మహిళల టెస్టు క్రికెట్

మహిళల టెస్టు క్రికెట్, మహిళల క్రికెట్‌లో పురుషుల టెస్టు క్రికెట్‌తో సమానమైనది. మ్యాచ్‌లో నాలుగు-ఇన్నింగ్సులు ఉంటాయి. మ్యాచ్‌ రెండు ప్రముఖ క్రికెట్ దేశాల మధ్య గరిష్ఠంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా పురుషుల ఆటకు సంబంధించిన నిబంధనలే మహిళల అటకూ వర్తిస్తాయి. అంపైరింగు లోను, ఫీల్డు కొలతల్లో కొద్దిపాటి సాంకేతికమైన తేడాలు మాత్రం ఉంటాయి.

తొలి మహిళా టెస్టు మ్యాచ్ 1934-35 లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య జరిగింది
ఇంగ్లాడ్ క్రికెటరు సారా టేలర్ (ఎడమ) ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ (కుడి) 2017-18 మహిళా యాషెస్‌ టెస్టులో

1934 డిసెంబరులో మొదటి మహిళా టెస్టు మ్యాచ్, ఇంగ్లండ్ మహిళలకు ఆస్ట్రేలియా మహిళలకూ మధ్య జరిగింది. బ్రిస్బేన్‌లో జరిగిన ఆ మూడు రోజుల పోటీలో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.[1] ఇప్పటి వరకు మొత్తం 144 మహిళల టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. మహిళల వన్డే ఇంటర్నేషనల్‌లు, మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ల రాకతో ఏటా జరిగే మ్యాచ్‌ల సంఖ్య బాగా తగ్గుతూ పోతోంది. అంతర్జాతీయ క్యాలెండరంతా ఆట లోని చిన్న ఫార్మాట్‌లే ఉంటూ ఉన్నాయి.

ఆట నియమాలు

ఐసిసి వారి "మహిళల టెస్టు మ్యాచ్ నియమాలు" డాక్యుమెంటులో పేర్కొనబడిన అనేక వైవిధ్యాలు మెరుగుదలలతో మహిళల టెస్టు క్రికెట్ క్రికెట్ చట్టాలకు లోబడి ఉంటాయి. ఈ ఆట నియమాలు చాలా వరకు, పురుషుల టెస్టు క్రికెట్‌లో ఉన్నట్లే ఉంటాయి. నాలుగు ఇన్నింగ్సులలో పదకొండు మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. టెస్టు క్రికెట్‌లో మూడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది: టై కావచ్చు, డ్రా కావచ్చు, ఒక జట్టు గెలవొచ్చు.[2]

పురుషుల ఆటకూ, మహిళల ఆటకూ ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, మహిళల టెస్టు మ్యాచ్లు సాధారణంగా ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులే జరుగుతాయి. అయితే, పురుషుల ఆటలో గంటకు 15 ఓవర్లకు బదులుగా మహిళల ఆటలో గంటకు 17 ఓవర్లు వేయాలి. కాబట్టి మహిళల టెస్టు మ్యాచ్లో రోజుకు 90 ఓవర్లకు బదులు 100 ఓవర్లు ఆడాలి. క్రికెట్ మైదానం కొలతలు కూడా తక్కువగా ఉంటాయి - పురుషుల టెస్టుల్లో ఉండే 65 నుండి 90 గజాల (59.44 నుండి 82.30 మీటర్లు) కాకుండా, మహిళల క్రికెట్లో 55-70 గజాలు (50.29 - 64.01 మీటర్లు) మధ్య ఉంటాయి.[2][3] మహిళలు పురుషుల కంటే చిన్న, తేలికైన బంతిని ఉపయోగిస్తారు - మహిళలు 4+15⁄16 - 5+5⁄16 ఔన్సుల (13,998 150,61 గ్రాములు) మధ్య బరువున్న బంతిని ఉపయోగించాలని క్రికెట్ చట్టాలు నిర్దేశించాయి. ఇది పురుషులు ఉపయోగించే బంతి కంటే 13,16 ఔన్సుల (23,03 గ్రాములు) తేలికగా ఉంటుంది.[4] మహిళల టెస్టు మ్యాచ్‌లలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (యుడిఆర్ఎస్) ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని సందర్భాల్లో టెలివిజన్ రీప్లేలను తనిఖీ చేయమని మూడవ అంపైర్ను అడగడానికి అంపైర్లకు అనుమతి ఉంది.[2][3]

మహిళల టెస్టులు తరచుగా నాలుగు రోజుల పాటు ఆడతారు కాబట్టి, ఫాలో-ఆన్ విధించడానికి కనీస ఆధిక్యం 150 పరుగులు, ఐదు రోజుల పాటు ఆడినప్పుడు 200 పరుగులు ఉంటుంది. ఇది నాలుగు/ఐదు రోజుల పురుషుల టెస్టు మ్యాచ్‌ల లాగానే ఉంటుంది.[5]

దేశాలు

మొత్తం మీద పది జాతీయ మహిళా జట్లు టెస్టు క్రికెట్‌లో తలపడ్డాయి. 1934-35 సీజన్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పర్యటనలో మొదటి మూడు జట్లు ఏర్పడ్డాయి. టెస్టు క్రికెట్‌లో చాలా తరచుగా పోటీపడినవి ఈ మూడు జట్లే; ఒక్కొక్కరు కనీసం 45 మ్యాచ్‌లు ఆడారు. దక్షిణాఫ్రికా, 1960లో మొదటి మ్యాచ్‌లో పోటీ చేసింది.[6] అయితే, ఆ దేశం లోని వర్ణవివక్ష విధానం కారణంగా అంతర్జాతీయ క్రీడ నుండి వారిని మినహాయించడం వలన,[7] వారు కేవలం పదమూడు టెస్టు మ్యాచ్‌లలో మాత్రమే ఆడారు. ఇది భారతదేశం ఆడిన మ్యాచ్‌ల కంటే తక్కువ. నాలుగు జట్లు - పాకిస్తాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక - ఐదు కంటే తక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడాయి.[6]

పురుషుల జట్లు ఉన్న దేశాలు, మహిళల టెస్టు జట్లు ఉన్న దేశాలూ ఒకటే కావు. పురుషుల టెస్టు జట్లున్న పూర్తి సభ్యులలో, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు మహిళల టెస్టు జట్లు లేవు. నెదర్లాండ్స్, పురుషుల ఆటలో టెస్టు జట్టు కానప్పటికీ, మహిళల ఆటలో టెస్టు ఆడే దేశం. ఐర్లాండ్‌కు, పురుషుల, మహిళల టెస్టు జట్లు ఉండగా, అసాధారణంగా మొదటి పురుషుల టెస్టు మ్యాచ్‌ కంటే పదిహేడేళ్ల ముందే మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఇప్పటి వరకు వారి ఏకైక టెస్టు మ్యాచ్ - రెండు జట్ల టెస్టు రంగప్రవేశం లోనూ ప్రత్యర్థి పాకిస్థానే. పాకిస్తాన్‌తో సహా మిగిలిన ఎనిమిది మంది పూర్తి సభ్యులు పురుషుల, మహిళల టెస్టు క్రికెట్‌ ఆడాయి.

ఇటీవలి పరిణామాలు

2019 ఏప్రిల్ నాటికి, అంతకుముందు మూడు సంవత్సరాల్లో ఒక మహిళల టెస్టు మ్యాచ్ మాత్రమే జరిగింది. మునుపటి పదేళ్లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కాకుండా కేవలం రెండు జట్లు మాత్రమే మహిళల టెస్టులో ఆడాయి.[8] ఆస్ట్రేలియా కెప్టెన్, మెగ్ లానింగ్, మరిన్ని మహిళల టెస్టు మ్యాచ్‌లు ఆడాలన్న ఆసక్తి వ్యక్తం చేసింది.[9] 2019 జూలైలో, ఇంగ్లండ్‌లో మహిళల యాషెస్ టెస్టు ముగిసిన తర్వాత, మహిళల టెస్టు మ్యాచ్‌లు నాలుగు రోజులు కాకుండా ఐదు రోజులు ఆడాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. ఈ మ్యాచ్‌లో రెండు సెషన్లు వాష్ అవుట్ అయ్యి డ్రాగా ముగిశాయి.[10]

2019 డిసెంబరులో, న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ మహిళల బిగ్ బాష్ లీగ్‌లో బలమైన ప్రదర్శనను కనబరిచిన తర్వాత, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య మహిళల టెస్టు మ్యాచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను అభ్యర్థించింది.[11] న్యూజిలాండ్ మహిళలు చివరిసారిగా, 2004లో టెస్టు మ్యాచ్‌లో ఆడారు. వారి చివరి పోటీ 1996లో ఆస్ట్రేలియాతో జరిగింది.[12] 2020 జూన్లో, ఐసిసి వెబ్‌నార్ సందర్భంగా డివైన్, భారతదేశానికి చెందిన జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరూ మహిళల క్రికెట్ కోసం బహుళ-ఫార్మాట్ సిరీస్ ఆలోచనకు మద్దతు ఇచ్చారు.[13]

2021 ఏప్రిల్లో, ఐసిసి అన్ని పూర్తి సభ్య మహిళా జట్లకు శాశ్వత టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) హోదా ఇచ్చింది.[14]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 నాడు, ఏడాది తర్వాత భారత్, ఇంగ్లండ్‌లు ఒక టెస్టు ఆడతాయని ప్రకటించారు.[15] ఈ టెస్టు బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లో 2021 జూన్ 16 - 19 మధ్య జరిగింది [16][17] అదనంగా, భారతదేశం, ఆస్ట్రేలియాల మధ్య సాధ్యమయ్యే టెస్టు మ్యాచ్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.[18]

2000 - 2021 జూన్ మధ్య, కేవలం ముప్పై మహిళల టెస్టు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. వాటిలో పద్నాలుగు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన యాషెస్ టెస్టులు.[19]

2021 మే 20న, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్టు మ్యాచ్ 2021 సెప్టెంబరు 30, అక్టోబరు 3 మధ్య వాకా గ్రౌండ్ పెర్త్లో జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది.[20] కోవిడ్ - 19 లాక్డౌన్లు, ఆంక్షల కారణంగా ఈ మ్యాచ్ను క్వీన్స్‌లాండ్, గోల్డ్ కోస్ట్‌ లోని మెట్రికాన్ స్టేడియానికి మార్చారు.[21] 2021 - 22 మహిళల యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య మరో టెస్టు మ్యాచ్ 2022 జనవరి 27 - 30 మధ్య మనూకా ఓవల్ కాన్‌బెర్రాలో జరిగింది.[22] ఈ రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.[23][24]

2022 జూన్ ప్రారంభంలో న్యూజిలాండ్ పురుషుల ఇంగ్లాండ్ పర్యటనలో 1వ టెస్టు సందర్భంగా బిబిసి టెస్టు మ్యాచ్ స్పెషల్ రేడియో కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే, మహిళల టెస్టు క్రికెట్‌కు "పెద్దగా భవిష్యత్తు లేద"ని నొక్కి చెప్పాడు.[25] ఈ ప్రకటన గణనీయమైన వివాదాన్ని సృష్టించింది. మహిళల ఆటపై నియంత్రణను మహిళల క్రికెట్ సంఘాలకు తిరిగి ఇవ్వాలని ఐసీసీకి మాజీ మహిళా టెస్టు క్రికెటర్లు, ఇతరుల నుండి పిలుపులు వచ్చాయి.[26]

2022 జూన్ చివరిలో, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలు 2003 తర్వాత తమ మొదటి మహిళల టెస్టు మ్యాచ్ ఆడాయి. 2014 నవంబరు తర్వాత దక్షిణాఫ్రికాకు ఇదే తొలి మహిళల టెస్టు. ఇది కౌంటీ గ్రౌండ్, టౌంటన్, ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇది ఇంగ్లండ్‌లో బహుళ-ఫార్మాట్ దక్షిణాఫ్రికా పర్యటన మొదటి దశ.[27][28]

మహిళల టెస్టు క్రికెట్ జట్లు [6]
జట్టుతొలితాజామ్యాచ్‌లుగెలిచినవిఓడినవిడ్రాలు
 ఆఫ్ఘనిస్తాన్n/an/a0000
 ఆస్ట్రేలియా1934202377211046
 బంగ్లాదేశ్n/an/a0000
 ఇంగ్లాండు1934202399201464
 భారతదేశం19762021385627
 ఐర్లాండ్200020001100
 నెదర్లాండ్స్200720071010
 న్యూజీలాండ్193520044521033
 పాకిస్తాన్199820043021
 దక్షిణాఫ్రికా1960202213157
 శ్రీలంక199819981100
 వెస్ట్ ఇండీస్1976200412138
 జింబాబ్వేn/an/a0000

రికార్డులు

బెట్టీ విల్సన్ మొదటి మహిళా టెస్టు హ్యాట్రిక్‌తో సహా అదే టెస్టులో 10 వికెట్లు తీసి సెంచరీ చేసిన మొదటి క్రికెటరు (పురుషుడు గానీ మహిళ గానీ).

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మినహా మిగతా దేశాల్లో మహిళల టెస్టు క్రికెట్‌ చాలా అరుదుగా ఆడటం వలన, కెరీర్‌లో అత్యధిక పరుగులు చేయడం వంటి సంచిత రికార్డులు ఆ మూడు దేశాలకు చెందిన క్రీడాకారుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ బ్రిటిన్ తన కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసింది, ఆమె 27 మ్యాచ్‌లలో మొత్తం 1,935 పరుగులు చేసింది. టాప్ ట్వంటీ క్రీడాకారిణులలో 18 మంది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌కు చెందినవారే.[29] ఆ జాబితాలో 15వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డెనిస్ అన్నెట్స్‌కు [29] పది మ్యాచ్‌లలో 81.90 తో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉంది.[30] అన్నెట్స్, 1987లో లిండ్సే రీలర్‌తో కలిసి 309 పరుగుల భాగస్వామ్యంతో మహిళల టెస్ట్ క్రికెట్‌లో అతిపెద్ద భాగస్వామ్యంలో కూడా పాల్గొంది.[31] ఎనిమిది మంది మహిళలు టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించారు;[32] 2004 లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌కు చెందిన కిరణ్ బలూచ్ చేసిన 242 పరుగులు వీటిలో అత్యధికం.

1949 - 1963 మధ్య ఇంగ్లండ్ తరపున ఆడిన మేరీ డుగ్గన్, మహిళల టెస్టు క్రికెట్‌లో 17 మ్యాచ్‌లలో 77 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.[33] తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన బెట్టీ విల్సన్, అత్యల్ప బౌలింగ్ సగటు 11.80 వద్ద 68 వికెట్లు పడగొట్టింది. మహిళల టెస్టు క్రికెట్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించింది కూడా ఆమెయే.[34] ఒక ఇన్నింగ్స్‌లో, ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కలిగిన ఇద్దరు ఆటగాళ్లు భారత ఉపఖండానికి చెందినవారు; భారతదేశానికి చెందిన నీతూ డేవిడ్, 1995లో ఇంగ్లండ్‌పై ఎనిమిది వికెట్లు తీసి ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.[35] 2004లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు [36] షైజా ఖాన్ పదమూడు వికెట్లు పడగొట్టింది.

వికెట్ కీపర్లలో, క్రిస్టినా మాథ్యూస్ తన కెరీర్లో అత్యధిక డిస్మిసల్స్ చేసింది - ఆస్ట్రేలియా తరఫున 20 మ్యాచ్ల్లో 46 క్యాచ్‌లు, 12 స్టంపింగులు చేసింది.[37] 1992లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున పది వికెట్లలో ఎనిమిదికి బాధ్యత వహించిన లిసా నై ఒకే ఇన్నింగ్సులో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రికార్డును కలిగి ఉంది.[38] ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి, పది వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల డబుల్ ను ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే సాధించారు - బెట్టీ విల్సన్, 1958లో ఇంగ్లాండ్‌పై చేయగా, ఎనిడ్ బేక్వెల్, 1979లో ఇంగ్లాండ్ తరఫున వెస్టిండీస్‌పై ఆ ఘనత సాధించింది.[39] విల్సన్ ప్రదర్శన పురుషుల లేదా మహిళల టెస్టులలో ఇటువంటి ఘనత సాధించడం ఇదే మొదటిసారి. మహిళల టెస్టులలో మొదటి హ్యాట్రిక్ కూడా ఇందులో భాగం.[40]

ఇవి కూడా చూడండి

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ