ఆల్ సెయింట్స్ చర్చి, హైదరాబాదు

ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడిన ఈ చర్చీ, దక్షిణ భారతదేశంలోని చర్చీలలో ప్రత్యేకమైనది.

ఆల్ సెయింట్స్ చర్చి
Provinceసికింద్రాబాదు
ప్రదేశం
ప్రదేశంతిరుమలగిరి, సికింద్రాబాదు , తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళిక అంశాలు17°23′35″N 78°28′23″E / 17.393°N 78.473°E / 17.393; 78.473

చరిత్ర

సికింద్రాబాదులోని బ్రిటీష్ కంటోన్మెంటుకు సేవలు అందించడంకోసం 1860లో ఆల్ సెయింట్స్ చర్చి నిర్మించబడింది. ఇది మొట్టమొదటి శాశ్వత నిర్మాణంగా చెప్పవచ్చు.[2][3][4]

నిర్మాణం

ఆల్ సెయింట్స్ చర్చి గోతిక్ శైలీలో నిర్మించబడింది. దూరం నుండి చూసినా కూడా ఆకర్షణీయంగా కనిపించేలా ఉన్న ఈ చర్చి తిరుమలగిరి ప్రాంతంలో నిర్మించబడిన తొలి క్రైస్తవ ప్రార్థనా మందిరం. చర్చిలో ఉన్న అద్దాలపై రంగులతో క్రీస్తు చిత్రాలు చిత్రించబడ్డాయి.

రాయల్ ఆర్టిలరీ యొక్క లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ డాసన్ జ్ఞాపకార్థంగా అంకితంచేసిన 1884నాటి గాజు కిటికి ఉంది. సికిందరాబాదులో నివసించిన అనేకమంది బ్రిటీష్ అధికారులను సంబంధించిన పదహారు స్మారక చిహ్నాలు చర్చి యొక్క గోడలపై ఏర్పాటుచేయబడ్డాయి. ఇది ఇంటాక్ హెరిటేజ్ అవార్డును అందుకుంది.

రాణి సందర్శన

1983లో రాణి ఎలిజబెత్ II చర్చిని సందర్శనకు వచ్చింది.[5][6][7] అదేసమయంలో సమీపంలోవున్న బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చిని కూడా సందర్శించి, బిషప్ విక్టర్ ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి 36వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది.[8]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ