ద్రాస్

లడఖ్ లోని పట్టణం

ద్రాస్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో కార్గిల్ జిల్లాలోని హిల్ స్టేషన్. ఎత్తైన ట్రెక్కింగ్ మార్గాలు, పర్యాటక ప్రదేశాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇది నేషనల్ హైవే 1 (జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి ముందు దీని పేరు NH 1D) పైన, జోజి లా కనుమకు, కార్గిల్ పట్టణానికీ మధ్య ఉంది. దీనిని "లడఖ్ ముఖద్వారం" అని అంటూంటారు.[3]

ద్రాస్
హేం-బాబ్స్
హుమాస్
హిల్ స్టేషను
ద్రాస్
ద్రాస్
Nickname: 
లడఖ్ ముఖద్వారం
ద్రాస్ is located in Ladakh
ద్రాస్
ద్రాస్
Location in Ladakh, India
ద్రాస్ is located in India
ద్రాస్
ద్రాస్
ద్రాస్ (India)
Coordinates: 34°25′51″N 75°45′06″E / 34.4307175°N 75.7516836°E / 34.4307175; 75.7516836
దేశం India
కేంద్రపాలిత ప్రాంతంలడఖ్
జిల్లాకార్గిల్
తహసీల్ద్రాస్[1]
Elevation3,300 మీ (10,800 అ.)
జనాభా
 • Total21,988
భాషలు
 • అధికారికఉర్దూ, బల్టీ, షీనా
Time zoneUTC+5:30 (IST)
PIN
194102

శబ్దవ్యుత్పత్తి

సాంప్రదాయకంగా, ద్రాస్‌ను హేమ్-బాబ్స్ అని అంటారు. అంటే "మంచు భూమి" అని అర్థం. "హేమ్" అంటే మంచు. శీతాకాలంలో ద్రాస్ సగటు ఉష్ణోగ్రత -20 డిగ్రీల సెల్సియస్.[4]

భౌగోళికం

ద్రాస్ వ్యాలీ

ద్రాస్ పట్టణం 34°25′50″N 75°45′06″E / 34.4306603°N 75.751552°E / 34.4306603; 75.751552 వద్ద, 3,300 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని "లడఖ్ ముఖద్వారం" అని అంటారు. ఇది ద్రాస్ అనే పేరు గల లోయకు మధ్యలో ఉంది. ద్రాస్, శ్రీనగర్ నుండి 140 కి.మీ., సోన్మార్గ్ నుండి 63 కి.మీ. దూరంలో ఉంది. కార్గిల్ పట్టణం ద్రాస్ నుండి రెండోవైపున, శ్రీనగర్ - లేహ్ జాతీయ రహదారి 1 పై 56 కి.మీ. దూరంలో ఉంది. 

చరిత్ర

ద్రాస్, జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో (1846-1947), లడఖ్ వజారత్ లోని కార్గిల్ తహసీల్‌లో భాగంగా ఉండేది. [5]

1947-48లో పాకిస్తాన్ దాడి సమయంలో, గిల్గిట్ స్కౌట్లు కార్గిల్ ప్రాంతంపై 1948 మే 10 న దాడి చేశారు. కాశ్మీర్ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సైన్యం తన బలగాలను పంపింది. అయితే, వారు సమయానికి చేరుకోలేకపోవడంతో, 1948 జూన్ 6 న ద్రాస్ గిల్గిటీల వశమైపోయింది. ఆ తరువాత కార్గిల్, స్కర్దూ కూడా వాళ్ళ వశమైపోయాయి. [6] 1948 నవంబరులో, భారత సైన్యం ట్యాంకుల మద్దతుతో ఆపరేషన్ బైసన్ ను మొదలుపెట్టి, ద్రాస్, కార్గిల్‌లను తిరిగి తన అధీనం లోకి తెచ్చుకుంది. స్కర్దూ అయితే పాకిస్తాన్ నియంత్రణలోనే ఉండిపోయింది. [7] 1949 కాల్పుల విరమణ రేఖ ద్రాస్ నుండి ఉత్తరాన 12 కి.మీ. దూరంలో, పాయింట్ 5353 ద్వారా పోతుంది.[8]

1972 సిమ్లా ఒప్పందంలో కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా మార్చారు. ఈ ఒప్పందం ద్వారా భారత పాకిస్తాన్‌లు తమతమ అభిప్రాయాలకు అతీతంగా, ఈ రేఖను గౌరవించటానికి అంగీకరించాయి.

అయితే, 1999 ప్రారంభ నెలల్లో, పాకిస్తాన్ సైనికులు, ముజాహిదీన్‌ల లాగా నటిస్తూ, ఈ ప్రాంతంలోకి చొరబడి, ద్రాస్ పట్టణానికి, హైవేకూ ఎదురుగా ఉన్న శిఖరాలను నియంత్రణ లోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ద్రాస్ నుండి 4 కి.మీ. దూరం లోని టోలోలింగ్, 8 కి.మీ. దూరం లోని టైగర్ హిల్ లను అధీనం లోకి తెచ్చుకున్నారు. అక్కడి నుండి వారు ద్రాస్ హైవే వద్ద ఫిరంగి కాల్పులు జరిపారు. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసింది. భారత సైన్యం 1999 జూలై నాటికి టోలోలింగ్, టైగర్ హిల్ శిఖరాల నుండి పాక్ సైనికులను తరిమేసింది. 1965 యుద్ధంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండో దాడి జరిపి 412 మంది భారతీయ దళాలను చంపి, ద్రాస్ కంటోన్మెంటు మొత్తాన్నీ నాశనం చేసింది.

శీతోష్ణస్థితి

Dras
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
97
 
−8
−23
 
 
100
 
−6
−22
 
 
137
 
−1
−15
 
 
104
 
5
−6
 
 
61
 
14
1
 
 
22
 
21
6
 
 
15
 
24
9
 
 
16
 
24
10
 
 
18
 
20
5
 
 
20
 
13
−1
 
 
33
 
4
−10
 
 
53
 
−3
−19
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Weatherbase

అధికమైన ఎత్తు కారణంగా ఏర్పడిన మధ్యధరా ఖండాంతర వాతావరణాన్ని (కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Dsb) ఎదుర్కొంటున్న ద్రాస్, భారతదేశంలో అతి శీతల ప్రదేశం. శీతాకాలంలో -20 °C కు అటూఇటూగా సగటు అల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. శీట్తాకాలం అక్టోబరు మధ్య నుండి మే మధ్య వరకు ఉంటుంది. వేసవికాలం జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ ఆరంభం వరకు కొనసాగుతుంది. వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు 23 °C కి దగ్గరగా ఉంటాయి. వార్షిక అవపాతం ఎక్కువగా డిసెంబరు - మే మధ్య లోనే సంభవిస్తుంది. ద్రాస్‌లో ఏటా 550 మి.మీ. వరకూ హిమపాతం సంభవిస్తుంది.

శీతోష్ణస్థితి డేటా - Dras
నెలజనఫిబ్రమార్చిఏప్రిమేజూన్జూలైఆగసెప్టెంఅక్టోనవండిసెంసంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F)5
(41)
6
(43)
10
(50)
18
(64)
25
(77)
30
(86)
33
(91)
31
(88)
29
(84)
25
(77)
15
(59)
9
(48)
33
(91)
సగటు అధిక °C (°F)−8
(18)
−6
(21)
−1
(30)
5
(41)
14
(57)
21
(70)
24
(75)
24
(75)
20
(68)
13
(55)
4
(39)
−3
(27)
9
(48)
రోజువారీ సగటు °C (°F)−15
(5)
−14
(7)
−8
(18)
0
(32)
7
(45)
13
(55)
16
(61)
17
(63)
12
(54)
6
(43)
−3
(27)
−9
(16)
2
(36)
సగటు అల్ప °C (°F)−23
(−9)
−22
(−8)
−15
(5)
−6
(21)
1
(34)
6
(43)
9
(48)
10
(50)
5
(41)
−1
(30)
−10
(14)
−16
(3)
−5
(23)
అత్యల్ప రికార్డు °C (°F)−42
(−44)
−43
(−45)
−33
(−27)
−25
(−13)
−8
(18)
−5
(23)
−5
(23)
−5
(23)
−20
(−4)
−29
(−20)
−45
(−49)
−43
(−45)
సగటు అవపాతం mm (inches)96.5
(3.80)
99.6
(3.92)
137.1
(5.40)
104.1
(4.10)
60.9
(2.40)
22.3
(0.88)
15.2
(0.60)
16.2
(0.64)
17.7
(0.70)
20.3
(0.80)
32.5
(1.28)
53.3
(2.10)
675.7
(26.62)
Source: [1]

జనాభా వివరాలు

షినా మాట్లాడే షినా ప్రజలు, బాల్టి మాట్లాడే బాల్టి ప్రజలు ఇక్కడి ప్రధానమైన జాతి జనులు. ఈ చిన్న పట్టణంలో సున్నీ ఇస్లాం మతస్థులు (60%), నూర్బాక్షియా ఇస్లాం మతస్థులు (20%), షియా ఇస్లాం మతస్థులు (20%) మంది ఉన్నారు. స్థానిక జనాభా 64% పురుషులు, 36% స్త్రీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ద్రాస్ జనాభా 21,988. వీరిలో 14,731 మంది పురుషులు కాగా, ఆడవారు 7257 మంది. 0-6 సంవత్సరాల వయస్సులో 2767 మంది పిల్లలు ఉన్నారు. వారిలో 1417 మంది బాలురు, 1350 మంది బాలికలు ఉన్నారు.[9]

పర్యాటకం

కార్గిల్ యుద్ధం తరువాత 1999 నుండి ద్రాస్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేకూరిన ఈ కొత్త వనరు, మొదట్లో ప్రత్యేకంగా యుద్ధ ప్రాంతాన్ని చూడటానికి వచ్చే సందర్శకులతో మొదలైంది.[10] ఇక్కడి పర్యాటక ప్రదేశాలు:

  • మన్మాన్ టాప్: ద్రాస్ నుండి 10 కి.మీ., అక్కడ నుండి ద్రాస్ లోయ, ఎల్.ఓ.సి (నియంత్రణ రేఖ) లను చూడవచ్చు.
  • గోంచన్ లోయ: ద్రాస్ నుండి 5 కి.మీ. ఇక్కడ హిమానీనదం, వాగు ప్రవహించే లోయ ఇన్నాయి
  • డాంగ్‌చిక్: ద్రాస్ నుండి10 కి.మీ. (వ్యవసాయం, విద్య, శాంతి పరంగా ఇదొక నమూనా గ్రామం. పోలీసు రికార్డు ప్రకారం సున్నా కేసులు ఉన్న గ్రామం కూడా)
  • నింగూర్ మసీదు: భీంబెట్. ద్రాస్ నుండి 7 కి.మీ. (అల్లాహ్ యొక్క ప్రత్యేక ఆశీర్వాదం ఉన్నట్లు భావిస్తున్న మసీదు. వీటిలో ఒక గోడ నిర్మాణ సమయంలో సహజంగా పెరిగినట్లు నమ్ముతారు. ఈ మసీదును ముస్లిం యాత్రికులు సందర్శిస్తారు)
  • భీంబెట్ స్టోన్: ద్రాస్ నుండి 7 కి.మీ. (హిందూ యాత్రికులకు పవిత్ర రాయి)
  • ద్రాస్ యుద్ధ స్మారకం: ద్రాస్ నుండి 7 కి.మీ. (కార్గిల్ యుద్ధ స్మారకం అని కూడా అంటారు)
  • ద్రౌపది కుండ్: ద్రాస్ నుండి 18 కి.మీ.
  • మినామార్గ్: ద్రాస్ ప్రధాన కార్యాలయం నుండి 30 కి.మీ. దూరంలో ఉన్న లోయ. ఇక్కడీ కొండలు మాకోయి హిమానీనదాల సరిహద్దులో ఉన్నాయి. అమర్‌నాథ్ యాత్రకు మార్గం ఇదే
  • మాతాయెన్: ద్రాస్ నుండి 20  కి.మీ. దూరంలో, కాశ్మీరీ మాట్లాడే ప్రజలున్న లడఖ్ గ్రామం
  • లేజర్ లా: పాల లాగా తెల్లటి నీరుండే హిల్ స్టేషన్. ద్రాస్ నుండి సుమారు 14 కి.మీ. ఇక్కడే లేజర్ లా హిమానీనదం ఉంది.
  • చోర్కియాట్ అడవి: (ద్రాస్ నుండి 20 కి.మీ. దూరంలో LOC కి దగ్గరలో ఉంది. డాంగ్చిక్ నుండి 5 కి.మీ.దూరంలో ఉంది. అనేక అడవి జంతువులతో కూడిన అటవీ ప్రాంతం)
  • టియాస్బు అస్తానా: ద్రాస్ నుండి 2 కి.మీ. (ముస్లింలకు యాత్రా స్థలం)
  • సాండో టాప్ / సాండో బేస్: ద్రాస్ నుండి 8 కి.మీ. పాకిస్తాన్ పోస్టులు సాండో టాప్ నుండి కనిపిస్తాయి. టైగర్ హిల్, సాండో టాప్‌కు ముందు ఉంది (ద్రాస్ నుండి 1 గంట దూరం).
  • ముష్కు లోయ: ద్రాస్ నుండి 8 కి.మీ. (ఎడారి లాంటి లడఖ్ లోని ఈ ప్రాంతం వేసవి కాలంలో వివిధ అడవి పువ్వులకు ప్రసిద్ది చెందింది)
  • ద్రాస్-గురేజ్ ట్రెక్ రూట్: (ముస్కు లోయ, బొటకుల్, పర్వతాల గుండా ద్రాస్ నుండి గురేజ్, బండిపోరా వరకు ట్రెక్ మార్గం (వాహన రహదారి కూడా గురేజ్‌తో ద్రాస్‌ను కలుపుతుంది)
  • బ్రిగేడ్ యుద్ధ చిత్రాల ప్రదర్శన: ద్రాస్ నుండి 3 కి.మీ. - 1999 యుద్ధానికి సంబంధించిన సమాచారం.
  • 1999 యుద్ధంలో ఖాళీ చేసిన పంద్రాస్ సరిహద్దు గ్రామం. ద్రాస్ నుండి 13 కిలోమీటర్ల దూరం
  • టోలోలింగ్ జలపాతం: ద్రాస్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. లడఖ్ ప్రాంతంలో ఉన్న ఏకైక జలపాతం ఇది.
  • త్సోచక్ సరస్సు: ద్రాస్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోలోలింగ్ కొండలలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,420 అడుగుల ఎత్తులో ఉంది. ఇది మంచినీటి సరస్సు.
  • గోషన్ లోయ: ఇది ద్రాస్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చని లోయ. ఈ గ్రామాన్ని మోన్-చోటో అనే వ్యక్తి, అతని కుటుంబం స్థాపించారని నమ్ముతారు. గిల్గిత్ బాల్టిస్తాన్లో చిలాస్ లోని వారి ఇంటిని విడిచి వెళ్ళవలసి వచ్చింది. వారు ద్రాస్‌లో మొదటి స్థిరనివాసులని అంటారు.
  • గాంగ్జ్లా ట్రెక్: 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పించడానికి ఇది ద్రాస్ టు గాంగ్జ్లా (దీనిని ఇప్పుడు టైగర్ హిల్ అని పిలుస్తారు) నుండి 2 రోజుల ట్రెక్. శీతాకాలంలో దాదాపు 10 అడుగుల లోతున మంచు ఉంటుంది.
  • ద్రాస్-లేజర్ లా-సాలిస్కోట్ ట్రెక్: లేజర్ లా టాప్ ద్వారా ద్రాస్ నుండి సాలిస్కోట్ వరకు మూడు రోజుల ట్రెక్. లేజర్ లా ద్రాస్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హిల్ స్టేషన్. ద్రాస్-కార్గిల్ హైవే నుండి నుండి ఒక జలపాతాన్ని చూడవచ్చు
  • అమర్‌నాథ్ ట్రెక్: అమర్‌నాథ్ పవిత్ర గుహకు ట్రెక్. ద్రాస్ నుండి మొదలై దాదాపు నాలుగైదు రోజులు పడుతుంది. ఈ మార్గం 15,060 అడుగుల ఎత్తున కనుమ గుండా పోతుంది.
  • మాకోయి హిమానీనదం: ఇది ద్రాస్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే పేరుతో ఉన్న మాకోయి శిఖరం 17,907 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇది ఏడాది పొడుగునా మంచుతో కప్పడి ఉండే హిమానీనదం. ద్రాస్ నది ఈ హిమానీనదం నుండే ఉద్భవించింది.
  • టైగర్ హిల్: దీన్ని పాయింట్ 5065 అని కూడా అంటారు. ఇది ఈ ప్రాంతంలో ఎత్తైన శిఖరం. 1999 కార్గిల్ యుద్ధంలో దీనిని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.
  • KBS (కార్గిల్ బ్యాటిల్ స్కూల్): ఇది భారత సైనికులకు శిక్షణ ఇస్తుంది. కార్గిల్ యుద్ధం ముగిసిన తరువాత, పర్వతారోహణ లోను, అధిక ఎత్తుల్లోనూ యుద్ధంలో జవాన్లకు శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఇవి కూడ చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ