు వలసగా వచ్చారని భాషా, ఇతర చారిత్రక సాక్ష్యాల ఆధారాలు తెలియజేస్తున్నాయి.[29]

లాన్ క్సాంగు

లాన్ క్సాంగు రాజ్యస్థాపకుడు ఫా న్గుం శిల్పం

14 వ శతాబ్దంలో లావో యువరాజు ఫా న్గుం స్థాపించిన లాన్ జాంగ్ (మిలియన్ ఎలిఫెంట్స్) రాజ్యచరిత్ర లావోస్ చరిత్రగా గుర్తించబడింది. [30] ఈ చరిత్ర ఆధారంగా ఫా న్గుం తండ్రి పాలనలోని ఖైమరు సామ్రాజ్యం నుండి తన కుటుంబాన్ని వెలుపలికి తీసుకునిపోయి 10,000 మంది ఖైమరు సమూహానికి చెందిన దళాలతో మెకాంగు నది పరీవాహక ప్రాంతంలోని లావో రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. వియంటియానును స్వాధీనం చేసుకోవడంతో దండయాత్ర ముగింపుకు వచ్చింది. ఆయన లావో రాజుల సంతతికి చెందినవాడని విశ్వసిస్తున్నారు.[31] ఆయన తన రాజ్యంలో థెరావాడ బౌద్ధమతాన్ని ప్రధాన మతంగా మార్చాడు. తరువాత లాన్ క్సాంగు రాజ్యం విస్తరించబడింది. స్థాపించిన 20 సంవత్సరాలలో ఈ రాజ్యం తూర్పువైపున్న వియత్నాంలోని అన్నామైటు పర్వతాల వెంట చంపా వరకు విస్తరించబడింది.[ఆధారం చూపాలి] ఆయన నీతిరహిత ప్రవర్తనను ఆయన మంత్రులు సంహించలేక 1373 లో ఆయనను బహిష్కరించిన తరువాత ప్రస్తుత థాయి లాండులోని నాన్ ప్రొవిన్సుకు చేరుకున్నాడు.[32] తరువాత ఆయన అక్కడే మరణించాడు. ఫా న్గుం పెద్ద కుమారుడు ఉన్ హ్యూవాను సంసెంతై పేరుతో సింహాసనం అధిరోహించి 43 సంవత్సరాలు పాలించాడు. సంసెంతై పాలనలో లాన్ క్సాంగు ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది. కానీ 1421 లో ఆయన మరణించిన తరువాత వారి శతృవర్గాలు (వారితో 100 సంవత్సరాల కాలం పోరాడుతున్న వర్గాలు) వారిని పతనం చేసాయి.[ఆధారం చూపాలి]

1520 లో ఫోటోసిరతు సింహాసనం అధిష్టించిన తరువాత తన రాజ్యాన్ని బర్మా దండయాత్రనుండి రక్షించడానికి రాజధానిని లుయాంగు ప్రాబాంగు నుండి వియంటియానుకు తరలించాడు. ఫోటోసిరతు చంపబడిన తరువాత 1548 లో ఆయన కుమారుడు సెట్తాతిరతు రాజు అయ్యాడు. ఆయన పాలనలో లావోస్ చిహ్నమైన " దట్ లువాంగు " నిర్మించమని ఆదేశించాడు. కంబోడియామ సైనిక దండయాత్ర నుండి తిరిగి వచ్చేటప్పుడు సెట్తాతిరతు మార్గమద్యంలోని పర్వతాలలో అదృశ్యమైన తరువాత లాన్ క్జాంగు వేగంగా క్షీణించడం ప్రారంభించింది.[ఆధారం చూపాలి]

1637 నాటికి సోలిగ్నా వోంగ్సా సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో లాన్ క్సాంగు సరిహద్దులు మరింత విస్తరించబడ్డాయి. ఆయన పాల లావోస్ స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఆయన వారసుడు లేకుండా మరణించిన తరువాత రాజ్యం మూడు రాజ్యాలుగా విడిపోయింది. 1763 - 1769 మధ్యకాలంలో బర్మా సైన్యాలు ఉత్తర లావోస్‌ను అధిగమించి లుయాంగు ఫ్రాబాంగును స్వాధీనం చేసుకున్నాయి. చివరికి చంపసాక్ సియామీల ఆధిపత్యంలోకి వచ్చింది.[ఆధారం చూపాలి]

సియామీలు చావో అనౌవాంగును వియంటియాను రాజుగా నియమించారు. ఆయన లావోస్‌లో లలిత కళలు, సాహిత్యం పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించాడు. అలాగే లుయాంగు ఫ్రాబాంగుతో సంబంధాలను మెరుగుపరిచాడు. 1826 లో వియత్నామీల ఒత్తిడి కారణంగా ఆయన సియామీల మీద తిరుగుబాటు చేశాడు. అయినప్పటికీ ఈ తిరుగుబాటు విఫలమై వియంటియాను దోచుకోబడింది.[33] అనౌవాంగును ఖైదీగా బ్యాంకాకుకు తీసుకెళ్లారు. తరువాత అక్కడ ఆయన మరణించాడు.[ఆధారం చూపాలి]

1876 ​​లో లావోస్‌లో జరిగిన ఒక సియామీల సైనిక పోరాటాన్ని బ్రిటిషు పరిశీలకుడు " ఈ పోరాటాలు పెద్ద ఎత్తున నిర్వహించబడిన బానిస-వేట దాడులుగా మారాయి" అని వర్ణించారు.[34]

ఫ్రెంచి లావోసు (1893–1953)

Local Lao soldiers in the French Colonial guard, సుమారు 1900

19 వ శతాబ్దం చివరలో " చైనీస్ బ్లాక్ ఫ్లాగ్ " ఆర్మీ లుయాంగు ప్రబాంగును దోచుకుంది.[35] ఫ్రాన్సు పాలకుడు " కింగ్ ఉన్ ఖాం "నును రక్షించి లుయాంగు ఫ్రాబాంగును ఫ్రెంచి ఇండోచైనా రక్షితప్రాంతంలో చేర్చింది. కొంతకాలం తర్వాత వియంటియాను రక్షితప్రాంతంలో చంపాసకు రాజ్యం కూడా చేర్చబడింది. ఏకీకృత లావోస్‌కు లుయాంగు ఫ్రాబాంగు రాజు సిసావాంగు వాంగు పాలకుడు అయ్యాడు. ఈ రాజ్యానికి మరోసారి వియంటియాను రాజధానిగా అవతరించింది.[ఆధారం చూపాలి]

ఫ్రాన్సు లావోస్‌కు ప్రత్యేకంగా ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వ లేదు. [36] ఫ్రెంచి పాలనలో ఫ్రెంచి రక్షితప్రాంతంలో ఆర్థికంగా ప్రాధాన్యత వహించిన అన్నం, థాయిలాండు, టోంకిన్ల మధ్య అనుసంధిత రాజ్యంగా ఉన్న లావోస్‌లో ఫ్రెంచి కొర్వీ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ ఆధారంగా లావోలోని పురుషులందరూ బలవంతంగా వలస ప్రభుత్వానికి సంవత్సరానికి 10 రోజుల శ్రమను అందించాలని నిర్బంధించబడ్డారు.[ఆధారం చూపాలి] లావోస్‌లో టిన్, రబ్బరు, కాఫీ ఉత్పత్తి చేయబడుతున్నప్పటికీ ఫ్రెంచి ఇండోచైనా ఎగుమతులలో అది ఒక శాతం కంటే అధింగా లేని కారణంగా అది తగినంతగా గుర్తించబడలేదు. 1940 నాటికి లావోస్‌లో 600 మంది ఫ్రెంచి పౌరులు నివసించారు.[37] ఫ్రెంచి పాలనలో వియత్నామీయుల లావోస్‌ వలస ప్రోత్సహించబడింది. వలసపాలకులు దీనిని ఇండోచైనా- వలస ప్రాంతాల భూభాగకొరత సమస్యకు ఆచరణాత్మక పరిష్కారంగా భావించారు.[38] 1943 నాటికి వియత్నాం జనాభా దాదాపు 40,000. లావోస్ అతిపెద్ద నగరాలలో సంఖ్యాపరంగా వియత్నామీయులు ఆధిఖ్యతలో ఉన్నారు. వియత్నామీయులు వారి స్వంత నాయకులను ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారు.[39] పర్యవసానంగా, వియంటియాను జనాభాలో 53%, థాఖేకులో 85%, పాక్సేలో 62% వియత్నామీయులు ఉన్నారు. [39] 1945 నాటికి ఫ్రెంచి వారు ఇండోచైనా మీద జపనీయులు చేసినదాడిలో విస్మరించబడిన వియంటియాను మైదానం, సవన్నాఖెటు ప్రాంతం, బోలావెను పీఠభూమి వంటి మూడు కీలక ప్రాంతాలకు వియత్నామీయులను తరలించాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించారు.[39] మార్టిన్ స్టువర్ట్-ఫాక్స్ అభిప్రాయం ఆధారంగా లావోప్రజలు వారి స్వంత దేశం మీద నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు.[39]

రెండవ ప్రపంచ యుద్ధంలో విచి ఫ్రాన్సు, థాయిలాండు, ఇంపీరియల్ జపాను దళాలు ఫ్రాంసు ఆక్రమిత లావోస్‌ ఆక్రమించాయి. [ఆధారం చూపాలి] 1945 మార్చి 9 న లావోస్ జాతీయ బృందం " లుయాంగు ప్రభాంగు " రాజధానిగా లావోస్ స్వాతంత్ర్యం ప్రకటించింది. ఏప్రిలు 7 న ఆయన ఫ్రెంచి రక్షితప్రాంతంగా లావోస్ హోదాకు ముగింపు ప్రకటించింది. 1945 ఏప్రెలు 7 న రెండు జపాను బెటాలియన్లు నగరాన్ని ఆక్రమించారు.[40]అందుకు ప్రతిస్పందనగా లుయాంగు ఫ్రబాంగు రాజైన సిసవాంగును వాంగును స్వాతంత్ర్యం ప్రకటించమని జపాను నిర్బంధించింది. అయినప్పటికీ సిసవాంగు వాంగు ఏప్రెలు 8 న ఫ్రెంచి రక్షితప్రాంతంగా లావోస్ కొనసాగింపు ముగింపుకు వచ్చిందని ప్రకటించాడు. తరువాత రాజు రాకుమారుడు కిండవాంగును సంకీర్ణదళానికి ప్రాతినిధ్యం వహించడానికి రహస్యంగా పంపాడు. అలాగే రాకుమారుడు సిసవాగును జపాను దళాలకు ప్రాతినిద్యం వహించడానికి పంపాడు.[40] జపాను లొంగిపోయినప్పుడు కొంతమంది లావో జాతీయవాదులు (రాకుమారుడు ఫెట్సారతుతో కలిసి) లావోస్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. కాని 1946 ప్రారంభంలో ఫ్రెంచి దళాలు దేశాన్ని తిరిగి ఆక్రమించి లావోస్‌కు పరిమిత స్వయంప్రతిపత్తిని ఇచ్చాయి.[41]

మొదటి ఇండోచైనా యుద్ధ సమయంలో ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ పాతే లావో స్వాతంత్ర్య సంస్థను ఏర్పాటు చేసి పాథెటు లావో వియత్నాం స్వాతంత్ర్య సంస్థ (వియతు మిన్) సహాయంతో ఫ్రెంచి వలసరాజ్యాల దళాలమీద యుద్ధం ప్రారంభించింది. 1950 లో ఫ్రెంచి యూనియనులో "అనుబంధ రాజ్యంగా" ఫ్రెంచి ప్రభుత్వం లావోస్‌కు సెమీ స్వయంప్రతిపత్తిని ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైంది. లావోస్ రాజ్యాంగ రాచరికం పూర్తి స్వాతంత్ర్యం పొందినప్పటికీ వాస్తవానికి లావోస్ 1953 అక్టోబరు 22 వరకు ఫ్రాన్సు నియంత్రణలో ఉంది.[42][41]

స్వాతంత్రం, కమ్యూనిస్టు పాలన (1953–ప్రస్తుత)

1953 మే 4 న సమావేశమైన ఫ్రెంచి సైనికాధికారి, రాకుమారుడు సిసవాంగు వత్థానా

మొదటి ఇండోచైనా యుద్ధానికి ఫ్రెంచి ఇండోచైనా వేదికగా ఉంది. ఈ యుద్ధం చివరికి ఫ్రెంచి ఓటమికి దారితీసింది. 1954 లో జరిగిన జెనీవా సమావేశంలో లావోస్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. 1955 లో యుఎస్ రక్షణ శాఖ " ఫ్రెంచి ఎవాల్యుయేషన్ ఆఫీస్ " పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను సృష్టించి ఫ్రెంచి మద్దతుతో కమ్యూనిస్టు పాథెటు లావోకు వ్యతిరేకంగా పోరాడి లావోస్‌లో " రాయల్ లావో ఆర్మీ " ని తొలగించి లావోస్‌ను యుఎస్ నియంత్రణ విధానంలో భాగం చేసింది.[ఆధారం చూపాలి]

1960 లో లావోస్ రాజ్యంలో వరుస తిరుగుబాట్లలో భాగంగా రాయల్ లావో ఆర్మీ, పాథెట్ లావో గెరిల్లాల (ఉత్తర వియత్నాం- కమ్యూనిస్టు మద్దతు, సోవియటు యూనియను-మద్దతుగల) మధ్య పోరాటం జరిగింది. 1962 లో " నేషనల్ యూనిటీ " పేరుతో రాకుమారుడు సౌవన్నా ఫోమా రూపొందించిన రెండవ తాత్కాలిక ప్రభుత్వం విజయవంతం కాలేదు. రాయల్ లావోటియా ప్రభుత్వం, పాతేట్ లావో మధ్య పెద్ద ఎత్తున తలెత్తిన అంతర్యుద్ధం కారణంగా పరిస్థితి క్రమంగా క్షీణించింది. పాథెటు లావోకు ఎన్.వి.ఎ, వియత్కాంగు సైనికపరంగా మద్దతు ఇచ్చాయి.[42][41]

1960 ల చివరలో లావోస్‌ మీద అమెరికా బాంబు దాడి ద్వారా నాశనం చేయబడిన జియాంగ్ఖౌంగు ప్రొవొంసు మాజీ రాజధాని మువాంగు ఖౌను శిధిలాలు

లావోస్ కొన్ని భాగాలు ఉత్తర వియత్నాం చేత ఆక్రమించబడిన కారణంగా వియత్నాం యుద్ధంలో లావోస్ ఒక ముఖ్య భాగం ఉంది. ఎందుకంటే దక్షిణప్రాంతం మీద యుద్ధానికి లావోస్ సరఫరా మార్గంగా ఉపయోగించబడింది. ప్రతిస్పందనగా యునైటెడు స్టేట్సు ఉత్తర వియత్నాం స్థానాలకు వ్యతిరేకంగా బాంబు దాడులను ప్రారంభించింది. లావోస్ క్రమరహితమైన సాధారణ యాంటీకామునిస్టు దళాలకు, లావోస్‌లోకి దక్షిణ వియత్నాం చొరబాట్లకు మద్దతు ఇచ్చింది (లావోస్‌లో సి.ఐ.ఎ. కార్యకలాపాలను చూడండి).[42][41]

రాయల్ లావో ఆర్మీతో పోరాడటానికి పతేటు లావోకు సహాయం చేయడానికి 1968 లో ఉత్తర వియత్నాం సైన్యం బహుళ-డివిజన్ దాడిని ప్రారంభించింది. ఈ దాడి ఫలితంగా సైన్యం ఎక్కువగా నిర్వీర్యమై సంఘర్షణను హ్మోంగు తెగకు చెందిన జనరల్ వాంగ్ పావో నేతృత్వంలోని దళాలకు (యునైటెడు స్టేట్సు "యు.ఎస్. సీక్రెట్ ఆర్మీ", థాయిలాండు దళాల మద్దతు కలిగిన) వదిలివేసింది. [ఆధారం చూపాలి]

రాయల్ కింగ్డమ్ ఆఫ్ లావోస్ ప్రభుత్వ పతనం నిరోధించడానికి పాథెట్ లావో మీద, వియత్నాం దళాల పీపుల్సు ఆర్మీ మీద యునైటెడు స్టేట్సు భారీ వైమానిక బాంబు దాడులు దాడి చేసింది. అలాగే యుఎస్ బలగాల మీద దాడి చేయడానికి వియత్నాం రిపబ్లిక్కు " హో చి మిన్ ట్రైల్ " ఉపయోగించడాన్ని యు.ఎస్. ప్రభుత్వం ఖండించింది.[42] 1964 - 1973 మధ్య లావోస్‌ మీద అమెరికా రెండు మిలియన్ల టన్నుల బాంబులను పడేసింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపా, ఆసియా మీద అమెరికా పడేసిన 2.1 మిలియన్ల టన్నుల బాంబులకు సమానం. లావోస్‌ను జనాభా పరిమాణంతో పోలిస్తే చరిత్రలో అత్యధికంగా బాంబు దాడికి గురైన దేశంగా భావించవచ్చు. న్యూయార్కు టైమ్సు "లావోస్‌లోని ఒక్కొక వ్యక్తి మీద దాదాపు ఒక టన్ను బాంబుదాడి జరిగింది " అని పేర్కొంది.[43] దాదాపు 80 మిలియన్ల విఫలమైన బాంబుల పేలుడుపదార్ధ! దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉంది. ఇవి వార్షికంగా సుమారు 50 మంది లావోటియన్ల మరణానికి కారణం ఔతుంది. అంతేకాక వ్యవసాయక్షేత్రాలు పండించడానికి అసాధ్యమై నిరుపయోగం ఔతున్నాయి. వీటిని నిర్వీర్యం చేయడం అసాధ్యం.[44] ఈ యుద్ధంలో ఉపయోగించిన క్లస్టరు బాంబుల ప్రభావం కారణంగా లావోస్ ఆయుధాలను నిషేధించటానికి 2010 నవంబరులో జరిగిన క్లస్టరు " రాష్ట్ర పార్టీల మొదటి సమావేశానికి " మూనిషన్సు కన్వెన్షను న్యాయవాది ఆతిథ్యం ఇచ్చారు.[45]

1972 లో వియంటియాను పాథెటు లావో సైనికులు

1975 లో పాథెటు లావో వియత్నాం పీపుల్స్ ఆర్మీ సోవియటు యూనియను మద్దతుతో రాచరిక లావో ప్రభుత్వాన్ని పడగొట్టారు. 1975 డిసెంబరు 2 న కింగ్ సావాంగు వత్థానాను బలవంతంగా పదవీ విరమణ చేయించిన తరువాత ఆయన జైలులో మరణించాడు. అంతర్యుద్ధంలో 20,000 - 62,000 మధ్య లావోటియన్లు మరణించారు.[42][46]

1975 డిసెంబరు 2 న కైసోను ఫోమ్విహేనే ఆధ్వర్యంలోని పాథెట్ లావో ప్రభుత్వం దేశం మీద నియంత్రణ సాధించిన తరువాత దేశం పేరును " లావో పీపుల్సు డెమోక్రటికు రిపబ్లికు " గా పేరు మార్చింది. తరువాత వియత్నాంలో సాయుధ దళాలను నిలబెట్టడానికి, దేశాన్ని పర్యవేక్షించడంలో సహాయపడటానికి సలహాదారులను నియమించే ఒప్పందాలపై సంతకం చేసింది. 1977 లో సంతకం చేసిన ఒక ఒప్పందం ద్వారా లావోస్, వియత్నాం మధ్య సంబంధాలు లాంఛనప్రాయమయ్యాయి. ఇది లావో విదేశాంగ విధానానికి సూచనలు మాత్రమే కాకుండా రాజకీయ, ఆర్ధిక జీవితంలోని అన్ని స్థాయిలలో వియత్నాం ప్రమేయాం మీద ఆధారపడడాన్ని లావో అధిగమించిందనడాన్ని సూచించింది.[42][47] 1979 లో లావోస్‌ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం, పీపుల్సు రిపబ్లికు ఆఫ్ చైనాతో సంబంధాలను ముగించాలని భావించింది. ఇది యునైటెడు స్టేట్సు, ఇతర దేశాల వాణిజ్యంలో చైనాను ఒంటరిగా చేయడానికి దారితీసింది.[48] 1979 లో లావోస్‌లో 50,000 మంది వియత్నాం దళాలు, 6,000 మంది వియత్నాం అధికారులు వియంటియానులోని మంత్రిత్వ శాఖలకు జతచేయబడ్డారు.[49][50]

లావోస్‌లోని ముఖ్య ప్రాంతాలలో వియత్నాం పీపుల్స్ ఆర్మీ ఆఫ్ ది సోషలిస్టు రిపబ్లికు ఆఫ్ వియత్నాం, వియత్నాం-మద్దతుగల పాథెట్ లావో మిశ్రిత దళాలు, హ్మోంగు తిరుగుబాటుదారుల మద్య యుద్ధం కొనసాగింది. వీటిలో సయసబౌన్ క్లోజ్డు మిలిటరీ జోన్, వియంటియాను ప్రొవిన్సు సమీపంలో ఉన్న జిసాంబౌను క్లోజ్డు మిలిటరీ జోన్, జియాంగు ఖౌవాంగు ప్రావిన్సు ఉన్నాయి. 1975 నుండి 1996 వరకు యునైటెడు స్టేట్సు, థాయిలాండు 2,50,000 లావో శరణార్థులకు పునరావాసం కల్పించింది. ఇందులో 130,000 హ్మోంగు[51] (చూడండి: ఇండోచైనా శరణార్థుల సంక్షోభం).


2015 డిసెంబరు 2 న లావోస్ రిపబ్లిక్కు 40 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.[52]

భౌగోళికం

లౌగు ప్రభాంగు మీదుగా ప్రవహిస్తున్న మెకాంగు నది
లావోస్ వరిపొలాలు

ఆగ్నేయాసియాలో లావోస్ మాత్రమే భూబంధితదేశం దేశంగా ఉంది. ఇది 14 ° - 23 ° ఉత్తర అక్షాంశం (ఒక చిన్న ప్రాంతం 14 డిగ్రీలు దక్షిణంగా ఉంటుంది), రేఖాంశాలు 100 ° - 108 ° తూర్పురేఖాంశంలో ఉంటుంది. లావోస్ దట్టమైన అటవీ భూభాగం, అధికంగా కఠినమైన పర్వతప్రాంతాలను కలిగి ఉంటుంది. మైదానాలు - పీఠభూములతో కూడిన 2,818 మీటర్లు (9,245 అడుగులు) ఎత్తైన ఫౌ బియా ప్రాంతం దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా ఉంది. మెకాంగు నది లావోస్, థాయిలాండు మద్య పశ్చిమ సరిహద్దులో ఎక్కువ భాగాన్ని ఏర్పరుస్తుంది. అన్నమైటు పర్వతశ్రేణి లావోస్, వియత్నాం మద్య తూర్పు సరిహద్దులో ఎక్కువ భాగం ఏర్పరుస్తుంది. లుయాంగు ప్రాబాంగు పర్వతశ్రేణి లావోస్ థాయిలాండు ఎత్తైన ప్రాంతాల మద్య వాయువ్య సరిహద్దులో అధికభాగాన్ని ఏర్పరుస్తాయి. దేశంలోని ఉత్తరభూభాగంలో జియాంగుఖోంగు, దక్షిణాంత భూభాగంలో బోలావెను పీఠభూమి ఉన్నాయి.[ఆధారం చూపాలి] దేశంలో వర్షపాత ప్రభావితమైన ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉటుంది.[53]

మే నుండి నవంబరు వరకు ప్రత్యేకమైన వర్షాపాతం ఉంటుంది. తరువాత డిసెంబరు నుండి ఏప్రిలు వరకు పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం మూడు సీజన్లు (వర్షం, చల్లని, వేడి) వాతావరణం ఉంటుంది. పొడి వాతావరణ తరువాత రెండు నెలలు వేడివాతావరణం ఉంటుంది.[53] లావోస్ రాజధాని, అతిపెద్ద నగరం అయిన వియంటియానుతో లుయాంగు ప్రాబాంగు, సవన్నాఖెటు, పాక్సే వంటి ఇతర ప్రధాన నగరాలు ఉన్నాయి.

1993 లో లావోస్ ప్రభుత్వం దేశం భూభాగంలో 21% భూభాగాన్ని నివాసయోగ్యమైన పరిరక్షణప్రాంతంగా కేటాయించింది.[54] "గోల్డెన్ ట్రయాంగిల్" అని పిలువబడే గసగసాల పండించబడే నాలుగు దేశం లావోస్ ఒకటిగా ఉంది.[55] సౌత్ ఈస్టు ఆసియాలోని యు.ఎన్.ఒ.డి.సి. ఫాక్ట్ బుక్కు 2007 అక్టోబరు " ఆధారంగా 2006 లో లావోస్‌లో గసగసాల సాగు విస్తీర్ణం 15 కి.మీ.[56]

లావోస్ మూడు భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉన్నట్లు పరిగణించవచ్చు: ఉత్తర, మధ్య, దక్షిణ.[57]

వాతావరణం

కోప్పెను వాతావరణ వర్గీకరణ భౌగోళిక వివరణా చిత్రం

లావోస్‌లో అధికంగా ఉష్ణమండల సవన్నా వాతావరణం నెలకొని ఉంది. ఉష్ణమండల రుతుపవనాలు, తేమతో కూడిన ఉప-ఉష్ణమండల వాతావరణం కూడా సంభవిస్తుంది.[ఆధారం చూపాలి]లావోస్ తీవ్రమైన వాతావరణ మార్పిడితో బాధించబడుతుంది. దేశంలోని ప్రొవింసులన్ని మొత్తంగా అత్యంత సమస్యాత్మకమైన వాతావరణమార్పిడి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.[58]

నిర్వహణా విభాగాలు

లావోస్‌ను 17 ప్రావింసులు (ఖౌఎంగు), ఒక ప్రిఫెక్చరు (కాంపెంగు నాఖోను) గా విభజించారు. ప్రిఫెక్చరు ప్రొవొంసులో రాజధాని నగరం వియంటియాను (నాఖోను లూవాంగు వియాంగుచాను) ఉంది.[59] 2013 డిసెంబరు 13 న కొత్తగా జైసోంబౌను ప్రావిన్సు, స్థాపించబడింది.[60] ప్రావింసులను జిల్లాలుగా (మువాంగు), తరువాత గ్రామాలుగా (బాను) విభజించారు. "పట్టణ" గ్రామం తప్పనిసరిగా ఒక పట్టణంగా భావించబడుతుంది.

[57]

సంఖ్యఉపవిభాగాలురాజధానిప్రాంతం (km2)జనసంఖ్య
1అట్టపియుఅట్టపియు (సమఖ్ఖ్సిక్సే జిల్లా)10,3201,14,300
2బొకెయొబాన్ హౌయాక్సే (హౌయాక్సే జిల్లా)6,1961,49,700
3బొలిఖంసైపక్సన్ (పక్సనె జిల్లా)14,8632,14,900
4చంపసక్పక్సె (పక్సె జిల్లా)15,4155,75,600
5హౌవా పన్క్సాం నెయుయా (క్సమ్నెయుయా జిల్లా)16,5003,22,200
6ఖమ్మౌనెతఖెకు (తఖెకె జిల్లా)16,3153,58,800
7లుయాంగు నంతలుయాంగు నంత (నంత జిల్లా)9,3251,50,100
8లుయాంగు ప్రబాంగులుయాంగు ప్రబాంగు (లుయాంగు ప్రబాంగు జిల్లా)16,8754,08,800
9ఔడొంక్సెముయాంగు క్సే (క్సె జిల్లా)15,3702,75,300
10ఫొంగ్సలిఫొంగ్సలి (ఫొంగ్సలి జిల్లా)16,2701,99,900
11సేబౌలిసేబౌలీ (క్సెయాబురీ జిల్లా)16,3893,82,200
12సల్వనుసల్వను (సల్వను జిల్లా)10,6913,36,600
13సవన్నఖెతుసవన్నఖెతు (ఖంతదౌలి జిల్లా)21,7747,21,500
14సెకాంగుసెకాంగు (లమర్ము జిల్లా)7,66583,600
15వియంటియానె ప్రిఫెక్చరువియంటియన్నె (చంతబౌలి జిల్లా)3,9207,26,000
16వియంటియన్నె ప్రొవింసుఫొంహాంగు (ఫొంహాంగు జిల్లా)15,9273,73,700
17క్సియాంగు ఖౌయాంగుఫొంసవన్ (పెక్ జిల్లా)15,8802,29,521
18క్సియాసొంబౌను ప్రొవింసుఅనౌవొంగు (అనౌవొంగు జిల్లా)8,30082,000
లావోస్ ప్రొవిసు మ్యాపు (2014)

విదేశీసంబంధాలు

విదేశీసంబంధాలు

విదేశీ సంబంధాలు

2008 లో ఢిల్లీలో నిర్వహించబడిన ఆగ్నేయాసియా దేశాల అసోసియేషను సమావేశంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ప్రధాని థాంగ్లౌను సిసౌలితు

లావో పీపుల్సు డెమోక్రటికు రిపబ్లికు ప్రభుత్వం సోవియటు బ్లాకుతో పొత్తు పెట్టుకుని సోవియటు యూనియనుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. 1975 డిసెంబరులో పాథెటు లావోను స్వాధీనం చేసుకున్న తరువాత పశ్చిమ దేశాలు, లావోస్ మద్య శత్రుత్వం చోటుచేసుకుంది. లావోస్ వియత్నాంతో "ప్రత్యేక సంబంధాన్ని" కొనసాగిస్తూ 1977 లో స్నేహం, సహకారం ఒప్పందం మీద సంతకం చేసిన కారణంగా చైనాతో ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకోవడానికి దారితీసింది.[ఆధారం చూపాలి]

సోవియటు యూనియను పతనంతో వియత్నాంకు సహాయం అందించే సామర్థ్యం తగ్గడంతో లావోస్ తన పొరుగుదేశాలతో సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించింది.[ఆధారం చూపాలి]


అంతర్జాతీయ ఒంటరితనం అనుభవిస్తున్న లావోస్ పాకిస్తాను, సౌదీ అరేబియా, చైనా, టర్కీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, జపాను, స్వీడను వంటి ఇతర దేశాలతో సంబంధాల మెరుగుపరచి అంతర్జాతీయంగా దేశానికి గుర్తింపు సాధించింది.[61][ఆధారం చూపాలి] 2004 నవంబరులో కాంగ్రెసు ఆమోదించిన చట్టం ఆధారంగా యునైటెడు స్టేట్సు తో వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.[62]

1997 జూలైలో లావోస్ అసోసియేషను ఆఫ్ ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) లో సభ్యదేశం అయింది. 2016 లో ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశం అయింది.[63] 2005 లో ఇది ప్రారంభ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి హాజరైంది.[64]

ఆర్ధికం

About 80% of the Laotian population practises subsistence agriculture.

లావో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులు, వాణిజ్యం కొరకు పొరుగు దేశాలైన థాయిలాండు, వియత్నాం, ప్రధానంగా ఉత్తరసరిహద్దున ఉన్న చైనా మీద ఆధారపడి ఉంటుంది. థాయిలాండు, వియత్నాంతో సరిహద్దు దాటిన వాణిజ్యం (క్రాస్-బార్డర్) ఆధారంగా వృద్ధిని సాధించిందని ఫాక్సే అభిప్రాయపడ్డాడు. 2009 లో అధికారికంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పటికీ అమెరికాలోని ఒబామా పరిపాలన కాలంలో లావోస్ ఇక మీద మార్క్సిస్టు-లెనినిస్టు రాజ్యం కాదని అమెరికా ప్రభుత్వం ప్రకటించి యుఎస్ ఎగుమతి-దిగుమతి బ్యాంకు నుండి ఫైనాన్సింగు పొందుతున్న లావో కంపెనీల మీద నిషేధాన్ని ఎత్తివేసింది.[65] 2011 లో లావో సెక్యూరిటీసు ఎక్స్ఛేంజి ట్రేడింగు ప్రారంభమైంది. 2012 లో లావోస్ ట్రేడ్ పోర్టలు ప్రభుత్వం అన్ని సమాచార వ్యాపారులను కలుపుకొని వెబ్సైటును దేశంలోకి దిగుమతి, ఎగుమతి చేయడానికి అవసరమైన వెబ్సైటును రూపొందించడం ప్రారంభించింది.[ఆధారం చూపాలి]

2016 లో లావోస్ ఆర్థిక వ్యవస్థలో చైనా అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు దేశంగా ఉంది. 1989 నుండి చైనా లావోసులో 5.395 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిందని లావోస్ పెట్టుబడుల ప్రణాళిక మంత్రిత్వ శాఖ 1989–2014 మద్యకాల నివేదికలో తెలిపింది. తరువాత స్థానంలో ఉన్న థాయిలాండు (యు.ఎస్ $ 4.489 బిలియన్లు), వియత్నాం (3.108 బిలియన్ల యు.ఎస్. డాలర్లు) పెట్టుబడులతో అతిపెద్ద పెట్టుబడిదారు దేశాలుగా రెండవ, మూడవ స్థానంలో ఉన్నాయి.[66]

లావోస్ జీవనాధారంగా ఉన్న వ్యవసాయ ఆదాయం ఇప్పటికీ జిడిపిలో 50% వరకు ఉంది. వ్యవసాయరంగం 80% ఉపాధి సౌకర్యాలను అందిస్తుంది. దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి కేవలం 4.01% మాత్రమే ఉంది. కేవలం 0.34% భూమి మాత్రమే శాశ్వత పంట భూమిగా ఉపయోగించబడుతుంది.[67] గ్రేటరు మెకాంగు ఉపప్రాంతంలో వ్యవసాయక్షేత్రాలు అతి తక్కువ శాతం మాత్రమే ఉన్నాయి.[68] సాగులో ఉన్న భూభాగంలో 28% నికి మాత్రమే సాగునీరు అందించబడుతుంది. ఇది 2012 లో మొత్తం వ్యవసాయ యోగ్య భూభాగంలో 12% మాత్రమే ఉన్నట్లు సూచిస్తుంది.[69] వ్యవసాయ రంగంలో వరిపంట ఆధిపత్యం చేస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూభాగంలో 80% వ్యవసాయ భూమిని వరిని పండించడానికి ఉపయోగిస్తారు.[70] లావో వ్యవసాయ గృహాలలో సుమారు 77% మంది వరిధ్యాన్య నిలువలలో స్వయం సమృద్ధిగా ఉన్నారు.[71]

1990 - 2005 మధ్య మెరుగైన వరి రకాలను అభివృద్ధి చేసి విడుదల చేయడం, స్వీకరించడం, ఆర్థిక సంస్కరణల కారణంగా ఉత్పత్తి 5% అభివృద్ధిని సాధించింది.[72] 1999 లో లావో పిడిఆర్ మొదటిసారిగా బియ్యం దిగుమతులు, ఎగుమతుల నికర సమతుల్యతను సాధించింది.[73] లావో పిడిఆర్ గ్రేటరు మెకాంగు ఉపప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బియ్యం రకాలను కలిగి ఉండవచ్చని భావించబడుతుంది. 1995 నుండి లావో ప్రభుత్వం ఫిలిప్పీంసులోని అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి లావోసులో లభించే వేలాది బియ్యం రకాలన్నింటి విత్తన నమూనాలను సేకరించడానికి పనిచేస్తోంది.[74]

వియంటియానులోని ఉదయం మార్కెటు

ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వనరుల (ఐ.ఎం.ఎఫ్), ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంకు, వంటి ఇతర ఆర్ధిక వనరుల నుండి అభివృద్ధి సహాయాన్ని పొందుతుంది; అంతేకాక సమాజాభివృద్ధి, పరిశ్రమ, జలవిద్యుత్తు, మైనింగు (ముఖ్యంగా రాగి, బంగారం) అభివృద్ధికి వీదేశాల ప్రత్యక్ష పెట్టుబడులు సహకరిస్తున్నాయి. పర్యాటక రంగం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా ఉంది.[ఆధారం చూపాలి]నిపుణుల వలసలు లావోస్ ఆర్ధికాభివృద్ధికి అడ్డుకట్టగా ఉంది. 2000 లో 37.4% నిపుణుల వలస రేటు ఉంది.[75]

లావోస్ ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంది. పెట్రోలియం, సహజవాయువు దిగుమతి చేయబడుతున్నాయి. బొగ్గు, బంగారం, బాక్సైటు, టిన్, రాగి, ఇతర విలువైన లోహాల గణనీయమైన నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా దేశంలో సమృద్ధిగా ఉన్న నీటి వనరులు, పర్వత భూభాగం పెద్ద మొత్తంలో జలవిద్యుతు శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తాయి. సుమారు 18,000 మెగావాట్ల సామర్ధ్యంలో 8,000 మెగావాట్లు థాయిలాండు, వియత్నాంలకు ఎగుమతి చేయబడుతుంది.[76]

దేశంలో అత్యంత విస్తృతంగా గుర్తించబడిన ఉత్పత్తిచేయబడుతున్న బీర్లావొ అనే మద్యం అధికంగా అమెరికా, బ్రిటను, జర్మనీ, జపాను, దక్షిణ కొరియా, పొరుగున ఉన్న కంబోడియా, వియత్నాం వంటి ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అవుతుంది. దీనిని లావో బ్రూవరీ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.[ఆధారం చూపాలి]

లావోస్ మైనింగు పరిశ్రమ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో అంతర్జాతీయ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ రంగం 2003-04 నుండి లావోస్ ఆర్ధిక స్థితికి గణనీయమైన కృషి చేసింది. 540 కంటే అధికంగా బంగారం, రాగి, జింకు, సీసం వంటి ఇతర ఖనిజనిక్షేపాలు గుర్తించబడి, అన్వేషించబడి, తవ్వబడ్డాయి.[77]

2018 లో దేశం మధ్యస్థ అభివృద్ధిని సూచించేమానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో లావోస్ 139 వ స్థానంలో ఉంది.[78] గ్లోబల్ హంగర్ ఇండెక్సు (2018) ఆధారంగా అత్యంత తీవ్రమైన ఆకలి పరిస్థితి (లు) ఉన్న 52 దేశాల జాబితాలో లావోస్ 36 వ దేశంగా ఉంది.[79]

2019 లో తీవ్ర పేదరికం, మానవ హక్కుల సంబంధిత యుఎన్ స్పెషల్ రిపోర్టరు లావోస్‌కు అధికారిక పర్యటనను నిర్వహించాడు. ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలనకు దేశం అనుసరిస్తున్న విధానం "తరచుగా చాలా ప్రతికూల ఫలితాలు ఇస్తూ మరింత పేదరికానికి దారితీసి మానవహక్కులను దెబ్బతీస్తుంది. పేద, అట్టడుగు వర్గాలు దీనికారణంగా బాధించబడుతున్నారు. "[80]

2019 మార్చిలో గంజాయిని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని అనుమతించటానికి లావోస్ ప్రభుత్వం ఆసక్తిని ప్రకటించింది. గంజాయి వైద్య వినియోగం గురించి చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఒక సెమినారు నిర్వహించడానికి ఇతర రంగాల సహకారంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాని కార్యాలయం నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తదుపరి నిర్ణయానికి అనుకూలంగా సెమినారు చర్చ ఫలితాలు ప్రభుత్వానికి నివేదించబడతాయి.[81]

పర్యాటకం

ఎగువ భూభాగంలోని " వాటు ఫౌ " వద్ద ఉన్న అభయారణ్యం నుండి కనిపిస్తున్న మెకాంగు నది

1990 లో 80,000 అంతర్జాతీయ సందర్శకులు లావోస్‌ను సందర్శించగా 2010 నాటికి వారి సంఖ్య 1.876 మిలియన్లకు అభివృద్ధి చెందిందని పర్యాటక రంగం సూచిస్తుంది.[82] 2010 లో పర్యాటకరంగం నుండి లభించిన ఆదాయాయం 679.1 మిలియన్ల డాలర్లు. ఇది 2020 నాటికి 1.5857 బిలియన్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. 2010 లో 10.9:1 నిష్పత్తి ఉద్యోగాలను పర్యాటక రంగం సృష్టించింది. అంతర్జాతీయ సందర్శకులు, పర్యాటక వస్తువుల ఎగుమతి నుండి లభిస్తున్న ఆద్యాయం మొత్తం ఎగుమతులలో 15.5% ఉంది. 2010 లో పర్యాటక రంగం నుండి 270.3 మిలియన్ల డాలర్లు ఆదాయం లభించవచ్చని అంచనా వేయబడింది. 2020 లో ఇది 484.2 మిలియన్ల డాలర్లకు (మొత్తం 12.5%) చేరుకుంటుందని అంచనా వేయబడింది.[83]

ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అధికారికంగా "సింపుల్ బ్యూటిఫుల్" అని పర్యాటక ఆకర్షణ నినాదం చేస్తుంది. వియంటియాను రాజధానిలో గ్యాస్ట్రోనమీ, పురాతన దేవాలయాలు (మువాంగు న్గోయి న్యూవా, వాంగు వియెంగులో బ్యాక్ప్యాకింగు), ప్లెయిన్ ఆఫ్ జార్స్ ప్రాంతంలోని పురాతన, ఆధునిక సంస్కృతుల కలయిక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. సాం న్యూవాలో లావోస్ సివిల్ వార్ చరిత్ర; ఫోంగ్సాలీ, యు లుయాంగు నామ్థాతో వంటి అనేక కొండప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన తెగలను సందర్శించడం; నాం ఎట్-ఫౌ లూయీలోని పులులు, ఇతర వన్యప్రాణులను సందర్శించడం, తఖేక్ సమీపంలో ఉన్న గుహలు, జలపాతాలు (సి ఫాన్ డాన్ వద్ద ఇర్వాడ్డి డాల్ఫిన్, ఖోన్ ఫాఫెంగ్ జలపాతం), నాలుగు వేల ద్వీపాలు, పురాతన ఖైమరు ఆలయ సముదాయం వాట్ ఫౌ; బోలావెను పీఠభూమిలోని జలపాతాలు, కాఫీ తోటలు వంటివి అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి.[ఆధారం చూపాలి] లావోస్‌కు ట్రేడు & టూరిజం యూరేపియను కౌంసిలు " వరల్డు బెస్టు టూరిస్టు డెస్టినేషను " అవార్డు (వాస్తుకళ, చరిత్రలకు) ఇచ్చింది.[84]లుయాంగు ప్రబాంగు, వాట్ ఫౌ రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడుతున్నాయి.[ఆధారం చూపాలి]ఏప్రెలు 13-14 తేదీలలో కొత్తసంవత్సరం వేడుకలు, ప్రధాన పడుగలను జరుపుకుంటారు. లావోస్‌లో జరుపుకునే వాటర్ ఫెస్టివల్ థాయిలాండు, ఆగ్నేయ ఆసియాలలో కంటే ఆకర్షణీయంగా ఉంటుంది.

లావో నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషను సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగాలు కలిసి దేశ జాతీయ పర్యావరణ పర్యాటక వ్యూహం, కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాయి. జాతి సమూహాల ప్రాముఖ్యత, జీవ వైవిధ్యం మీద అవగాహన పెంచడం మీద పర్యాటకరగం దృష్టిని కేద్రీకరిస్తుంది. ఈ సంస్థలు లావో రక్షిత ప్రాంత నెట్వర్కు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడం, కొనసాగించడం, నిర్వహించడం, ఆదాయ వనరులను అందించడానికి కృషిచేస్తుంటాయి. పర్యావరణ పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయబడే ప్రాతాలకు పర్యాటక జోనింగు, నిర్వహణ అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ సంస్థలు బాధ్యత వహిస్తున్నాయి.[85]

లావోస్ పట్టు, స్థానిక హస్తకళ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందింది. ఇవి లుయాంగు ప్రాబాంగు నైటు మార్కెట్లలో, ఇతర ప్రదేశాలలో ప్రదర్శించి విక్రయించబడుతున్నాయి. మరో ప్రత్యేకత మల్బరీ టీ.[ఆధారం చూపాలి]

మౌలికనిర్మాణాలు

లావోస్ రవాణావ్యవస్థలో నదులు ప్రధానపాత్ర వహిస్తున్నాయి

లావోస్‌లో " వియంటియాను వాట్టే అంతర్జాతీయ విమానాశ్రయం ", లుయాంగు ప్రాబాంగు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. పాక్సే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కొన్ని అంతర్జాతీయ విమానసేవలు అధిస్తుంది. జాతీయ క్యారియరు అయిన లావో ఎయిర్లైన్సుతో బ్యాంకాకు ఎయిర్వేసు, వియత్నాం ఎయిర్లైన్సు, ఎయిర్‌ ఆసియా, థాయి ఎయిర్వేస్ ఇంటర్నేషనల్, చైనా ఈస్టర్ను ఎయిర్లైన్సు, సిల్క్ ఎయిర్ దేశానికి వాయుమార్గ ప్రయాణ సేవలు అందిస్తున్నాయి.

లావోస్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేవు. వియంటియానును థాయిలాండుతో థాయి-లావో అనుసంధానించడానికి ఒక చిన్న మైత్రీపూర్వక వంతెన మినహా తప్ప లావోస్‌లో రైల్వేలు లేవు. ఫ్రెంచి వారు చంపసాకు ప్రావింసులో ఒక చిన్న పోర్టేజి రైల్వే, డాన్ డెట్ - డాన్ ఖాన్ నేరో గేజి రైల్వేను నిర్మించారు. అయినప్పటికీ అది 1940 ల నుండి మూసివేయబడింది. 1920 ల చివరలో థాఖేక్-టాన్ ఎపి రైల్వేలో పనులు ప్రారంభమయ్యాయి. క్వాంగు బాన్ ప్రావిన్సు, వియత్నాం మధ్య ము గియో ఘాటుమార్గం మీదుగా నిర్మించబడిన రైలుమార్గంలో థఖేకు, ఖమ్మౌనే ప్రావిన్సు, టాన్ రైల్వే స్టేషన్లు నిర్మించబడ్డాయి. 1930 లలో ఈ పథకం రద్దు చేయబడింది. ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించే ప్రధాన రహదారులు (ముఖ్యంగా రూట్ 13 వంటివి) ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. అయితే ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న గ్రామాలు చేరుకోవడానికి ఏడాది పొడవునా అందుబాటులో లేని చదును చేయబడని రహదారుల ద్వారా మాత్రమే ఉంటాయి.[ఆధారం చూపాలి]

పరిమితమైన బాహ్య, అంతర్గత టెలికమ్యూనికేషను ఉంది. అయితే పట్టణ కేంద్రాలలో విస్తారంగా మొబైలు ఫోన్లు ఉపయోగించబడుతున్నాయి. చాలా గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్తు కనీసప్రమాణంలో లభిస్తుంది. దేశంలోని సుదూర ప్రాంతాలలో స్థానిక ప్రజా రవాణా కోసం సాంగుథ్యూలను (బెంచీలతో కూడిన పిక్-అప్ ట్రక్కులు) ఉపయోగిస్తారు.

లావోస్ పారిశుద్ధ్యం వసతి విశేషంగా పురోగతి సాధించింది. దాని 2015 మిలీనియం డెవలప్మెంటు లక్ష్యాన్ని కాలపరిమితికి ముందే చేరుకుంది.[86] ప్రధానంగా గ్రామీణ (68%) జనాభా అధికంగా ఉన్న లావోస్‌లో పారిశుద్ధ్యంలో పెట్టుబడులు పెట్టడం కష్టతరంగా మారింది. 1990 లో గ్రామీణ జనాభాలో 8% మందికి మాత్రమే మెరుగైన పారిశుద్ధ్యం లభించింది.[86]అందుబాటు శాతం 1995 లో 10% ఉండగా 2008 లో నాటికి 38% అభివృద్ధి చెందింది. 1995 - 2008 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలలో సుమారు 12,32,900 మందికి మెరుగైన పారిశుద్ధ్యం లభించింది.[86]

అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే లావోస్ పురోగతి గుర్తించదగినదిగా భావించబడుతుంది.[86] చిన్న-స్థాయి స్వతంత్ర ప్రొవైడర్లు ఆకస్మికంగా ఉద్భవించడం, ప్రభుత్వ అధికారులు ప్రోత్సహించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది.[ఆధారం చూపాలి]ఇటీవలికాలంలో లావోస్‌లోని అధికారులు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందం మీద సంతకం చేసి ఒక వినూత్న నియంత్రణ ఫ్రేంవర్కును అభివృద్ధి చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని నీటి సంస్థల సాంప్రదాయ నియంత్రణకు సమాంతరంగా ఇది పనిచేసింది.[87]

నీటి సరఫరా

2014 లో నిర్వహించిన ప్రపంచ బ్యాంకు గణాంకాల ఆధారంగా యునిసెఫ్ / డబ్ల్యూహెచ్‌ఓ ఉమ్మడి పర్యవేక్షణ కార్యక్రమానికి సంబంధించి లావోస్ నీరు, పారిశుద్ధ్యం మీద మిలీనియం డెవలప్మెంటు గోల్ (ఎండిజి) లక్ష్యాలను చేరుకుంది. ఏదేమైనా ఈ రోజు నాటికి సుమారు 1.9 మిలియన్ల లావో జనాభా మెరుగైన నీటి సరఫరాను పొందలేకపోయింది. మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులో లేవు. 2.4 మిలియన్ల మంది ప్రజలు మంచి రహదారుల కొరతతో చేరుకోవడానికి వీలుకాని దూరప్రదేశాలతో రవాణాసౌకర్యాల కొరత ఉంది.[88]

గణాంకాలు

"లావోటియన్" అనే పదం లావో భాష, లావో జాతి, లావో ప్రజలు, లావో ఆచారాలను సూచించదు. ఇది లావోస్‌లోని లావో సమూహాలకు అతీతంగా ఉన్న రాజకీయ పదం. వారి రాజకీయ పౌరసత్వం కారణంగా వారిని "లావోటియా" పౌరుడిగా గుర్తిస్తుంది. లావోస్ ఆసియాలో 21.6 సంవత్సరాల వయసు కలిగిన యువకులు అధికంగా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది.[89]

2020 లో లావోస్ జనాభా 7.45 మిలియన్లుగా అంచనా వేయబడింది. చాలా మంది ప్రజలు మీకాంగు నదీతీరం, దాని ఉపనదుల తీర ప్రాంత లోయలలో అధికంగా నివసిస్తున్నారు. 2020 లో రాజధాని, అతిపెద్ద నగరమైన వియంటియాను ప్రిఫెక్చరు జనసంఖ్య సుమారు 683,000 మంది నివాసితులను కలిగి ఉంది.[89]

సంప్రదాయం

లావోస్ ప్రజలు తరచూ వారి ఎత్తుల పరిగణన (లోతట్టు ప్రాంతాలు, మిడ్లాండ్సు ఎగువ ఎత్తైన భూములు) ఆధారంగా పరిగణించబడతారు. ఎందుకంటే ఇది జాతి సమూహాలను అంచనా వేయడానికి సహకరిస్తుంది.

లావో లౌం (దిగువప్రాంత ప్రజలు)

లావోస్ లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న లావో- జాతి ప్రజలు దేశ జనాభాలో సగానికికంటే అధికంగా ఉన్నారు. వీరు సాంస్కృతికంగా, రాజకీయంగా ఆధిఖ్యతలో ఉన్నారు.[90] లావోస్ భాషాపరంగా తాయిభాషా సమూహానికి చెందినది.[91] వారు మొదటి సహస్రాబ్దిలో చైనా నుండి దక్షిణ దిశగా వలస వెళ్ళడం ప్రారంభించారు.[92] ఇతర "లోతట్టు" సమూహాలకు చెందిన ప్రజలు 10% ఉన్నారు.[90]

లావో దియంగు (మిడ్లాండు ప్రజలు)

మధ్య, దక్షిణ పర్వతాలలో, లావో థింగు (మధ్య-లోయప్రాంత లావోటియన్లు) అని పిలువబడే మోన్-ఖైమరు తెగకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. లావో లౌం వారిని ఆస్ట్రోయాసియాటికు మూలాన్ని సూచించే విధంగా ఖ్ము, ఖాము (కమ్ము) లేదా ఖా అని సూచిస్తారు. అయినప్పటికీ ఈ పదాలకు అర్ధం బానిస. వారు ఉత్తర లావోస్ స్థానిక నివాసులైన లావో లౌం ప్రజలు ఆసియా మూలాలున్న ప్రజలను ఈ పదాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పట్టణాలలోనే కొంతమంది వియత్నామీయులు, చైనీయులు, థాయి ప్రజలు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. కాని 1940 ల చివరలో స్వాతంత్ర్యం తరువాత వీరిలో చాలామంది వెళ్ళిపోయారు. వీరిలో చాలామంది వియత్నాం, హాంకాంగు లేదా ఫ్రాంసుకు మకాం మార్చారు. జనాభాలో 30% లావో థింగు ప్రజలు ఉన్నారు.[93]

లావో సంగు (ఎగువప్రాంత ప్రజలు)

కొండ ప్రజలు, లావోస్ అల్పసఖ్యాక సంస్కృతులకు చెందిన మోంగు, యావో (మియన్), దావో, షాను, అనేక టిబెటో-బర్మా భాషావాడుకరులు లావోస్ సూదూరమైన ప్రాంతాలలో చాలా సంవత్సరాలుగా ఏకాంతంలో నివసించారు. లావోస్‌లో మిశ్రమ జాతి, సాంస్కృతిక-భాషా వారసత్వం కలిగిన కొండ తెగలు ఉత్తరప్రాంతంలో కనిపిస్తాయి. వీరిలో లావోస్‌కు చెందిన లూవా, ఖ్ము ప్రజలు ఉన్నారు. నేడు, లువా ప్రజలను అంతరించిపోతున్న జాతులుగా భావిస్తారు. సమిష్టిగా, వారిని లావో సౌంగు లేదా హైలాండు లావోటియన్లు అని పిలుస్తారు. లావో సౌంగు జనాభాలో 10% మాత్రమే ఉన్నారు.[41]

భాషలు

అధికారిక, ఆధిపత్య భాషగా లావో ఉంది. ఇది థాయి భాషా సమూహానికి చెందిన భాషలా ఉచ్చరించబడుతున్న భాష. అయినప్పటికీ జనాభాలో సగం కంటే కొంచెం ఎక్కువ మంది మాత్రమే లావోను భాషను మాట్లాడతారు. మిగిలినప్రజలు (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో) అల్పసఖ్యాకుల స్థానిక భాషలను ఉపయోగిస్తారు. లావో వర్ణమాల 13 వ - 14 వ శతాబ్దాల మధ్య ఉద్భవించింది. ఇది పురాతన ఖైమరు భాషనుండి లిపి నుండి ఉద్భవించింది. ఇది థాయితో సమానంగా ఉంటుంది. థాయి లిపి చదివేవారికి సులభంగా అర్థమవుతుంది.[94] ఖ్ము, మోంగు వంటి భాషలు అల్పసంఖ్యాకప్రజలకు (ముఖ్యంగా మద్య, ఎగువ ప్రాంతాలలో) వాడుకభాషగా ఉంది. పుట్టుకతో వచ్చే చెవిటితనం అధికంగా ఉన్న ప్రాంతాలలో అనేక లావో సంకేత భాషలు ఉపయోగించబడతాయి.[41]

ఫ్రెంచి భాషను సాధారణంగా ప్రభుత్వ, వాణిజ్యంలో ఉపయోగిస్తారు. లావోస్ విద్యార్థులలో మూడవ వంతు మంది ఫ్రెంచి మాధ్యమం ద్వారా విద్యను అభ్యసిస్తారు. ఫ్రెంచి ఇతర విద్యార్థులందరికీ తప్పనిసరి. దేశవ్యాప్తంగా లావో, ఫ్రెంచి భాషల వాడకం కారణంగా ప్రజలను ద్విభాషా నైపుణ్యం కలిగిన ప్రజలుగా మార్చాయి. ఫ్రెంచి ప్రధానభాషగా ఆధిఖ్యతలో ఉంది. అసోసియేషను ఆఫ్ ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) భాష అయిన ఇంగ్లీషు ఇటీవలి సంవత్సరాలలో ఎక్కువగా అధ్యయనం చేయబడింది.[95] ఇది ఫ్రెంచి సంస్థ లా ఫ్రాంకోఫోనీలో సభ్యదేశంగా ఉంది.

మతం

Pha That Luang in Vientiane.

2005 జనాభా గణాంకాల ఆధారంగా లావోటియన్లలో 64.7% మంది థెరావాడ బౌద్ధులు, 1.7% మంది క్రైస్తవులు, 31.5% మంది ఇతర లేదా సాంప్రదాయవాదులు (ఎక్కువగా సత్సానా ఫీ అభ్యాసకులు)[96][2] లావోస్లో బౌద్ధమతం చాలా ముఖ్యమైన సామాజికశక్తులలో ఒకటిగా ఉంది. థెరావాడ బౌద్ధమతం స్థానిక బహుదేవతారాధనను దేశంలో ప్రవేశపెట్టినప్పటికీ సత్సనా మతావలంబకులతో శాంతియుతంగా సహజీవనం చేసింది.[41]

ఆరోగ్యం

Mahosot Hospital in Vientiane.

2017 లో పురుషుల సగటు ఆయుర్దాయం 62.6 సంవత్సరాలు, ఆడవారి సగట్ ఆయుర్దాయం 66.7 సంవత్సరాలు.[2] 2007 లో సగటు ఆయుర్దాయం 54 సంవత్సరాలు.[97] 2008 లో జనాభాలో 43% మందికి త్రాగునీటి వనరులు అందుబాటులో లేవు.[ఆధారం చూపాలి]ఇది 2010 నాటికి ఈ కారణంగా దేశంలోని జనంఖ్య 33% క్షీణిస్తుందని అంచనా వేయబడింది.[2] ఆరోగ్యం కొరకు ప్రభుత్వం జి.డి.పి.లో 4% వ్యయం చేస్తుంది.[97] 2006 లో ఆరోగ్యరక్షణ కొరకు లావోస్ ప్రభుత్వం సగటున 18 అమెరికాడాలర్లు వ్యయం చేసింది. [97]

విద్య

National University of Laos in Vientiane.

వయోజన అక్షరాస్యత రేటు మూడింట రెండు వంతులను అధిగమించింది.[98] పురుషుల అక్షరాస్యత రేటు స్త్రీ అక్షరాస్యత రేటును అధిగమించింది.[97] మొత్తం అక్షరాస్యత రేటు 73% (2010 అంచనా).

2004 లో నికర ప్రాధమిక పాఠశాల నమోదు రేటు 84% ఉంది.[97]

లావోస్ జాతీయ విశ్వవిద్యాలయం లావో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయ నిర్వహణలో పనిచేస్తుంది.

తక్కువ ఆదాయ దేశంగా లావోస్ నిపుణుల వలసల సమస్యను ఎదుర్కొంటుంది. విద్యావంతులు అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళతారు. విద్యావంతులైన లావోటియన్లలో 37% మంది లావోస్ వెలుపల నివసిస్తున్నారని అంచనా.[99]

సంస్కృతి

An example of Lao cuisine
Lao women wearing sinhs
Lao dancers during the New Year celebration

థెరావాడ బౌద్ధమతం లావో సంస్కృతిని అత్యధికంగా ప్రభావితం చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా భాషలు, దేవాలయం వరకు, కళ, సాహిత్యం, ప్రదర్శన కళలు మొదలైన వాటిలో ప్రతిబింబిస్తుంది. బౌద్ధమతానికి పూర్వమే లావో సంస్కృతి అనేక అంశాలు ఉనికిలో ఉన్నాయి. ఉదాహరణకు లావో సంగీతం దాని జాతీయ వాయిద్యం ఖేను చరిత్రపూర్వ మూలాలు కలిగి ఉంది. ఇది ఒక రకమైన వెదురు పైపుతో రూపొందించబడింది. లాం గాయకులు దీనిని అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు. లాం శైలులలో లామ్ సరవనే అత్యంత ప్రాచుర్యం పొందింది.[ఆధారం చూపాలి]

అంటుకునే బియ్యం ప్రధానమైన ఆహారంగా ఉంది. దీనికి లావో ప్రజలలో సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా జాస్మిన్ బియ్యంకంటే ప్రజలు జిగటబియ్యం పట్ల మక్కువ చూపిస్తారు. స్టికీ వరి సాగు, ఉత్పత్తి లావోస్‌లో ఉద్భవించిందని భావిస్తున్నారు. అనేక జాతుల మధ్య బియ్యం ఉత్పత్తికి సంబంధించిన అనేక సంప్రదాయాలు, ఆచారాలు వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు లుయాంగు ప్రాబాంగులోని ఖమ్మూ రైతులు చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడిసె దగ్గర లేదా బియ్యం పొలం అంచున చిన్న మొత్తంలో జిగట బియ్యం రకంన ఖావో కాంను నాటుతారు. ఇది తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారని సూచిస్తుంది.[100]


లావోటియన్ మహిళలు రోజువారీ జీవితంలో ధరించే సాంప్రదాయ వస్త్రం పేరు సింహు. ఇది చేతితో నేసిన పట్టు లంగా. ఇది వైవిధ్యభరితంగా ధరించబడుతూ ధరించిన స్త్రీలకు ప్రత్యేకత ఇస్తుంది. ప్రత్యేకించి ప్రాంతీయ వైధ్యాలతో రూపొందించబడే ఈ వస్త్రం ధరించినవారు ఏ ప్రాంతం నుండి వచ్చారో ఇది సూచిస్తుంది.[ఆధారం చూపాలి]

చలనచిత్రం

1975 లో లావో పిడిఆర్ స్థాపించబడినప్పటి తరువాత లావోస్‌లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే నిర్మినబడ్డాయి.[101] రాచరికం రద్దు చేసిన తరువాత 1983 లో నిర్మించిన మొట్టమొదటి చలనచిత్రం " గన్ వాయిస్ ఫ్రం ది ప్లెయిన్ ఆఫ్ జార్స్ " నికి సోమ్‌చిత్ ఫోల్సేనా దర్శకత్వం వహించారు. అయినప్పటికీ దాని విడుదలను సెన్సార్‌ బోర్డు నిరోధించింది.[102] 2008 లో నిర్మించిన మొదటి వాణిజ్య చలన చిత్రంగా సబైదీ లుయాంగు ప్రబాంగు నిర్మించబడింది.[103]

ఆస్ట్రేలియా చిత్రనిర్మాత కిం మోర్డౌంటు మొట్టమొదటి చలన చిత్రం లావోస్‌లో నిర్మించబడింది. ఇందులో నటించిన లావోటియన్ తారాగణం వారి మాతృభాషను మాట్లాడారు. ది రాకెటు పేరుతో ఈ చిత్రం 2013 మెల్బోర్ను ఇంటర్నేషనలు ఫిల్ము ఫెస్టివలులో ప్రదర్శించబడింది. ఇది బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మూడు అవార్డులను గెలుచుకుంది.[104] లావో చలన చిత్రాలను నిర్మించి అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో విజయవంతమై ఒక నిర్మాణ సంస్థ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. లావో న్యూవేవ్ సినిమా " ఎట్ ది హరిజోజ్ణ్ "నుకు అనిసే కెయోలా దర్శకత్వం వహించాడు.[105] లావో ఆర్టు మీడియా " చంతలీ " చిత్రానికి " మటీ డో " దర్శకత్వం వహించాడు. ఇది 2013 ఒజాసియా ఫిల్ము ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[106][107]

2017 సెప్టెంబరులో లావోస్ " డియరెస్టు సిస్టర్ " (లావో: ນ້ອງ ຮັກ), మాటీ డో రెండవ చలనచిత్రం 90 వ అకాడమీ అవార్డులకు (లేదా ఆస్కార్) ఉత్తమ విదేశీ భాషా చిత్రానికి పరిశీలన కోసం సమర్పించింది. ఇది ఆస్కారు కోసం దేశం మొట్టమొదటి సమర్పణగా గుర్తించబడింది.[108]

2018 నాటికి లావోస్‌లో సినిమాలు చూపించడానికి మూడు ఆపరేటింగు థియేటర్లు మాత్రమే ఉన్నాయి.[109]

పండగలు

లావోస్‌ ప్రభుత్వ సెలవులు, ఉత్సవాలు, వేడుకలు.

  • మోంగు న్యూ ఇయరు (నోపెజావో)
  • బన్ ఫా వెట్
  • మాఘ పూజ
  • చైనీయుల నూతన సంవత్సరం
  • బౌన్ ఖౌన్ ఖావో
  • బౌన్ పిమై
  • విశాఖ పూజ
  • పై మై / సాంగ్క్రాన్ (లావో న్యూ ఇయర్)
  • ఖావో ఫన్సా
  • హా ఖావో పదాప్ దిన్
  • ఆవ్క ఫన్సా
  • బన్ నామ్
  • లావో జాతీయ దినోత్సవం (2 డిసెంబరు) [110][111]

మీడియా

రెండు విదేశీ భాషా పత్రికలతో సహా వార్తాపత్రికలన్నింటిని ప్రభుత్వం ద్వారా ప్రచురించబడుతున్నాయి: ఆంగ్ల భాషలో " వియంటియాను టైమ్సు " ప్రచురించబడుతుంది. ఫ్రెంచి భాషలో " లే రెనోవాటూరు " ప్రచురించబడుతుంది. అదనంగా దేశం అధికారిక వార్తా సంస్థ అయిన " ఖావో శాన్ పాథెట్ లావో " ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలో ప్రచురించబడుతుంది. లావోస్‌లో ప్రస్తుతం 9 దినపత్రికలు, 90 పత్రికలు, 43 రేడియో స్టేషన్లు, 32 టీవీ స్టేషన్లు ఉన్నాయి. 2011 నాటికి లావోస్‌లో న్హాన్ డాన్ (ది పీపుల్), జిన్హువా అనే విదేశీ వార్తాసంస్థలకు మాత్రమే ప్రచురణకు, కార్యాలయాలు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి. 2011 లో వియంటియానులో ఈ రెండు న్యూస్ ఏజెన్సీ- కార్యాలయాలు ప్రారంభించాయి.[ఆధారం చూపాలి]

లావో ప్రభుత్వం తన చర్యల మీద విమర్శలను నివారించడానికి అన్ని మీడియా ఛానెళ్లను భారీగా నియంత్రిస్తుంది.[112] ప్రభుత్వాన్ని విమర్శించిన లావో పౌరులు బలవంతం అదృశ్యం చేయబడడం, ఏకపక్ష అరెస్టులు, హింసకు గురయ్యారు.[113][114]

ఇంటర్నెట్ కేఫ్‌లు ఇప్పుడు ప్రధాన పట్టణ కేంద్రాల్లో సర్వసాధారణమై ప్రధానంగా యువ తరానికి ప్రాచుర్యం పొందాయి.

బహుభార్యత్వం

లావోస్‌లో అధికారికంగా నేరం ఆధారిత జరిమానా స్వల్పంగా ఉన్నప్పటికీ. రాజ్యాంగం, ఫ్యామిలీ కోడ్ బహుభార్యాత్వ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును నిరోధిస్తాయి. దేశంలో వివాహం ఏకైక రూపం ఒకే భార్య అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది.[115]కొంతమంది మోంగ్ ప్రజలలో ఇప్పటికీ బహుభార్యాత్వం ఆచారంలో ఉంది.[116]

క్రీడ

ముయే లావో యుద్ధ కళ లావో జాతీయ క్రీడగా ఉంది.[117] ఇది థాయిలాండు ముయే థాయి, బర్మా లెత్వీ, కంబోడియా ప్రదలు సెరీల మాదిరిగానే కిక్బాక్సింగు క్రీడారూపాలలో ఇది ఒకటి. [118]

లావోస్‌లో " అసోసియేషన్ ఫుట్బాల్ " క్రీడ ప్రజాదరణ పొందింది.[119] దేశంలోని అసోసియేషన్ ఫుట్బాలు క్లబ్బులకు లావో లీగు అగ్రశ్రేణి ప్రొఫెషనలు లీగుగా ఉంది.[120] లీగు ప్రారంభమైనప్పటి నుండి 8 లావో ఆర్మీ ఎఫ్‌సి టైటిళ్లతో (2007-2008 సీజన్ తరువాత) అత్యంత విజయవంతమైన క్లబ్బుగా ఉంది. ఇది అత్యధిక సంఖ్యలో ఛాంపియన్షిప్పు విజయాలు సాధించింది.[121]

లావోస్ జాతీయ బాస్కెట్బాలు జట్టు 2017 ఆగ్నేయాసియా క్రీడలలో పోటీ పడింది. అక్కడ 8 వ స్థానంలో ఉన్న మ్యాచిలో మయన్మారును ఓడించింది.[122]

మూలాలు

🔥 Top keywords: తెలుగుఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాతావరణంమొదటి పేజీప్రకృతి - వికృతియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామాయణంవికీపీడియా:Contact usఛందస్సుగోల్కొండస్మృతి మందానసమాసం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅలంకారందానం నాగేందర్ప్రత్యేక:అన్వేషణఈనాడుభారతదేశంలో కోడి పందాలుకల్వకుంట్ల కవితదుర్యోధనుడువంగా గీతఊరు పేరు భైరవకోనస్త్రీఆరూరి రమేష్రజాకార్లుహనుమంతుడుతెలుగుదేశం పార్టీతెలుగు అక్షరాలుసెక్స్ (అయోమయ నివృత్తి)రాశిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపానుగంటి లక్ష్మీ నరసింహారావునానార్థాలుపర్యాయపదంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిజాతీయ ప్రజాస్వామ్య కూటమిపునీత్ రాజ్‍కుమార్నక్షత్రం (జ్యోతిషం)