సాల్‌సీడ్ నూనె

సాల్ (Sal) /సాలువా చెట్టు గింజలలోని శాకనూనె/కొవ్వు (vegetable oil/fat) ఆహరయోగ్యం (Edible). గింజలలోని తైలం 45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-350C వద్ద గడ్దకట్టును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అంటారు.సాల్/సాలువ/సాల్వ చెట్టు యొక్క వృక్షశాస్రనామం: షోరియ రొబస్టా (Shorea Robusta, యిదిడిప్టెరోకార్పేసి (Diptero carpaceae) కుటుంబానికి చెందినది.[1] ఉత్తర భారతదేశంలో,, హిందిలో సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు[2]. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం, మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం [1].ఇదే కుటుంబానికి చెందినావాటిక రొబస్టా (vatica robusta) మరోమొక్కను గుగ్గిలం అంటారు[2].సాలువా మొక్కను గుగ్గిలం అనికుడా వ్యవహరిస్తారు.

చెట్టుకొమ్మలనిండుగా పూచిన పూలు
పూలమొగ్గలతో చెట్టుకొమ్మ
పండిన పళ్ళు
నూనెగింజలు

భారతీయభాషలలో సాలువ చెట్టు సాధారణ నామం[3][4]

వునికి,వ్యాప్తి.

ఆసియా దీని జన్మస్దానం. మయన్మార్, బంగ్లాదేశ్ , నేపాల్, ఇండియాలో వ్యాపించి వున్నవి[5]. ఇండియాలో అస్సాం, బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ , హర్యానా,, తూర్పు హిమాలయ పాదప్రాంతాలలో వ్యాపించి ఉంది. మధ్యభారతం లోని వింధ్య, సాత్పురా లోయ ప్రాంతాలలో (మధ్య, ఉత్తర ప్రదేశ్), యముననది తీరప్రాంతాల్లొ, తూర్పు కనుమల్లో ఉన్నాయి. ఇండియాలో దాదాపు 1.15 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించాయి. మధ్యప్రదేశ్‌లో 37,700, జార్ఖండ్‌లో 33,500, ఒడిస్సాలో 19,268, ఉత్తరప్రదేశ్‌లో 5,800, బెంగాల్‌లో 5,250,, అస్సాంలో 2,700 ల చదరపుకిలోమీటర్ల మేర సాల్వ వృక్షాలున్నాయి[6]. అయితే ఈ మధ్యకాలంలో కలపకై ఈ చెట్లను అక్రమంగా నరకడం వలన, ఆదే స్ధాయిలో మొక్కలను నాటక పొవడంవలన వీటి విస్తీర్ణం కొంతమేర తగ్గినది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఆటవీ విస్తీర్ణంలో, సాలువ వృక్షాలు 16.5% వైశాల్యంలో విస్తరించి.వ్యాపించి ఉన్నాయి.[7]

చెట్టు[1]

సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగును. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును. పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వర్ణంలోవుండి, నిలువుగా చీలికలుండి,4-5సెం, మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం, మీ, వుండును. ఆకులు అండాకారంగా వుండి, ఆకుతొడిమ వద్ద కొద్దిగా వెడల్పుగా వుండును. వర్షపాతం అధికంగా వున్న ప్రాంతాలలో సతత హరితంగా, లేని ప్రాంతాలలో ఆకురాల్చును. ఆకులను పూర్తిగా రాల్చదు (మోడుగా మారదు) [1]. ఫిబ్రవరి-ఏప్రిల్‌ నెలలలో ఆకురాల్చును. ఏప్రిల్‌-మే నెల మొదటి వారంలో చిగుర్చు ను. చిగిర్చిన వెంటనే పూలు ఏర్పడం మొదలై, జూలై నెల చివరికల్ల పళ్లు పక్వానికి వచ్చును. పూలు తెల్లగా వుండును. పండిన కాయ 1-1.5 సెం.మీ. వుండును. లోపలి పిక్క ముదురు గోధుమరంగులో (కాఫీ గింజ రంగులో) వుండును. కాయలో గింజశాతం 47% వుండును. గింజలో 13-14% వరకు సాల్‌ కొవ్వు (sal fat/butter) వుండును. ఒక ఎకరం వీస్తీర్ణంలో వున్న చెట్ల నుండి ఎడాదికి 400 కీజిల వరకు నూనె గింజలను సేకరించే వీలున్నది. కాని ఆ స్ధాయిలో సేకరణ జరగడం లేదు. ఆధిక మొత్తంలో విత్తన సేకరణకై చేసిన ప్రణాళికలు, అంచనాలకై పరిమితమై, అచరణలో వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం వున్న విస్తీర్ణాన్ని, ఎకరానికి వచ్చు దిగుబడిని లెక్కించిన దాదాపు 5.5 మిలియను టన్నుల నూనె గింజల సేకరణ జరగాలి. సేకరణ అనుకున్నట్లుగా జరిగినచో, గింజలలోని కొవ్వుశాతం 13%గా లెక్కించిన 7.15 లక్షల టన్నుల సాల్‌ కొవ్వు ఉత్పత్తి కావాలి. కాని 1-1.25లక్షల టన్నుల గింజలను మాత్రమే సేకరించగల్గుతున్నారు. అందువలన ఎడాదికి 10-13 వేల టన్నుల సాల్‌ కొవ్వును ఉత్పత్తి చేయగల్గుచున్నారు[3].

విత్తనాలనుండి నూనెను సంగ్రహించు విధానం

సేకరించిన విత్తనాలను మొదట జల్లెడలో జల్లించి మలినాలను (విత్తనేతర పదార్థాలు) తొలగించెదరు.తరువాత విత్తనాలను సీడ్ బ్రేకరు అనే రోలరు యంత్రాలలో చిన్నచిన్న ముక్కలుగా చేయుదురు.చిన్నగా చెయ్యబడిన చిన్నవిత్తనపు ముక్కలను కుక్కరు అనే యంత్రపరికరంలో, వత్తిడి కలిగిన నీటి ఆవిరి (steam) ద్వారావుడికించి మొత్తపరచి (విత్తనం మెత్తబడుటకై కొంతవరకు నీటి ఆవ్రిని విత్తనానికి నేరుగా కలపడం జరుగుతుంది, ఫ్లేకరు అనే యంత్ర పరికరాని కిపంపించెదరు.ఫ్లేకరులో రెండు పెద్ద ఐరన్ రోలరులు దగ్గరిగా బిగించబడి వుండును.ఈ రోలరుల మధ్యఖాళీ చాలా తక్కువగా (.3-.35మి.మీ.) వుండునట్లు అమర్చబడివుండును. ఈరోలరు ల మధ్యగా వుడికించిన విత్తన భాగాలు వెళ్ళునప్పుదు అవి సన్నని అటుకులవలె (flakes) పలుచగా నొక్కబడును. ఈస్థితిలో ఫ్లేక్సులో తేమశాతం12-14% వుండి,800C ఉష్ణోగ్రత వుండును.ఫ్లేక్సును కూలరు అనే పరికరంలో చల్లార్చి సాల్వెంట్‌ప్లాంటుకు పంపెదరు.అక్కడ హెక్సెనుఅనే హైడ్రోకార్బను ద్రావణిని ఉపయోగించి నూనెను సంగ్రహించెదరు[8].సాలువ గింజలలో కొవ్వు/నూనె శాతం 12-14% మాత్రమే ఉంది. అందుచే వీటినుండి నూనె/కొవ్వును కేవలం 'సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్ (Solvent extraction plant) ద్వారానే తీయుటకు సాధ్యం.[9] సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌ ద్వారా గింజలలోని కొవ్వును 99% వరకు పొందే వీలున్నది. నూనె/కొవ్వు తీసిన డి్‌ఆయిల్డ్‌కేకులో ప్రోటిన్‌ శాతం, మిగతా అయిల్‌ కేకులతో సరిపొల్చిన చాలా తక్కువగా 8-9% మాత్రమే (నూనె తీసిన తవుడులో14-16% వరకు ప్రొటిన్‌ వుండును). మిగతా నూనె కేకులలో ప్రొటిన్ (మాంసకృత్తులు) 30-45% వరకు వుండును..సాల్ విత్తనపిండి/కేకులో 10-12% ప్రొటిన్,, పిండిపదార్థాన్ని 50-70% కలిగివున్నది. అందుచే అతి తక్కువ మోతాదులో పాల డైరి పశు,, కోళ్లదాణాలో వినియోగిస్తారు.[10] సేంద్రియ ఎరువుగా వాడోచ్చును.

నూనె/కొవ్వు

పాడవ్వని, జాగ్రత్తగా నిల్వవుంచిన గింజలనుండి తీసిన కొవ్వులో ఫ్రీఫ్యాటీ ఆమ్లాలశాతం తక్కువగా (3-5%) వుండి, రిపైన్‌ చెయ్యుటకు అనుకూలంగా వుండును. ఎక్కువ ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం వున్న కొవ్వును స్టియరిక్‌ ఆమ్లం, సబ్బులు చెయ్యుటకు వినియోగించెదరు. కొవ్వు పచ్చని ఛాయ వున్నగొధుమరంగులో వుండును. ఒకరకమైన ప్రత్యేకవాసన కల్గివుండును.సాల్‌ కొవ్వులోని కొవ్వుఆమ్లాలు, వాటి శాతం ఇంచు మించు కొకొబట్టరు (cocoa butter) లోని కొవ్వుఆమ్లాలను పోలి వుండటం వలన, దానితో కలిపి లేదా కొకో బట్టరులు ప్రత్నామ్నయంగా చాకొలెట్‌ తయారిలో వుపయోగిస్తారు. సాల్‌ కొవ్వులోని ఒలిక్‌ ఆమ్లం,, స్టియరిక్‌ ఆమ్లం శాతం, కొకో బట్టరులోని, ఆమ్లాల శాతంతో ఇంచుమించు సరిపోతున్నది.[11] సాల్‌ కొవ్వు ధ్రవీభవన ఉష్ణోగ్రత 35-370C.కొకో బట్టరు ధ్రవీభవన ఉష్ణోగ్రత 33-350C. వీటి ద్రవీభవన ఉష్ణోగ్రత ఎక్కువవుండటం వలన వేడివాతావరణంలో కుడా (35-370C) చాకొలెట్‌లు మెత్తబడిపోకుండగా, గట్టిగా వుండును. అందుచే సాల్‌ కొవ్వును కొకో బట్టరులో 20-40% వరకు కలుపుతారు. అయితే కొన్నిరకాల సాల్‌కొవ్వులలో1-1.5% వరకు ఎపొక్సి స్టియరిక్‌ ఆసిడులు వుండు అవకాశం ఉంది. అలాంటి కొవ్వులలో వాటి ధ్రవీభవన ఉష్ణోగ్రత కొద్దిగా తక్కువగా వుండును.

నూనె భౌతిక లక్షణాలపట్టిక (ఆగ్ మార్కు) [12]

భౌతిక లక్షణాలుమితి
అయోడిన్ విలువ31-45
సపనిఫికెసను విలువ180-195
అన్‌సఫొనిపియబుల్ పదార్థం2.5 గరిష్ఠం
ద్రవీభవన ఉష్ణోగ్రత35-370C
విశిష్టగురుత్వం30/300C0.917-921
వక్రీభవనసూచిక, 400Cవద్ద1.4500-1.4600
టైటరు 0C46-53

రీఫైండు సాల్ నూనె/ కొవ్వుయొక్క ఫ్యాటిఆమ్లాల పట్టిక[3][13]

కొవ్వు ఆమ్లాలుశాతం
పామిటిక్‌ ఆమ్లం (C16:0)2.0-8.0
మార్గర్ (C17:O)0-5.0
స్టియరిక్ ఆమ్లం (C18:0)45-60
ఒలిక్ ఆమ్లం (C18:1)35-50
లినొలిక్ ఆమ్లం (C18:2)0-8.0
అరచిడిక్ ఆమ్లం (C20:0) -5.01.0

సాల్‌కొవ్వు, కొకోబట్టరులకున్న సామీప్యం

భౌతిక లక్షణాలుసాల్ కొవ్వుకొకోబట్టరు
ఐయోడిన్‌విలువ38-4333-38
సపొనిఫికెసన్‌విలువ185-195184-195
అన్‌సపొనిఫియబుల్‌పదార్థం1.2%1.2%
ద్రవీభవన ఉష్ణోగ్రత35-370C33-350C
ఫ్యాటి ఆమ్లాలు%
పామిటిక్‌ ఆమ్లం4-525.2
స్టియరిక్ ఆమ్లం44-4535-40
ఒలిక్ ఆమ్లం42-4435-40
లినొలిక్ ఆమ్లం0.1-0.22.5-3.0
అరచిడిక్ ఆసిడ్1.06.3
  • అయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాముల నూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) అయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగ సమయంలో నూనెలోని, ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును.అయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె అయోడిన్‌విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
  • సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
  • అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు, పోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థాలు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols, వర్ణకారకములు (pigments, హైడ్రోకార్బనులు,, రెసినస్ (resinous) పదార్థాలు.

డిఆయిల్డ్‌ కేకు

నూనేతీసిన తరువాత కేకులో పోషక విలువలు పెరుగుతాయి.తక్కువ తేమతో ఎక్కువ కాలం పాడవ్వకుండా నిల్వౌంచవచ్చును.డి్‌ఆయిల్డ్‌కేకు పోషక విలువలు[14].

పోషక పదార్థంవిలువలమితి%
ప్రోటిను7.8-9.7%
పీచుపదార్థం1.3-3.0%
NFE74.6-84.2
సెల్యూలోజ్5.7
కరిగే పిండిపదార్హాలు57.8
లిగ్నిన్11.9
మెటబాలిజబుల్‌ఎనర్జి1483-1803Kcal/Kg
పిండిపదార్థం (Starch)30.1

సాల్‌కొవ్వు,డిఆయిల్డ్ కేకు ఉత్పత్తి వివరాలు[15]

[SEA 38th annual report,2008-2009 ఆధారం]

1998-99నుండి2008-09 వరకు (10సం.లు)

మొత్తం పాసెస్‌చేసిన సాల్‌విత్తనాలు :3,34,940 టన్నులు

మొత్తం ఉత్పత్తి అయిన కొవ్వు/నూనె :44,877 టన్నులు,

అందులో

అహరయోగ్యం (edible)........ :30,310టన్నులు.

పారిశ్రామిక వినియోగం (non edible) :14,567టన్నులు.

ఉపయోగాలు

  • చాక్‌లెట్‌ తయారిలో, వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు.సబ్బులతయారిలో కూడా వినియోగిస్తారు[16]
  • ఫ్యాటి ఆసిడ్ల తయారిలోకూడా వాడెదరు. కొవ్వును అంశికరన (fractionation) చేసి స్టియరిన్‌ను తయారుచేయుదరు.
  • డి్‌ఆయిల్డ్‌ కేకును దాణాగా వినియోగిస్తారు.
  • సాల్‌ చెట్టు నుండి కలపను దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృఢమైనది సాలువ కలప.[17] వాహనాల బాడిలు, బీములు, బళ్ల చక్రాలు తయారుచేయుదురు.
  • పెరుగుచున్న చెట్టు కాండానికి గాటు పెట్టి, రెసిన్ (స్రవం) ను సంగ్రహించెదరు. ఈ రెసిన్‌ ధుపంగా, విరేచనాల నిరోధిగా పనిచేయును. చర్మ వ్యాదుల నివారణ లేపనాలలో రెసిన్ ను వాడెదరు.
  • సాలువ చెట్టు ఆకుల నుండి ఉత్తర భారతంలో చిన్న దొనెలు (కప్పుల వంటివి) డిస్పొజబుల్ పళ్లెలు, చిన్నబుట్టలు చేయుదురు.
  • ఆయుర్వేదంలో సాలువ గింజల పోడిని, ఆకుల చుర్ణాన్ని ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు/ఉల్లేఖనం

భాహ్య లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ