శివరాజ్ సింగ్ చౌహాన్

శివరాజ్ సింగ్ చౌహాన్ (జననం 1959 మార్చి 5) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలు ఇతన్ని ముద్దుగా మామాజీ అని పిలుస్తారు.[1]

శివరాజ్ సింగ్ చౌహాన్
శివరాజ్ సింగ్ చౌహాన్


మధ్య ప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 మార్చి 23
గవర్నరులాల్జీ టాండన్

ఆనందిబెన్ పటేల్
(అదనపు బాధ్యత)

ముందుకమల్ నాథ్
పదవీ కాలం
29 నవంబరు 2005 (2005-11-29) – 17 డిసెంబరు 2018 (2018-12-17)
ముందుబాబూలాల్ గౌర్
తరువాతకమల్ నాథ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-05) 1959 మార్చి 5 (వయసు 65)
సీహోర్ జిల్లా, మధ్య ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలుజాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామిసాధన సింగ్ చౌహాన్
సంతానం2
సంతకంశివరాజ్ సింగ్ చౌహాన్'s signature

తొలినాళ్ళ జీవితం

శివరాజ్ సింగ్ చౌహాన్ 1959 మార్చి 5న జన్మించాడు. ఇతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్, తల్లి శ్రీమతి సుందర్‌బాయి చౌహాన్. భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (తత్వశాస్త్రం) లో బంగారు పతకంతో పట్టా పొందాడు.[2] 1975 లో భోపాల్ (మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్) ఆదర్శ్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1976-77 ఎమెర్జెన్సీని వ్యతిరేకించినందుకు భోపాల్ జైలులో ఖైదు చేయబడ్డాడు.[3] ఇతను 1977 నుండి రాష్ట్ర స్వయంసేవక్ సంఘం వాలంటీర్ గా పని చేసాడు. 1992 సంవత్సరంలో సాధనా సింగ్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

కెరీర్

భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లోను

1977-78లో అఖిల్ భారతీయ విద్యా పరిషత్తు సంస్థలో పదాధికారిగా ఎన్నికయ్యాడు. 1975 నుండి 1980 వరకు మధ్యప్రదేశ్‌లోని అఖిల్ భారతీయ విద్యా పరిషత్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. 1980 నుండి 1982 వరకు అఖిల్ భారతీయ విద్యా పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 1982-83లో కౌన్సిల్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, 1984-85లో భారతీయ జనతా యువ మోర్చా, మధ్యప్రదేశ్ సంయుక్త కార్యదర్శి, 1985 నుండి 1988 వరకు ప్రధాన కార్యదర్శి అలాగే 1988 నుండి 1991 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు చేపట్టాడు.[4]

ముఖ్యమంత్రిగా

చౌహాన్ 2005 లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. చౌహాన్ 2005 నవంబర్ 29న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2008 డిసెంబర్ 10 న చౌహాన్ 143 మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ నుండి శాసనసభ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5]

2018 శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మెజారిటీ రానందున చౌహాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. ఆ తరువాత కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెసు పార్టీ అధికారం చేపట్టింది. అయితే జ్యోతిరాదిత్య నాయకత్వంలో 22మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పార్టీకి రాజీనామా చేయడంతో, కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయి, 2020 మార్చి 23న చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.[6]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ