యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

రాజకీయ పార్టీ

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు, కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2010 డిసెంబరు 7న పులివెందులలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించాడు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు[1]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులువై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
Secretaryవిజయసాయి రెడ్డి
పార్లమెంటరీ పార్టీ నేతవిజయసాయి రెడ్డి
లోక్‌సభలో పార్టీ నేతపి.వి.మిధున్ రెడ్డి
రాజ్య సభలో పార్టీ నేతవిజయసాయి రెడ్డి
అసెంబ్లీలో పార్టీ నేతవై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
స్థాపనమార్చి 11, 2011
సిద్ధాంతంప్రాంతీయతావాదం
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
151 / 175
తెలంగాణా అసెంబ్లీ
0 / 119
లోక్ సభ
22 / 545
రాజ్య సభ
09 / 245
ఓటు గుర్తు
అభిమానులతో వై.యస్.జగన్
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్.పార్టీ అధ్యక్షుడు

చరిత్ర

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పేరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి అభిమాని తొలిగా నమోదు చేశాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దానిపై హక్కులను పొందాడు..[2]

ఎన్నికలు

2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించింది. ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది.స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకి బాగా చేరువ అయినది. ప్రత్యేక హోదాపై అలుపెరుగని పోరాటం చేయడమే కాక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల మధ్య నుంచే ఎండగట్టింది. 2019 ఎన్నికలలో కేవలం ఆంధ్రప్రదేశ్ పై దృష్టిపెట్టి, ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను 151 స్థానాలతో, భారత లోక్‌సభలో 22 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ విభాగంలోను అత్యున్నత ఫలితాలు అందుకుంది.

ఎన్నికల చరిత్ర

శాసనసభ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్

సంవత్సరంసాధారణ ఎన్నికలుగెలిచిన స్థానాలుఓట్ల శాతంఫలితంమూలం
201414వ శాసనసభ
67 / 175
44.47%ఓటమి[3]
201915వ శాసనసభ
151 / 175
49.95%గెలుపు

తెలంగాణ

సంవత్సరంసాధారణ ఎన్నికలుగెలిచిన స్థానాలుఓట్ల శాతంఫలితం
20141వ శాసనసభ
3 / 119
ఓటమి

లోక్ సభ ఎన్నికలు

సంవత్సరముసాధారణ ఎన్నికలుగెలిచిన స్థానాలు
201215వ లోక్ సభ
2 / 25
201416వ లోక్ సభ
8 / 25
201917వ లోక్ సభ
22 / 25

వాగ్ధాన పత్ర

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[4][5] జనాకర్షక పథకాలలో కొన్ని:[6]

  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతులకు, కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ
  • ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నియామకాలు అతి స్వల్ప కాలంలో భర్తీ

వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వం

2022 మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆ పార్టీ నేతలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. "దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.[7][8]

ప్లీన‌రీ స‌మావేశాలు 2022

ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) ప్లీన‌రీ స‌మావేశాలు 2022 జూలై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వ‌హించారు. గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో ప్లీన‌రీ వేదిక‌పై[9] పార్టీ ప్రారంభించి ప‌దేళ్లు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్. జ‌గ‌న్ మోహన్ రెడ్డి మూడేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో ప్లీన‌రీని ఘ‌నంగా ముగిసింది. ఆ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ ప్లీనరీలో రెండోరోజు తీర్మానం చేసి ఆమోదించారు.[10] మొదటిరోజు ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు