ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం

ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూర్‌లో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు మహదేవునిగా భక్తులకు దర్శనమిస్తాడు.[1]

మహాదేవర్ దేవాలయం

స్థల పురాణం

పూర్వం ఖార అనే రాక్షసుడు ఈశ్వరభక్తుడు. ఘోర తపస్సు చేసి ఆ శంభుని నుంచి మూడు శివలింగాలను పొందుతాడు. వీటిని తీసుకువెళ్లే సమయంలో ఒకటిని పళ్లతో ఉంచుకొని మిగిలిన వాటిని రెండు చేతులతో పట్టుకుంటాడు. అనంతరం వరుసగా కడుతురుత్తి, వైకొం, ఎట్టుమనూర్‌లో ప్రతిష్ఠిస్తాడు. తరువాత జింక అవతారం దాల్చి ఎట్టుమనూర్‌లో స్వామి సేవలో తరిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన లయకారకుడు జింక రూపంలో ఉన్న ఖారుడిని ఎత్తుకొంటాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుని కోసం కైలాసం నుంచి విచ్చేసిన ప్రదేశం కావడంతో ఎట్టుమనూర్‌ దివ్యక్షేత్రంగా శోభిల్లుతోంది.[2][3]

దేవాలయ విశేషాలు

మహదేవునికి ట్రావన్‌కూర్‌ రాజ్య స్థాపకుడు తిరునాళ్‌ మార్తాండవర్మ బంగారుతో చేసిన ఎనిమిది ఏనుగుల విగ్రహాలను కానుకలుగా సమర్పించాడు.వీటిలో ఏడు ఏనుగుల విగ్రహాలు రెండు అడుగుల ఎత్తుఉంటాయి. మరో ఏనుగు ఒక్క అడుగు ఎత్తులో ఉంటుంది. అందుకనే వీటిని ఎళారా పొన్నన అంటారు. మలయాళంలో ఎళారా అంటే ఏడున్నర అని అర్థం. పొన్నన అంటే బంగారు ఏనుగు అని. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో వీటిని ప్రదర్శస్తారు.

ఉత్సవాలు

ప్రతి నెల ఫిబ్రవరి-మార్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ఎనిమిది, పదోరోజున బంగారు ఏనుగులతో ఊరేగింపు జరుపుతారు. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఏనుగులతో పాటు బంగారు ఏనుగుల విగ్రహాలను భక్తుల సందర్శనకు తీసుకువస్తారు.

ఆలయ శిల్పకళ

ఆలయాన్ని కేరళ వాస్తురీతికి అనుగుణంగా నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో గోడలపై వేసిన చిత్రాలు అద్భుతంగా ఉంటాయి.అందర్ని అలరిస్తాయి. శివతాండవం చేస్తున్న చిత్రం ధ్వజస్తంభంపై వృషభమూర్తి బొమ్మను చూడవచ్చు.

రవాణా సౌకర్యం

  • రైల్వేస్టేషన్‌: కొట్టాయం నుంచి 11 కి.మీ. దూరంలో ఉంది. కొట్టాయం చేరుకొని ఆటోలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు.
  • రోడ్డుమార్గం: దేశంలోని అన్నిప్రాంతాలనుంచి కొట్టాయానికి రోడ్డు మార్గముంది.
  • విమానాశ్రయం: కొచ్చిలోని విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి వాహనాల్లో చేరుకోవచ్చు. దూరం 77 కి.మీ.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ