శ్రీ గౌరి ప్రియ

భారతీయ సినిమా నటి & మోడల్

శ్రీ గౌరి ప్రియా రెడ్డి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2021లో మెయిల్ వెబ్ సిరీస్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీ గౌరి ప్రియ
జననం1998 నవంబర్ 13
హైదరాబాద్, తెలంగాణ
జాతీయత భారతీయురాలు
పౌరసత్వం భారతదేశం
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులుశ్రీనివాస్ రెడ్డి, వసుంధర

జననం, విద్యాభాస్యం

శ్రీ గౌరి ప్రియ హైదరాబాద్‌లో శ్రీనివాస్ రెడ్డి, వసుంధర దంపతులకు జన్మించింది. ఆమె బేగంపేటలోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.[1]

సినీ ప్రస్థానం

శ్రీ గౌరి ప్రియ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమె బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచింది. శ్రీ గౌరి ప్రియ సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచి కొంతకాలం జెమినీ టీవీలో యాంకర్ గా పని చేసి నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన తర్వాత సినిమా అవకాశాలు రావడంతో ఆమె 2021లో తొలిసారి మెయిల్ వెబ్ సిరీస్‌లో నటించింది.[2]

సినిమాలు

సంవత్సరంసినిమా పేరుపాత్రఇతర విషయాలు
2016నిర్మలా కాన్వెంట్గుర్తింపు లేని పాత్ర
మనలో ఒకడుగుర్తింపు లేని పాత్రగాయని కూడా
2017ఫిదాగుర్తింపు లేని పాత్ర
2021మెయిల్రోజావెబ్ సిరీస్[3]
లవ్ స్టోరీ
శ్రీకారం
2023రైటర్ పద్మభూషణ్కన్నా[4]
మోడరన్ లవ్ చెన్నైశోభాతమిళ వెబ్ సిరీస్[5]
మ్యాడ్శృతి[6]
2024ట్రూ లవర్దివ్య[7][8]

మూలాలు

బయటి లింకులు