వైకుంఠం

విష్ణు మూర్తి యొక్క నివాసస్థలం

వైకుంఠం హిందూ దేవుడైన విష్ణుమూర్తి ఆవాసం. దీనికి విష్ణులోకం అని కూడా పేరు. [1] విష్ణుమూర్తి హిందూమతంలోని త్రిమూర్తులలో ఒక దైవం. వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషునిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటాడు. వైకుంఠం పరమపదం, అది సమస్త లోకాల కంటే పైన ఉంటుంది, దానికి ఆవల మరింకేమీ లేదని శ్రీమద్రామానుజులు ప్రవచించారు. వైకుంఠానికి జయ విజయులు ద్వార పాలకులు. [2]

విష్ణువు, వైకుంఠానికి అధిపతి
విష్ణువు అధ్యక్షత వహించిన వైకుంఠానికి సంబంధించిన దృష్టాంతం

వైకుంఠం 2,62,00,000 యోజనాల దూరంలో, సత్యలోకానికి (బ్రహ్మలోకం) ఆవల మకరరాశిలో ఉంటుంది.[3] విశ్వానికి దక్షిణాగ్రం విష్ణుమూర్తి నేత్రమనీ, అక్కడి నుండే విష్ణువు విశ్వాన్ని పాలిస్తూంటాడనీ ఒక భావన.[4]


ఋగ్వేదం ఇలా చెబుతోంది:

తద్విష్ణో పరమం పదం సదా పశ్యన్తి సురాయా[5]

(దేవతలు సదా విష్ణుధామమైన పరమ పదం వైపు చూస్తూ ఉంటారు),[6]


మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ