నయన తార

భారతీయ సినీ నటి

నయన తార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటీమణి.[4]

నయనతార
జననం
డయానా మరియం కురియన్[1]

(1984-11-18) 1984 నవంబరు 18 (వయసు 39)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలుఉయిర్, ఉలగం
సంతకం

నేపధ్యము

నయనతార 1984 నవంబరు 18 బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది.

నట జీవితము

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.

తర్వాత తమిళంలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజైన 'ఈ', 'వల్లభ' సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన 'బిల్లా' సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

నయన తార వివాహ వేడుక ఫోటో- 2022 జూన్ 9

వ్యక్తిగత జీవితము

సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్ళి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్‌) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది.[5]

వివాహం

నయనతార వివాహం నటి విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్​లో జరిగింది.వీరి వివాహానికి రజినీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధిక శరత్‌కుమార్, విజయ్​ సేతుపతి, కార్తి తదితరులు హాజరయ్యారు.[6] నయన్ విఘ్నేష్ ల నిశ్చితార్థం 2021 మార్చి 25న జరిగింది.[7][8] వారికీ సరోగసీ ద్వారా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు.[9][10][11]

నయన తార నటించిన తెలుగు చిత్రాలు

YearFilmCo-StarsDirectorLanguageRoleOther notes
2003Manassinakkareజయరాంసత్యన్ అంతికాడ్మలయాళంగౌరి
2004విస్మయతుంబత్తుమోహన్‌లాల్ఫజీల్మలయాళంరీటా మాథ్యూస్
నట్టురజావుమోహన్‌లాల్Shaji KailasమలయాళంKatrina
2005అయ్యశరత్ కుమార్, ప్రకాష్ రాజ్హరితమిళంసెల్వి
చంద్రముఖిరజనీకాంత్, జ్యోతిక, ప్రభు గణేషన్, వినీత్పి. వాసుతమిళందుర్గతెలుగులోకి చంద్రముఖిగా డబ్ చేయబడినది
తస్కర వీరన్మమ్మూట్టీపప్పన్ ప్రమోద్మలయాళంతంకమణిDubbed into తమిళం as Yuvaraj
RappakalMammoottyKamalమలయాళం.గౌరి
గజనిసూర్య శివకుమార్, ఆసిన్ తొట్టుంకల్ఎ. ఆర్. మురుగదాస్తమిళంచిత్రతెలుగులోకి గజనిగా డబ్ చేయబడినది
Sivakasiవిజయ్, ఆసిన్PerarasuతమిళంనయనతారCameo Appearance
2006Kalvanin KadhaliS. J. SuryahTamilvaananతమిళంHaritha
లక్ష్మివెంకటేష్, Charmme Kaurవి.వి.వినాయక్తెలుగునందినిDubbed into Malayalam as Lakshmi
బాస్Akkineni Nagarjuna, Poonam Bajwaవి.ఎన్.ఆదిత్యతెలుగుఅనూరాధDubbed into Malayalam as Boss I love u
VallavanSilambarasan, Sandhya, రీమా సేన్SilambarasanTamilస్వప్న
ThalaimaganSarath Kumarశరత్ కుమార్తమిళంమేఘల
EజీవS. P. Jhananathanతమిళంజ్యోతి
2007యోగిప్రభాస్V.V. VinayakTeluguనందినిDubbed into Malayalam as Yogi
దుబాయ్ శీనురవితేజSrinu VaitlaతెలుగుమధుమతిDubbed into Malayalam as Dubai Seenu
శివాజీరజనీకాంత్, Shriya Saran, Vivek, SumanShankarతమిళంGuest RoleCameo Appearance
Dubbed into Telugu as Sivaji
తులసివెంకటేష్Boyapati SrinuతెలుగుVasundhara Ram
బిల్లాAjith Kumar, నమితVishnuvardhanతమిళంSasha
2008Yaaradi Nee MohiniDhanushJawaharతమిళంKeerthi
SathyamVishalRajesekharతమిళంDeivalakshmiFilming
Twenty: 20Mammooty, MohanlalJoshyమళయాళంCameo appearance
Filming
AeganAjith KumarRaju SundaramతమిళంFilming
Kuselanరజని కాంత్P.వాసుతమిళం
Villuవిజయ్ప్రభుదేవతమిళంFilming
2010అదుర్స్నందమూరి తారక్తెలుగు
2011శ్రీరామరాజ్యంనందమూరి బాలకృష్ణబాపుతెలుగుసీతాదేవి
2014అనామికవైభవ్ రెడ్డిశేఖర్ కమ్ములతెలుగుఅనామిక
నీ ఎంగె ఎన్ అన్బెతమిళ్
2016బాబు బంగారం[12]దగ్గుబాటి వెంకటేష్మారుతి దాసరితెలుగుశైలజ
2017ఇదు నమ్మ ఆళుతెలుగులో సరసుడు
2017వేలైక్కారన్తెలుగులో జాగో (2017)
2018క‌ర్త‌వ్యం (2018 సినిమా)
2019ఐరా |సర్జున్తెలుగు \ తమిళ్
2020అమ్మోరు తల్లి | Mookuthi Amman (Tamil)ఆర్‌.జె.బాలాజీఆర్‌.జె.బాలాజీతెలుగు \ తమిళ్అమ్మవారు పాత్ర
2021పెద్దన్నతెలుగు \ తమిళ్
2022గాడ్ ఫాదర్తెలుగు \ హిందీ
2022ఓ2తెలుగు \ తమిళ్

పురస్కారాలు

మూలాలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ