ఉన్ని కృష్ణన్

ఉన్ని కృష్ణన్ (జననం: 1966 జూలై 9) ప్రముఖ శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలెకి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.

పి. ఉన్ని కృష్ణన్
ఉన్ని కృష్ణన్
జననంపి. ఉన్ని కృష్ణన్
(1966-07-09) 1966 జూలై 9 (వయసు 57)

పాలక్కాడ్, కేరళ, భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఉన్ని కృష్ణన్
వృత్తినేపధ్య గాయకుడు
శాస్త్రీయ సంగీత గాయకుడు
, సంగీత పోటీల న్యాయ నిర్ణేత
వెబ్‌సైటు
http://www.unnikrishnan.com/

జీవిత విశేషాలు

ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని పాలక్కాడ్లో జన్మించాడు.[1]వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత కె. ఎన్. కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో చెన్నైలోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. మద్రాసు విశ్యవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.

ఉన్నికృష్ణన్ భార్య ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి ప్రియ. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వీరి కుమార్తె ఉత్తర కూడా గాయనిగా రాణిస్తోంది. ఆమె పాడిన నేపథ్య గీతానికి జాతీయ పురస్కారం అందుకుంది.[2]

జనాదరణ పొందిన పాటలు

తెలుగు

బయటి లింకులు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు