ఆర్.సి.యం. రాజు

ఆర్.సి.యం. రాజు (ఆర్. చంద్రమోహన్ రాజు) రంగస్థల నటుడు, డబ్బింగ్ కళాకారుడు. 2021లో జరిగిన తెలుగు టీవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో ఆర్.సి.యం. రాజు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ నూతన కార్యవర్గం 2023 వరకు ఉంటుంది.[1]

ఆర్.సి.యం. రాజు
జననంఫిబ్రవరి 29
వనపర్తి, వనపర్తి జిల్లా,తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ప్రసిద్ధిరంగస్థల నటుడు, దర్శకుడు, డబ్బింగ్ కళాకారుడు
తండ్రిఆర్. సుబ్బరాజు (రిటైర్డ్ ఎస్సై)
తల్లిజయమ్మ

జననం

ఫిబ్రవరి 29న సుబ్బరాజు (రిటైర్డ్ ఎస్సై), జయమ్మ దంపతులకు వనపర్తి జిల్లా, వనపర్తి లో జన్మించాడు.



విద్యాభ్యాసం - గురువులు

ఆర్.సి.యం. రాజు డిగ్రీ వరకు వనసర్తిలో చదివాడు. అనంతరం హైదరాబాద్ కి వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో పి.జి. డిప్లొమా... తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో, మిమిక్రీలో పి.జి. డిప్లొమా చేశాడు.

కళారంగంలో ఆర్.సి.యం. రాజుకు తొలి గురువు వనసర్తికి చెందిన జి. పుల్లయ్య. అనంతరం డా. ప్రదీప్ కుమార్, డా. ప్రసాద్, వినోద్ బాల, తల్లావజ్ఝుల సుందరం, మల్లాది గోపాలకృష్ణ వంటి నాకరంగ ప్రముఖుల దగ్గర శిక్షణ పొందాడు. డా. నేరెళ్ళ వేణుమాధవ్ దగ్గర మిమిక్రీలో మెళకువలు నేర్చుకున్నాడు.

వివాహం - పిల్లలు

ఆర్.సి.యం. రాజు కు ఉమారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (తనీష్), ఒక కుమార్తె (శ్రీ తనీష). వీరుకూడా డబ్బింగ్ లు చెబుతున్నారు.

రంగస్థల ప్రస్థానం

చిన్నప్పుడే స్టేజ్ షోలు, కాలేజ్ టైమ్‌లో మిమిక్రీ షోలు చేయడంతోపాటు ఒక ఆర్కెస్ట్రా కూడా నడిపాడు. ఉపన్యాస పోటీలలో మొదటి బహుమతి సాధించేవాడు. స్కూల్ వయసులోనే సినీనటులను అనుకరించేవాడు. ఇతని గాత్రానికి ఎక్కువగా ప్రశంసు వస్తుండేవి. ఆర్.సి.యం. రాజు గురువు జి. పుల్లయ్య, రాజులోని కళాకారుణ్ణి ప్రోత్సహించాడు. వనపర్తిలో 10వ తరగతి చదువుతున్న సమయంలో మణిపురిలోని ఇంఫాల్ లో జరిగిన ఎన్.సి.సి. క్యాంప్ లో దుర్యోధన ఏకపాత్రాభినయాన్ని అభినయించి, ప్రథమ బహుమతి అందుకున్నాడు.

1997లో బెంగళూరులో జరిగిన యూత్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన సారీ గాంధీ నాటికకు దర్శకత్వం వహించి, ఉత్తమ దర్శకుడి అవార్డు పొందాడు. 1998లో కేరళలోని కొట్టాయంలో జరిగిన యూత్ ఫెస్టివల్ లో ఆర్.సి.యం. రాజు దర్శకత్వంలో ప్రదర్శించబడిన కాలుష్యభూతం నాటిక జాతీయస్థాయిలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

డబ్బింగ్ కళాకారుడిగా

ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఆలిండియా రేడియో నుండి ‘యువవాణి’ కార్యక్రమానికి ఆడిషన్స్‌కి వెళ్ళాడు.

టి.వి. సీరియల్స్

1999లో ఋతురాగాలు ధారావాహికలో నగేష్ కర్ర పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో డబ్బింగ్ కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించి, దాదాపు 200 సీరియల్స్ లో 10000 పైగా ఎపిసోడ్స్ కి డబ్బింగ్ చెప్పాడు.[2]

సినిమాలు

ఆటోడ్రైవర్ సినిమా డబ్బింగ్ శాఖలో పనిచేసి, ఆనందం సినిమాలోని వెంకట్ పాత్రకు తొలిసారిగా డబ్బింగ్ చెప్పాడు. దాదాపుగా 800 సినిమాల్లో హీరోలు, విలన్లకు డబ్బింగ్ చెప్పాడు.[3]

నటుడిగా

2021: ఆడవాళ్ళు మీకు జోహార్లు

2021: రెడ్

అవార్డులు

నంది అవార్డులు

సీరియల్స్

  1. మొదటి టి.వి. నంది అవార్డు - (2008) పురాణగాధలు (రచన. నాగబాల సురేష్ కుమార్)
  2. రెండవ టి.వి. నంది అవార్డు - (2010) మొగలిరేకులు (దర్శకత్వం. మంజులా నాయుడు)

సినిమాలు

  1. నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు గా మెదటి నంది అవార్డు - (2010) డార్లింగ్ సినిమాలో ముఖేష్ రిషి పాత్రకు[4]
  2. నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడుగా రెండవ నంది అవార్డు - (2011) పోరు తెలంగాణ సినిమాలో మహ్మద్ జమా పాత్రకు
  3. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: డబ్బింగు కళాకారుడు (మిణుగురులు)[5][6][7][8]

ఇతర అవార్డులు

  • సినీగోయర్స్ అవార్డు - 2004, 2005
  • అరుణోదయ ఆర్ట్ క్రియేషన్ అవార్డు - 2004, 2005
  • ఉగాది పురస్కారం - 2006 (వంశీ ఇంటర్నేషనల్)
  • కోహినూర్ అవార్డు - 2014[9]

పదవులు

  1. 2004-2006: ప్రధాన కార్యదర్శి, ఎ.పి. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్
  2. అధ్యక్షులు (డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్)

బిరుదులు

  1. స్వరసామ్రాట్ (భారత్ కల్చరల్ అకాడమీ)[10]

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు