ఆమిర్ ఖాన్ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
2013లో ధూమ్3 సినిమా ఫంక్షన్ లో ఆమిర్ ఖాన్(ఈ సినిమా ఆయన కెరీర్ లోనే నాలుగో అతిపెద్ద హిట్ గానే కాక, బాలీవుడ్ లో అతి ఎక్కువ వసూళ్ళూ సాధించిన చిత్రాల్లో ఒకటిగా  నిలిచింది.[1])

ఆమిర్ ఖాన్  ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు, నేపధ్య  గాయకుడు, స్క్రీన్ ప్లే రచయిత, టీవీ ప్రముఖుడు. తన 8వ ఏట  పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోం కీ బారాత్(1973)  సినిమలో తొలిసారి చిన్న పాత్రలో తెరపై కనిపించారు.[2] 1983లో  ఆదిత్య భట్టాచార్య దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిలిం పరనోయియాలో నటించి, సహాయ దర్శకునిగా కూడా పనిచేశారు ఆయన.[3] ఆ తరువాత నాసిర్ తీసిన మంజిల్ మంజిల్(1984), జబర్దస్త్ (1985) సినిమాలకు కూడా సహాయ దర్శకునిగా పనిచేశారు ఆమిర్.[3][4] పెద్దయిన తరువాత 1984లో హోలీ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు ఆయన.[5]

1988లో జూహీ చావ్లాతో కలసి ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో మొదటిసారి హీరోగా నటించారు ఆమిర్.[6] రాఖ్(1989) సినిమాలో ఆయన నటనను 36వ జాతీయ ఫిలిం పురస్కారాల ఫంక్షన్ లో ప్రత్యేక ప్రస్తావన చేయడం విశేషం.[7] 90వ దశకంలో ఆయన నటించిన దిల్(1990), హమ్ హై రహి ప్యార్ కే(1993), రాజా హిందుస్థానీ(1996) వంటి సినిమాలతో బాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు. రాజా హిందుస్థానీ 871 మిలియన్ వసూళ్ళు సాధించింది.[8][9] దీపా మెహతా దర్శకత్వంలో కెనెడా-భారత్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఎర్త్(1998) సినిమాలో నటించారు ఆయన.[10] 1999లో తన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ను స్థాపించారు.[11] ఈ సంస్థ మొదటగా లగాన్(2001) సినిమాను నిర్మించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతే కాక ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ పురస్కారం, జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది ఈ సినిమా.[12][13] అదే ఏడాది సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నాలతో కలసి దిల్ చాహ్తా హై సినిమాలో నటించారు ఆమిర్.[14] ఈ రెండు సినిమాలకూ మీడియా నుంచి కూడా ప్రశంసలు లభించాయి.[15][16] ఆ తరువాత 4 ఏళ్ళు ఏ సినిమాల్లోనూ నటించలేదు ఆయన. తిరిగి 2005లో మంగళ్ పాండే:ది రైజింగ్ అనే చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు.[17] 2006లో ఆయన నటించిన ఫనా, రంగ్ దే బసంతీ సినిమాలు ఆ సంవత్సరానికి గానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాలుగా నిలివడం విశేషం.[18]అమీర్ ఖాన్ తదుపరి చిత్రం సాల్యుట్ ప్రకటించారు, ఇది మహేష్ మఠీ దర్శకత్వం వహిస్తుంది.[19]

మూలాలు

మార్గదర్శకపు మెనూ