ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్

భారతదేశంలో రాజకీయ పార్టీ

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సర్వ భారతీయ సంయుక్త గణతంత్రిక మోర్చా) అనేది అస్సాంలోని క్రియాశీలంగా ఉన్న రాజకీయ పార్టీ.[4] అస్సాం శాసనసభలో బిజెపి, కాంగ్రెస్ తర్వాత ఇది 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ.

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
నాయకుడుబద్రుద్దీన్ అజ్మల్
స్థాపన తేదీ2 అక్టోబరు 2005 (18 సంవత్సరాల క్రితం) (2005-10-02)
ప్రధాన కార్యాలయంనెం.3 ఫ్రెండ్స్ పాత్, హతిగావ్, గౌహతి-781038
రాజకీయ విధానంసామాజిక న్యాయం[1]
మైనారిటీ హక్కులు[2]
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ[3]
కూటమియుపిఎ (2019–2021)
లోక్‌సభలో సీట్లు
1 / 543
రాజ్యసభలో సీట్లు
0 / 245
శాసనసభలో స్థానాలు
15 / 126
Election symbol

పార్టీని 2005, అక్టోబరు 3 న మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించాడు, ఆ సమయంలో దాని పేరు అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉండేది. 2009, ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో ప్రెస్ మీట్‌లో దాని ప్రస్తుత పేరుతో జాతీయ పార్టీగా పునఃప్రారంభించబడింది, మళ్లీ బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. పార్టీ ప్రధాన కార్యాలయం గౌహతిలో ఉంది.[5][6]

అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కీలకమైన ప్రతిపక్ష పార్టీ. ఇది దిగువ అస్సాం, బరాక్ వ్యాలీ నుండి మిలియన్ల కొద్దీ మియా బెంగాలీ ముస్లింల వాయిస్. 2011 శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 18 గెలుచుకుంది;[7] 2016లో, 126 సీట్లలో 13 గెలుచుకుంది. 2021లో, అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బిపిఎఫ్, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన సంఖ్యను పెంచుకుంది. 2021 అస్సాం శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 16 గెలుచుకుంది.[8] అయితే, దాని కూటమి మహాజోత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీని పొందలేకపోయింది.

ఎన్నికల చరిత్ర

సంవత్సరంఎన్నికలగెలిచిన సీట్లుసీట్ల మార్పుఓటు%ఓటు మార్పు%
200612వ అసెంబ్లీ (అస్సాం)
10 / 126
 – -
200915వ లోక్‌సభ
1 / 14
 – 16.3%
201113వ అసెంబ్లీ (అస్సాం)
18 / 126
813%
201416వ లోక్‌సభ
3 / 14
214.8% 2.5%
201614వ అసెంబ్లీ (అస్సాం)
13 / 126
513%
201917వ లోక్‌సభ
1 / 14
27.8% 7%
202115వ అసెంబ్లీ (అస్సాం)
16 / 126
39.3% 4.3%

ఇవికూడా చూడండి

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు