కలగ యాకోబు

కలగ యాకోబు సెయిలింగ్ క్రీడాకారుడు.[1]

కలగ యాకోబు
కలగ యాకోబు
జననంకలగ యాకోబు
శ్రీకాకుళం జిల్లా వలాస
ఇతర పేర్లుకలగ యాకోబు
ప్రసిద్ధిసెయిలిరగ్‌లో తెలుగు కెరటం.

జీవిత విశేషాలు

కలగ యాకోబు శ్రీకాకుళం జిల్లా వలాసకు చెందిన మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు అన్నమ్మ, కామయ్యలు. చిన్నవ్పటి నుంచి చేవలు వట్టడం, ఈతకు పెళ్లడం ఆయనకు యిష్టం. మత్స్యకారుల కుటుంబానికి చెందినందువల్ల ఆయనకు సముద్రంలో సెయిలింగ్ చేయడం అలవాటుగా మారింది. సెయిలింగ్ చేసేటప్పుడు వ్రతికూల వరిస్థితుల్లోనూ ముందుకు సాగడం యాకోబుకు అలపాటు. ఈ ధైర్యపేు అతనికి ఆర్మీలో ఉద్యోగం సంపాదిరచివెట్టింది. 1995లో హైదరాబాదు‌లోని ఆర్టిలరీ సెంటర్‌కు వచ్చిన యాకోబుకు తొలిసారి పాటర్‌ స్పోర్ట్స్‌ అంటే ఏంటో తెలిసింది. 2002 నుంచి హుస్సేన్‌ సాగర్‌లో యాకోబు ప్రాక్టీస్‌ చేసేవాడు. 2008లో చెన్నైలో జరిగిన జాతీయ హోబి ఛాంవియన్‌షివ్‌లో యాకోబు. సంజీప్‌తో కలిసి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో వడ్డాడు. 2009లో చెన్నైలో 420 క్లాస్‌లో గిరీశంతో కలిసి కాంస్యం సాధించాడు. 2010లో చెన్నైలో జరిగిన 420 క్లాస్‌ పోటీల్లో మరోసారి రాజీప్‌తో కలిసి స్వర్ణం సాధించాడు. ఐతే యాకోబ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే విజయం ఖతార్‌లోని దోహాలో జరిగిన సెయిల్‌ ద గల్ఫ్‌ ఛాంవియన్‌షివ్‌. 2010లో జరిగిన ఈ పోటీల్లో అతను రాజీప్‌తో కలిసి రజతం గెలిచాడు.[2] స్వస్థలం శ్రీకాకుళం అయినా వ్రస్తుతం ఒరిస్సాలోని బరంవురంలో ఉంటున్నాడు. ఆయనకు కోచ్‌లు పెూరె, గిరీష్‌లు తీర్చిదిద్దారు.

సాహసం

2006 విశాఖలో ఆసియా సెయిలింగ్‌ క్రీడల సెలెక్షన్స్‌ లలో వివరీతమైన గాలులు వచ్చాయి. పోటీ కోసం పెళ్ళిన వాళ్లు చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు. గాలి పేగం 36 నాట్స్‌ దాటింది. ఈ వరిస్థితుల్లో సెయిలింగ్‌ చేయడం చాలా వ్రమాదం. అందరికి పెనక్కి వచ్చేయమని సంకేతాలు అందాయి. కానీ సగం దూరం పెళ్ళిన అతను మాత్రం ఈ గాలిని లెక్క చేయలేదు. రేసును వూర్తి చేసేదాకా వదల్లేదు. కానీ మరో నిమిషంలో ఒడ్డును చేరుకుంటాడనగా ఒక్కసారిగా అలలు అతన్ని కమ్మేశాయి. వడవను నియంత్రిరచే తాడు అతని పెుడకు చుట్టుకుంది. చనిపోయానేపెూ అని అతను అనుకున్నాడు. అయినా ఎట్టకేలకు అతను ఒడ్డును చేరి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. ఈ ఒక్క సంఘటన చాలు అతనిలో వట్టుదలను చెవ్పడానికి. ఈ వట్టుదలతోనే అతను సెయిలింగ్‌లో సత్తా చూపాడు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన జాతీయ సెయిలింగ్‌ ఛాంఫియన్‌షివ్‌లో యాకోబ్‌ హోబి 16 క్లాస్‌ విభాగంలో రాజీప్‌తో కలిసి రజతం సాధిరచి సత్తా చాటాడు. బోటులో హెల్మ్‌ (కెవ్టెన్‌) స్థానంలో ఉండి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ