తెలుగు అక్షరాలు

తెలుగు భాషకు చెందిన అక్షరాలు

ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2).

తెలుగు అక్షరమాల

వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు. చిన్నయ సూరి బాల వ్యాకరణం ప్రకారం దేశ్యమైన తెలుగుభాషకు వర్ణాలు ముప్ఫై ఆరు (36).

తెలుగు వర్ణ సముదాయమును మూడు భాగాలుగా విభజించవచ్చును.

అచ్చులు

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

  • హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
  • దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
  • ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును.ఇవి రెండు అక్షరాలు:ఐ,ఔ

హల్లులు

హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లలోలేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని వ్యంజనములని పేరు ఉన్నాయి. ౘ, ౙ వదలివేసి 36 హల్లులుగా కూడా కొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది.

  • సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
  • పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
  • స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ (క్ష సంయుక్తాక్షరం.హల్లు కాదు రెండు హల్లుల కలయిక)
  • స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
    • క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    • చ వర్గము - చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఊష్మాలు: ఊది పలుకబడే అక్షరాలు ఊష్మాలు

ఇవి శ,స,ష,హ

అంతస్తములు: స్పర్సములకు, ఊష్మాలకు మధ్య ఉన్న అక్షరాలు

ఇవి య,ర,ఱ,ల,ళ,వ

ఉభయాక్షారలు

ఉభయాక్షరాలు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.

  • సున్న - దీనికి పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
    • సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
    • సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
  • అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
  • విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

ఉత్పత్తి స్థానములు

ఉత్పత్తి స్థానములు

  • కంఠ్యములు: కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, గ, ఙ, హ.
  • తాలవ్యములు: దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
  • మూర్ధన్యములు: అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
  • దంత్యములు: దంతముల నుండి పుట్టినవి - ఌ, ౡ, త, థ, ద, ధ, న, ౘ, ౙ, ల, స.
  • ఓష్ఠ్యములు: పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
  • నాసిక్యములు (అనునాసికములు): నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
  • కంఠతాలవ్యములు: కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
  • కంఠోష్ఠ్యములు: కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
  • దంత్యోష్ఠ్యములు: దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

  • అచ్చులు (12): అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,
  • పూర్ణ బిందువు (1): అం ( అంగడి)
  • నకారపొల్లు (1): క్ (రవినాయక్)
  • హల్లులు (34):
    • క వర్గము - క, ఖ, గ, ఘ
    • చ వర్గము - చ, ఛ, జ, ఝ
    • ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    • త వర్గము - త, థ, ద, ధ, న
    • ప వర్గము - ప, ఫ, బ, భ, మ
    • య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

గుణింతాలు

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి."క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు

అచ్చులుఆకారము( లేక ) గుర్తునామములుగుణింతముచదువుట నేర్చుకొనుట
అకారముక్+అ=కకకార అకరముల క
ఆకారముక్+ఆ=కాకకార ఆకరముల కా
ిఇకారముక్+ఇ=కికకార ఇకరముల కి
ఈకారముక్+ఈ=కీకకార ఈకరముల కీ
ఉకారముక్+ఉ=కుకకార ఉకరముల కు
ఊకారముక్+ఊ=కూకకార ఊకరముల కూ
ఋకారముక్+ఋ=కృకకార ఋకరముల కృ
ౠకారముక్+ౠ=కౄకకార ౠకరముల కౄ
ఎకారముక్+ఎ=కెకకార ఎకరముల కె
ఏకారముక్+ఏ=కేకకార ఏకరముల కే
ఐకారముక్+ఐ=కైకకార ఐకరముల కై
ఒకారముక్+ఒ=కొకకార ఒకరముల కొ
ఓకారముక్+ఓ=కోకకార ఓకరముల కో
ఔకారముక్+ఔ=కౌకకార ఔకరముల కౌ
అంపూర్ణానుస్వారముక్+ం=కంకకార పూర్ణానుస్వారము కం
అఃవిసర్గక్+ః=కఃకకార విసర్గ కః

వదిలి వేయ బడిన ఌ ౡ లు అను అచ్చులు.

అచ్చులుఆకారము( లేక ) గుర్తునామములుగుణింతముచదువుట నేర్చుకొనుట
ఌకారముక్+ఌకకార ఌకారముల కౢ
ౡకారముక్+ౡకకార ౡకారముల కౣ

పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతములను చదివినచో తెలుగును చక్కగా చదువుట, వ్రాయుట వచ్చును.

గుణింతం

అచ్చులుఅంఅః
అకారముల

గుర్తు

ి
అకారముల

ఉచ్చారణ

అ కారముఆ కారముఇ కారముఈ కారముఉ కారముఊ కారముఋ కారముౠ కారము

కారము

కారము

ఎ కారముఏ కారముఐ కారముఒ కారముఓ కారముఔ కారముపూర్ణాను స్వారమువిసర్గం
క గుణింతముకాకికీకుకూకృకౄకౢకౣకెకేకైకొకోకౌకంకః
ఖ గుణింతముఖాఖిఖీఖుఖూఖృఖౄఖౢఖౣఖెఖేఖైఖొఖోఖౌఖంఖః
గ గుణింతముగాగిగీగుగూగృగౄగౢగౣగెగేగైగొగోగౌగంగః
ఘ గుణింతముఘాఘిఘీఘుఘూఘృఘౄఘౢఘౣఘెఘేఘైఘొఘోఘౌఘంఘః
చ గుణింతముచాచిచీచుచూచృచౄచౢచౣచెచేచైచొచోచౌచంచః
ఛ గుణింతముఛాఛిఛీఛుఛూఛృఛౄఛౢచౣఛెఛేఛైఛొఛోఛౌఛంఛః
జ గుణింతముజాజిజీజుజూజృజౄజౢజౣజెజేజైజొజోజౌజంజః
ఝ గుణింతముఝాఝిఝీఝుఝూఝృఝౄఝౢఝౣఝెఝేఝైఝొఝోఝౌఝంఝః
ట గుణింతముటాటిటీటుటూటృటౄటౢటౣటెటేటైటొటోటౌటంటః
ఠ గుణింతముఠాఠిఠీఠుఠూఠృఠౄఠౢఠౣఠెఠేఠైఠొఠోఠౌఠంఠః
డ గుణింతముడాడిడీడుడూడృడౄడౢడౣడెడేడైడొడోడౌడండః
ఢ గుణింతముఢాఢిఢీఢుఢూఢృఢౄఢౢఢౣఢెఢేఢైఢొఢోఢౌఢంఢః
ణ గుణింతముణాణిణీణుణూణృణౄణౢణౣణెణేణైణొణోణౌణంణః
త గుణింతముతాతితీతుతూతృతౄతౢతౣతెతేతైతొతోతౌతంతః
థ గుణింతముథాథిథీథుథూథృథౄథౢథౣథెథేథైథొథోథౌథంథః
ద గుణింతముదాదిదీదుదూదృదౄదౢదౣదెదేదైదొదోదౌదందః
ధ గుణింతముధాధిధీధుధూధృధౄధౢధౣధెధేధైధొధోధౌధంధః
న గుణింతమునానినీనునూనృనౄనౢనౣనెనేనైనొనోనౌనంనః
ప గుణింతముపాపిపీపుపూపృపౄపౢపౣపెపేపైపొపోపౌపంపః
ఫ గుణింతముఫాఫిఫీఫుఫూఫృఫౄఫౢఫౣఫెఫేఫైఫొఫోఫౌఫంఫః
బ గుణింతముబాబిబీబుబూబృబౄబౢబౣబెబేబైబొబోబౌబంబః
భ గుణింతముభాభిభీభుభూభృభౄభౢభౣభెభేభైభొభోభౌభంభః
మ గుణింతముమామిమీముమూమృమౄమౢమౣమెమేమైమొమోమౌమంమః
య గుణింతముయాయియీయుయూయృయౄయౢయౣయెయేయైయొయోయౌయంయః
ర గుణింతమురారిరీరురూరృరౄరౢరౣరెరేరైరొరోరౌరంరః
ల గుణింతములాలిలీలులూలృలౄలౢలౣలెలేలైలొలోలౌలంలః
వ గుణింతమువావివీవువూవృవౄవౢవౣవెవేవైవొవోవౌవంవః
శ గుణింతముశాశిశీశుశూశృశౄశౢశౣశెశేశైశొశోశౌశంశః
ష గుణింతముషాషిషీషుషూషృషౄషౢషౣషెషేషైషొషోషౌషంషః
స గుణింతముసాసిసీసుసూసృసౄసౢసౣసెసేసైసొసోసౌసంసః
హ గుణింతముహాహిహీహుహూహృహౄహౢహౣహెహేహైహొహోహౌహంహః
ళ గుణింతముళాళిళీళుళూళృళౄళౢళౣళెళేళైళొళోళౌళంళః
క్ష గుణింతముక్షక్షాక్షిక్షీక్షుక్షూక్షృక్షౄక్షౢక్షౣక్షెక్షేక్షైక్షొక్షోక్షౌక్షంక్షః
ఱ గుణింతముఱాఱిఱీఱుఱూఱృఱౄఱౢఱౣఱెఱేఱైఱొఱోఱౌఱంఱః

వీటి లో కొన్ని రూపాలు కూడరవు, కొన్ని వ్యవహరింప పడవు.

కూడరని ఉదాహరణ: ఱః ఱృ ఱౄ ఱౢ ఱౣ.

వ్యవహరింపబడని ఉదాహరణలు: ఠౄ ఖౄ.

.

చ జ లకు అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ అనే అచ్చుల తో కుడినప్పుడు ౘ ౙ లుగా మారతాయి అని పరవస్తు చిన్నయ సూరి బాల వ్యాకరణం లో చెప్పాడు.

అదే ఇ ఈ ఎ ఏ ల తో కూడినప్పుడు చ జ లు గానే ఉంటాయి.

ఇవి అచ్చ తెలుగు పదాలకు మతరమే వర్తిస్తాయి.

అచ్చులు
చకారముౘాచిచీౘుౘూచెచేౘొౘోౘౌ
జకారముౙాజిజీౙుౙూజెజేౙొౙోౙౌ

ఐకారము తో కుడిన చ జ లు తెలుగు లో లేవు.

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి

  • క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
  • చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
  • ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
  • త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
  • ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
  • య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

కు వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.

అచ్చ తెలుగు వర్ణములు

చిన్నయ సూరి బాల వ్యాకరణం ప్రకారం దేశ్యమైన తెలుగుభాషకు వర్ణాలు 36. అవి:

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ (14 అచ్చులు)

క గ చ ౘ జ ౙ ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ (22 హల్లులు)

’ఱ’ ను ఒక ప్రత్యేక అక్షరంగా చిన్నయ సూరి గుర్తించలేదు. దీనిపై విభేదాలు ఉన్నాయి.

మఱుగునపడిన వ్రాలు

తెలుగు లిపిలో నేడు వాడుకనుండి తొలగిన వ్రాలు: ఱ,ఴ,ౚ‌.

వీటిలో ''కారాన్ని చెఱకు, కఱి, ఱేఁడు, కొఱకు, పఱ్ఱు, చిఱు, ఎఱుఁగు, ఎఱుపు, వెఱ్ఱి, కఱ్ఱ, తఱి వంటి పదాలలో వాడేవారు.

''కారం పలు చోట్ల 'డ'కారానికీ, 'ద'కారానికీ మూలం. మచ్చుకు; చూడు, దెందులూరు, దున్ను, గాడిద, కొడుకు, కోడలు, కడుగు, వాడుక, దాగు, దిగు వంటి పదాలలో ఉండేది.

అంతేగాక, క్రొత్త, ప్రొద్దు వంటి పదాలలో 'ర' వత్తు ఉన్న చోట ఉండేది. ఈ వ్రాయి 11వ శతాబ్దం మునుపట విరివిగా వాడబడినది.

పాత శాసనాలలో '' అనబడు వ్రాయి కూడా దొరికినది.

పైన చెప్పబడిన వ్రాలు తెలుగున గల ద్రావిడ భాషా లక్షణాలు.


మూలాలు

  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
  • పరవస్తు చిన్నయసూరి, బాల వ్యాకరణము
  • చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్ర లక్షణ సారము, చిలుకూరి బ్రదర్స్, సూర్యారావు పేట, కాకినాడ, తారీఖు వెయ్యలేదు
  • రాయప్రోలు రథాంగపాణి, వ్యాకరణ పారిజాతము, జనప్రియ పబ్లికేషన్స్, గంగానమ్మ పేట, తెనాలి - 522 201
  • భద్రిరాజు కృష్ణమూర్తి, తేలిక తెలుగు వాచకం,
  • బుడ్డిగ సుబ్బరాయన్‌, సురభి పెద్ద బాలశిక్ష, ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్ అఫ్ ఇండియా, 3-4-495 బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027