దేబా ప్రసాద్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
దేబా ప్రసాద్ దాస్
జననం1932
కెయుల్ చాబి సువా, కటక్, భారతదేశం
మరణంజూలై 16, 1986 (54 సంవత్సరాలు)
వృత్తిక్లాసికల్ డ్యాన్సర్
తల్లిదండ్రులుదుర్గా చరణ్ దాస్
ఇంద్రమణి దేవి
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు
ఒడిశా సంగీత నాటక అకాడమీ అవార్డు
వరల్డ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవార్డు

దేబా ప్రసాద్ దాస్ (ఆంగ్లం: Deba Prasad Das; 1932 - 1986 జూలై 16) భారతీయ శాస్త్రీయ నృత్యకారుడు, విమర్శకులు. భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన ఒడిస్సీ నలుగురు మొదటి తరం గురువులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని ఒడిస్సీ శైలి దృఢమైనదే కాకుండా ప్రత్యేకమైనది.[1][2] అతను 1974లో ఒడిషా సంగీత నాటక అకాడమీ అవార్డు,[3] 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు[4] గ్రహీత.

బాల్యం, విద్యాభ్యాసం

దేబా ప్రసాద్ దాస్ 1932లో ఒడిషా రాష్ట్రంలోని కటక్ సమీపంలోని కెయుల్ చాబి సువా అనే చిన్న గ్రామంలో ఇంద్రమణి దేవి, దుర్గా చరణ్ దాస్ అనే పోలీసు అధికారికి జన్మించాడు.[5][6][7] అతను చిన్న వయస్సులోనే తన తల్లిని కోల్పోయాడు. స్థానిక వయోలిన్ ప్లేయర్ అయిన అతని తాత వద్ద పెరిగాడు.[6] ఆయన పూరిలో తన ప్రారంభ పాఠశాల విద్యను అభ్యసించాడు. మోహన్ చంద్ర మోహపాత్ర నడుపుతున్న సమీపంలోని సాంప్రదాయ పాఠశాల (పతర అఖారా) నుండి ఆరేళ్ల వయస్సులో ఆయన సంగీతం, నృత్యంలలో శిక్షణ పొందాడు.[6] అయితే తండ్రికి బదిలీ కావడంతో బెహ్రంపూర్‌కు వెళ్లాల్సి వచ్చింది.[7]

కెరీర్

దేబా ప్రసాద్ దాస్ 14 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తండ్రి అతన్ని న్యూ థియేటర్స్‌లో పనిచేస్తున్న సంగీత దర్శకుడు రాధా రామన్ రే సంగీత పాఠశాలకు పంపారు.[6] అతను అక్కడ నెలవారీ జీతం సుమారు ₹ 3లకు పనిచేశాడు. అక్కడ గ్రీన్ రూమ్‌లో ప్రదర్శనకారులకు సహాయం చేశాడు. త్వరలో, అతను గేట్ మ్యాన్‌గా, టిక్కెట్ కలెక్టర్‌గా, చివరకు ప్రాంప్టర్‌గా కూడా పనిచేశాడు. తర్వాత, 1949 నుండి 1963 వరకు అన్నపూర్ణలో పనిచేశాడు, అక్కడ పంకజ్ చరణ్ దాస్, కేలుచరణ్ మోహపాత్ర, కుమార్ దయాళ్ శరణ్, మాయాధర్ రౌత్ వంటి ప్రఖ్యాత ఒడిస్సీ నృత్యకారులతో పని చేసే అవకాశం లభించింది. ఆ సమయంలో ఆయన ఒడిస్సీ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు.

ఉత్కల్ సంగీత్ మహావిద్యాలయ అనే నాట్య సంగీత పాఠశాలకు 1964లో ఆయన ఒడిస్సీకి ఫ్యాకల్టీ మెంబర్‌గా చేరాడు. ఇక్కడ, అతను ఒడిస్సీలో భరతనాట్యం నర్తకి ఇంద్రాణి రెహమాన్‌కి శిక్షణ ఇచ్చాడు.[7] దీంతో సంగీత కచేరీలకు ఇద్దరు కలిసివెళ్ళేవారు. 1957లో ఇంద్రాణి రెహమాన్ డ్యాన్స్ ఫెస్టివల్‌లో దేబా ప్రసాద్ దాస్ కొరియోగ్రాఫ్ చేసిన ఒడిస్సీ ప్రదర్శనను ఇచ్చింది. ఈ ప్రదర్శన ఒడిస్సీకి శాస్త్రీయ నృత్య రూపకంగా గుర్తింపు పొందడంలో సహాయపడింది. 'శబ్ద స్వర పాట' ఒడిస్సీ శైలి ముఖ్యమైన లక్షణం.[7]

అతనికి ఇంద్రాణి రెహమాన్, బిజయలక్ష్మి మొహంతి, ఊపాలి ఒపెరాజితా, పుష్పా మహంతి, శ్రీనాథ్ రౌత్, సుధాకర్ సాహూ, దుర్గా చరణ్ రణబీర్, ధులేశ్వర్ బెహెరా, అనితా సింగ్‌డియో, సంగీతా దాష్, సుజాతా మిశ్రా, రాంలీ ఇబ్రహీం, గోజేంద్ర పాండా వంటి అనేక మంది శిష్యులు ఉన్నారు. బిస్వాస్, గాయత్రీ చంద్, అతాషి త్రిపాఠి వంటి అనేక మంది ఇతర వ్యక్తులు ఒడిస్సీకి ప్రసిద్ధి చెందినవారిలో ఉన్నారు. ప్రముఖ భరతనాట్యం గురువు లీలా రామనాథన్ కూడా అతని వద్ద ఒడిస్సీ శిక్షణ తీసుకుంది.[8]

గుర్తింపు

  • భారత ప్రభుత్వంచే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ గ్రహీత
  • 1983లో వరల్డ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవార్డు[6]
  • 1974లో ఒడిశా సంగీత నాటక అకాడమీ అవార్డు[3][7]
  • 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు[4]
  • దేబా ప్రసాద్ దాస్ మరణించిన 25 సంవత్సరాల తర్వాత 2012లో అతనిపై ఒక పుస్తకం "గురు దేబప్రసాద్ దాస్: ఐకాన్ ఆఫ్ ఒడిస్సీ" సీనియర్ నర్తకి గాయత్రీ చంద్ చే రచించబడింది.

మరణం

దేబా ప్రసాద్ దాస్ 1986 జూలై 16న 54వ ఏట మరణించాడు.[6][7]

ఇవీ చూడండి

మూలాలు

మార్గదర్శకపు మెనూ