మాంజా

భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్,, నేపాల్, పాకిస్తాన్లలోని ఫైటర్ గాలిపటాలు మంజా అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరేస్తారు.

గాజు పూత పూసిన మాంజా

ఇతర పేర్లు

చరిత్ర

చైనా మాంజాలు నైలాన్‌‌‌‌తో తయారు చేస్తారు.మాంజాకు గాజుని పొడి పూసిన నైలాన్, సింథటిక్ దారాలు మాంజా తయారీలో వాడుతారు. కైంచీ (వేరే పతంగ్ దారానికి మెలిక వేసి తెంపటం) వేసిన సమయంలో చైనా మాంజా పతంగ్ తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగ్‌‌‌‌ని తెంపుతుండడంతో చాలా మంది ఈ రకం మాంజా వినియోగిస్తున్నారు.[1]

చైనా మాంజాపై నిషేధం

ఈ మాంజా ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే దారం కావటంతో గట్టిగా, పదునుగా ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో మాంజా చుట్టుకుని పక్షులు, పిల్లలూ గాయపడుతున్నారు. విద్యుత్, ట్రాఫిక్‌‌‌‌కి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఎక్కువగా డ్రైనేజీలో పేరుకుపోవటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది.పర్యావరణవేత్తలు, అటవీశాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు. 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద జీవోను జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించినా శిక్షార్హులని ప్రభుత్వం హెచ్చరించింది. జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించారు.[2][3]

పక్షులకు గాయాలు

ఈ మాంజా ప్లాస్టిక్‌ దారానికి గాజుపొడి అద్ది తయారు చేస్తారు. కైంచీ వేసిన సమయంలో చైనా మాంజా పతంగి తెగకుండా ఉండడంతో పాటు, ఎదుటివారి పతంగిని తెంపుతుండడంతో ఎక్కువ మంది ఈ రకం మాంజా ఉపయోగిస్తారు. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులకు కూడా హాని కలుగుతోంది. పక్షుల మెడకు, కాళ్లకు మాంజా చుట్టుకొని అవి మృత్యువాతకు గురవుతున్నాయి.[4][5]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ