అగ్ని-2

భారత్ తయారు చేసిన మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి

అగ్ని-2 ఒక వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. భారత క్షిపణి ఆధారిత వ్యూహత్మక అణు నిరోధకంలో అగ్ని శ్రేణి క్షిపణులు కీలకమైనవి. అగ్ని-2, రెండు దశల, ఘన ఇంధన చోదిత, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి. పోస్ట్ బూస్ట్ వాహనం (PBV) పునఃప్రవేశ వాహనం (RV) తో సమకూర్చబడింది. అగ్ని-2ఎ, అగ్ని-2 కంటే ఆధునికమైనది. మరింత తేలికైన పదార్థాలతో తయారైన ఈ క్షిపణి పరిధి ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్ని-2ఎ పేరునే తరువాతి కాలంలో అగ్ని-4 గా మార్చారు. ఇది అగ్ని-2, అగ్ని-3 ల మధ్య అంతరాన్ని పూరిస్తుంది. 2010 డిసెంబరులో చేసిన అగ్ని-2 పరీక్ష విఫలం కాగా, 2011 నవంబరులో చేసిన రెండవ పరీక్ష విజయవంతమైంది[6] అగ్ని-2 ను భారత సాయుధ బలగాల్లోకి చేర్చుకున్నారు.[7]

అగ్ని-2
రోడ్డు మొబైలు లాంచరుపై అగ్ని-2 2004 గణతంత్ర దినోత్సవాన ప్రదర్శితం
రకంమధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత దేశం
సర్వీసు చరిత్ర
వాడేవారుభారత సైన్యం
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
తయారీదారుభారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఒక్కొక్కదాని వెల25–35 కోట్లు[1]
విశిష్టతలు
బరువు16,000 కి.గ్రా. (1,000 కి.గ్రా. వార్‌హెడ్‌తో సహా)
పొడవు21 మీ.[2]
వ్యాసం1.3 మీ.[3]
వార్‌హెడ్Strategic nuclear (15 kt to 250 kt), conventional HE-unitary, penetration, sub-munitions, incendiary or fuel-air explosives

ఇంజనురెండున్నర దశల ఘన ఇంధన ఇంజను
వింగ్‌స్పాన్తెలియదు
ఆపరేషను
పరిధి
2,000–3,000 km[2][4]
ఫ్లైట్ సీలింగు405కి.మీ. [3]
ఫ్లైటు ఎత్తు230కి.మీ. [2]
వేగం~mach 12 or 3.9 km/s (Agni-II)[3][5]
కచ్చితత్వం30–40 మీ. (తాజా కూర్పు)
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 Tata TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher
దస్త్రం:Agni Missile Range comparison.svg
అగ్ని క్షిపణి పరిధుల పోలిక

పరీక్షలు

1999 ఏప్రిల్ 11 న అగ్ని-2 ను పరీక్షించారు. పరీక్షకు అనుగుణంగా మార్పులు చేసిన రైలు కోచ్ నుండి ఈ పరీక్ష జరిపారు. 2000 కి.మీ. పరిధిలో పరీక్షించిన అగ్ని-2 పూర్తిగా ఘన ఇంధనంతో పనిచేస్తుంది. 2001 జనవరి 17 నాటి పరీక్ష తరువాత క్షిపణి ఉత్పత్తికి  ఆమోదం ఇచ్చారు. సంవత్సరానికి 12 క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఆ నాటి పరీక్షలో 700 కి.గ్రా. వార్‌హెడ్‌ను 2,100 కి.మీ. దూరానికి మోసుకెళ్ళింది. రైలు మొబైల్ లాంచరునుండి ప్రయోగించినప్పటికీ, అగ్ని-2 కు రోడ్డు మొబైలు లాంచరు నుండి ప్రయోగించే రూపు కూడా ఉంది. అగ్ని-2 ఎల్లప్పుడూ ప్రయోగ సన్నద్ధ స్థితిలో ఉంటుంది. 15 నిముషాల్లో అగ్ని-2 ను ప్రయోగించవచ్చు. అదే అగ్ని-టిడిని సన్నద్ధం చేసేందుకు ఒక పూట పట్టేది. అగ్ని-2 ఉత్పత్తి ప్రారంభించినట్లు 2002 మార్చి 14 న అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ పార్లమెంటులో ప్రకటించాడు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అగ్ని-2 ను ఉత్పత్తి చేస్తోంది. సంవత్సరానికి 18 క్షిపణుల సామర్థ్యంతో, ఒక్కొక్కటి ₹ 35 కోట్ల ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తోంది.

భారత సైన్యం 2009 మే 19 న అగ్ని-2 వాడుకరి పరీక్షలు మొదలు పెట్టింది. మొదటి పరీక్ష విఫలమైంది[8] రెండవ దశ సరిగ్గా పనిచెయ్యలేదు. వెంటనే చేపట్టిన రెండవ పరీక్ష కూడా అలాగే విఫలమైంది.[9] 2010 మే 17 న చేసిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 660 సెకండ్ల ప్రయాణంలో క్షిపణి పూర్తి పరిధిని చేరుకుని, లక్ష్యాన్ని చేరుకుంది.[10]

2011 సెప్టెంబరు 30 న అగ్ని-2 ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. రైలు మొబైలు లాంచరు నుండి ప్రయోగించిన క్షిపణి 2,000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని 10 నిముషాల్లో ఛేదించింది. అన్ని ప్రయోగ లక్ష్యాలనూ సాధించింది[11] 2012 ఆగస్టు 9 న వ్యూహాత్మక బలగాల కమాండ్ మరో విజయవంతమైన పరీక్ష చేసింది. 

2013 ఏప్రిల్ 7 న వ్యూహాత్మక బలగాల కమాండ్ మరోసారి అగ్ని-2 ను విజయవంతంగా పరీక్షించింది.[12]

ప్రొపల్షన్

మొదటి దశ: అగ్ని-2 మొదటి దశలో ఘన ఇంధనాన్ని వాడుతుంది.[13]

రెండవ దశ: రెండవ దశ 4,200 కి.గ్రా. బరువుంటుంది. ఘన ఇంధనం వాడుతుంది.  ఈ దశలో దిశ నియంత్రణకు ఫ్లెక్స్ నాజిళ్ళుంటాయి. 

అగ్ని-RV Mk 2 విశేషాంశాలు

పునఃప్రవేశ వాహనానికి ఉండే రెక్కల వలన కింది అనుకూలతలు కలుగుతాయి;

  • బాలిస్టికేతర పథంలో ప్రయాణం చెయ్యడం వలన దాన్ని అడ్డుకోవడం మరింతగా కష్టమౌతుంది.
  • హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాఅణించేటపుడు ఉష్ణ, భౌతిక వత్తిడులను తగ్గించేలా బాడీని తగు కోణంలో ఉంచుతుంది.
  • పథంలో ఉండే దోషాలను ప్రయాణపు చివరి దశలో కూడా సరిచేయవచ్చు.
  • ఛేదనకు ముందు చేసే విన్యాసం కారణంగా లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఈ విధంగా వర్తుల దోష పరిధి తగ్గుతుంది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు