ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం

(ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, 2019 లో అవశేష ఆంధ్రప్రదేశ్ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం. అంతకుముందు హైదరాబాదు లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పనిచేసేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొని ఉంది.[2] "జ్యుడిషియల్" హైకోర్టు భవనం

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన భవనం
స్థాపితం2019 జనవరి 1[1]
దేశం భారతదేశం
ప్రదేశంఅమరావతి, ఆంధ్రప్రదేశ్
భౌగోళికాంశాలు16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856
సంవిధాన పద్ధతిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నరు సలహా మేరకు రాష్ట్రపతిచే నియామకం. .
అధికారం పొందినదిభారత రాజ్యాంగం
తీర్పులపై ఉత్తరాభియోగంభారత అత్యున్నత న్యాయస్థానం
న్యాయమూర్తుల పదవీ కాలం62 సంవత్సరాల వయసులో తప్పనిసరి పదవీ విరమణ
స్థానాల సంఖ్య37
శాశ్వత: 28 ; అడిషనల్: 9
ఛీఫ్ జస్టిస్
ప్రస్తుతంజస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్

చరిత్ర

1954 సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని స్థాపించారు. 1956 నాటికి ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయాకా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేకించి హైకోర్టు ఏర్పాటుచేసేదాకా, హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పారు. సి. ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ (విభజన తర్వాత) ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2019 జనవరి 1 న నియమించబడ్డాడు.[3] 2019 అక్టోబరు 7 న నేలపాడు లో కొత్తగా నిర్మించిన హైకోర్ట్, న్యాయమూర్తులతో కొలువుదీరిన తరువాత, గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ మహేశ్వరి తో ప్రమాణం చేయించాడు. 2021 జనవరి 6న అరూప్ కుమార్ గోస్వామి మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశాడు.[4]

భౌగోళికం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో అంతర్భాగమైన నేలపాడు వద్ద నెలకొంది.[5] కృష్ణా నదికి 6.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రధాన న్యాయమూర్తులు

హైకోర్టు న్యాయమూర్తులు

మాజీ న్యాయమూర్తులు

మూలాలు

ఇవి కూడా చూడండి.

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు