సుజాత మోహన్

భారతీయ నేపధ్య గాయకురాలు

సుజాత మోహన్, భారతీయ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో మంచి గాయినిగా పేరొందింది.

సుజాత మోహన్
వ్యక్తిగత సమాచారం
జననం (1963-03-31) 1963 మార్చి 31 (వయసు 61)[1][2]
కొచ్చి, కేరళ, భారతదేశం
వృత్తిప్లేబ్యాక్ సింగర్
క్రియాశీల కాలం1975-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
వి.కృష్ణ మోహన్
(m. 1981)
పిల్లలుశ్వేత మోహన్
బంధువులుజి. వేణుగోపాల్ (కజిన్)
రాధిక తిలక్ (కజిన్)
లేబుళ్ళు
  • తరంగిణి రికార్డ్స్
  • సత్యం ఆడియోస్
  • మ్యాగ్నసౌండ్ రికార్డ్స్
  • ఈస్ట్ కోస్ట్
  • సౌపర్ణిక

వ్యక్తిగత జీవితం

భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పాటైన ట్రావెన్ కోర్-కొచిన్ రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి పరూర్ టి.కె.నారాయణపిళ్ళే మనవరాలు సుజాత. 1981 మే 9న డాక్టర్ కృష్ణమోహన్ ను వివాహం చేసుకుంది ఆమె.[3] ఆమె ఏకైక కుమార్తె శ్వేత మోహన్ కూడా గాయిని కావడం విశేషం.

కెరీర్

సుజాత తన 17వ ఏట నుంచీ, చదువుకుంటూనే కె.జె.ఏసుదాసు వంటి గాయకులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజిలపై షోలు చేసింది. ఆమె 6వ తరగతి చదివే సమయంలోనే కన్నెళుతీ పొట్టుతట్టు అనే సినిమా పాట పాడింది. 1975లో విడుదలైన మలయాళ సినిమా టూరిస్ట్ బంగ్లాలోని ఈ పాటకు ఎం.కె. అర్జునన్ సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు శ్యాం చేసిన కామం క్రోధం మోహం, సలీల్ చౌదరీ స్వరపరిచిన అపరాధీ సినిమాల్లోని పాటలు పాడింది ఆమె. ఆ సమయంలోనే ఎం.జి.రాధాకృష్ణన్ ఎన్నో పాటలు పాడించాడు సుజాత చేత. అవన్నీ సినిమాలకు చెందని పాటలే. వాటిలో ఒడక్కుళల్ విలి అనే ఆల్బం అతి పెద్ద హిట్ అయింది.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ