ఆహార్యాభినయం

చతుర్విధ అభినయములు లలో మూడవది. నాటకంలో కావ్యార్థాన్ని వ్యక్తీకరించడంలో ఆహార్యాభినయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రంగస్థలం మీద నటీనటుల ధరించే పాత్రలను సామాజికులు గుర్తుపట్టేట్లు చేపే ప్రక్రియే ఆహార్యం. ఆహార్యంతో కూడిన నటనే ఆహార్యాభినయం.[1] తెర తీయగానే ప్రేక్షకులకు మొదట కనిపించేది రంగస్థలం మీద పాత్రల రూపాలే. రంగస్థలం మీద నిల్చున్న వ్యక్తి రాముడా, నారదుడా, జమీందారా, కార్మికుడా, పౌరోహితుడా, డాక్టరా, కర్షకుడా అన్న విషయం అతని వేషాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి తెలుస్తుంది. అభినయానికి ఆహార్యం నిండుదనాన్ని ఇస్తుంది.

ఒక నాటకంలో దుర్యోధనుడు,కృష్ణుడు, అర్జునుడు పాత్రలలో నటిస్తున్న కళాకారుల అభినయం

60 ఏళ్ల వృద్దుడి పాత్రను 16 ఏళ్ల కుర్రాడు ధరించే సందర్భాలుంటాయి. అలాంటప్పుడు ఆహార్యం తోడ్పాటులేకుండా ఆ పాత్ర నిర్వహణ చేయడం కష్టం. సరైన ఆహార్యం లేకపోతే ఆ పాత్రధారి నటన ప్రేక్షలకుల కంటికి ఆనదు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ