ఎయిర్ అరేబియా

ఎయిర్ అరేబియా (అరబిక్: العربية للطيران) అనేది ఒక చవక ధరల ఎయిర్ లైన్ సంస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, షార్జా లోని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో షార్జా ఫ్రైట్ సెంటర్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ విమాన సంస్థ మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా, భారత ఉపఖండం, మధ్య అసియా, ఐరోపా ఖండాల్లోని 22 దేశాలకు చెందిన 51 గమ్య స్థానాల నుంచి విమానాలు నడిపిస్తోంది. అంతేకాదు షార్జా నుంచి 9 దేశాల్లోని 28 గమ్య స్థానాలకు కూడా విమానాలు నడిపిస్తోంది.

టౌలౌస్-బ్లాగ్నాక్ విమానాశ్రయం సమీపించే ఎయిర్ అరేబియా ఎయిర్బస్ A320-200 (2012)
ఎయిర్ అరేబియా ఎయిర్బస్ A320-200 (2012)

దీని ప్రధాన కేంద్రం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం. షార్జా కేంద్రంగా నడుస్తున్న ఇతర చవక ధరల విమానాలన్నింటికంటే ఎయిర్ అరేబియా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. అలెగ్జాండ్రియా, కాసాబ్లాంకా నగరాలపై కూడా ఎయిర్ అరేబియా ప్రత్యేక దృష్టి సారించింది..[1] అరబ్ ఎయిర్ క్యారియర్ ఆర్గనైజేషన్ ఎయిర్ అరేబియా సభ్యత్వం కలిగి ఉంది.

చరిత్ర

ఎయిర్ అరేబియా 2003, ఫిబ్రవరి 3న స్థాపించబడింది. తొలి సారిగా చవక రేట్ల విమానాలను ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టాలన్నలక్ష్యంతో అప్పటి షార్జా పాలకుడిగా, సుప్రిం కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ గా పనిచేస్తున్న డా. సుల్తాన్ బిన్ మహ్మద్ అల్-ఖస్మీ ఎయిర్ అరేబియాకు అనుమతినిచ్చారు. ఈ విమాన సంస్థ తన కార్యకలాపాలను 2003 అక్టోబరు 28న ప్రారంభించింది. తొలి విమానం షార్జా లోని యు.ఎ.ఇ. నుంచి బహెరైన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. తన వ్యాపారాన్ని ప్రారంభించిన తొలి ఎడాదిలోనే ఈ సంస్థ లాభాలు ఆర్జించింది.

కార్పోరేట్ వ్యవహరాలు

ప్రధాన కార్యాలయం

ఎయిర్ అరేబియా ప్రధాన కేంద్రం షార్జా విమానాశ్రయం ఫ్రైట్ కేంద్రంలో ఉంది.[2] మధ్య దుబాయ్ నుంచి ఈ విమానాశ్రయం కేవలం 15 కిలోమీటర్ల (9.3మైళ్లు) దూరంలో ఉంటుంది.

సంయుక్త భాగస్వామ్యం

ఎయిర్ అరేబియా ఈజిప్ట్, జోర్డాన్, మొరాకో దేశాల్లోని మూడు అంతర్జాతీయ స్థావరాల నుంచి సంయుక్త భాగస్వామ్యంలో విమానాలు నడిపిస్తోంది. ఈజిప్ట్ లో ఎయిర్ అరేబియా ఈజిప్ట్.[3]

పేరుతో జోర్డాన్ లో ఎయిర్ అరేబియా జోర్డాన్ పేరుతో, మొరాకోలో ఎయిర్ అరేబియా మొరాకో పేరుతో విమానాలు నడిపిస్తున్నారు. ఎయిర్ అరేబియా జోర్డాన్ విమానాలు.. అమాన్, జోర్డాన్ కేంద్రాల నుంచి విమానాలు నడిపిస్తుండగా, మొరాకోలోని అతి పెద్ద నగరమైన కాసాబ్లాంకా నుంచి ఎయిర్ అరేబియా మొరాకో విమాన సంస్థ యూరోపియన్ దేశాలకు విమానాలు నడిపిస్తోంది. మొరాకోలో 2009 మే 6 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించి సేవలను ఐరోపా, ఆసియా దేశాలకు విస్తరించింది. జోర్డాన్ లోని క్వీన్ అలియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐరోపా, మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా దేశాలకు విమానాలను నడపాలని కూడా ఈ సంస్థ ప్రతిపాదించింది.[4] అయితే ఈ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరిగిన ఇంధన ధరల కారణంగా ఈ నిర్ణయం మరింత ఆలశ్యమవుతుందని 2011 జూన్ 14 లో ప్రకటించారు.[5]

నేపాల్

నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు కేంద్రంగా ఎయిర్ అరేబియా తన విమాన సేవలను 2007లో ఫ్లై యెటి (2007–2008) పేరుతో ప్రారంభించింది. – 2007 లో ప్రారంభించింది. ఇక్కడి నుంచి ఆసియా, మధ్య తూర్పు దేశాలకు యెటీ ఎయిర్ లైన్ సంయుక్త భాగస్వామ్యంతో చవక రేట్ల విమానాలను నడిపించేది. ఫ్లై యెటీ పేరుతో అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలు నడుస్తుండేవి. అయితే నేపాల్ లోని రాజకీయ అనిశ్చితి, ఆర్థిక పరిస్థితులు, స్థానిక ప్రభుత్వాల సహకారం లేకపోవడం వంటి కారణాల వల్ల ఫ్లై యెటీ కార్యకలాపాలను 2008 నుంచి రద్దు చేయబడ్డాయి.

గమ్యాలు

ఫిబ్రవరి, 2014 నాటికి ఎయిర్ అరేబియా మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా, ఆసియా, ఐరోపాతో పాటు తాజాగా కైరో, ఈజిప్ట్ సహా 90 విమానాశ్రాయలకు సేవలందిస్తోంది.[6]

విమానాలు

మార్చి 2015 నాటికి ఎయిర్ అరేబియా ఈ క్రింది విమానాలను కలిగి ఉంది. 162/168 ఎకానమి తరగతి సీటింగ్ సామర్ధ్యం కలిగిన ఈ విమానాల సగటు వయస్సు కేవలం 3.1 సంవత్సరాలు మాత్రమే.[7][8]

ఎయిర్ అరేబియా
విమానంసేవలోఆర్డర్లుప్రయాణికులు
ఎయిర్ బస్ A320-2003812162/168

బయటి లింకులు

  • షార్జా పోర్టల్
  • కంపెనీల పోర్టల్
  • విమానాయాన పోర్టల్
  • అధికారిక వెబ్ సైట్

విభాగాలు

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 2003లో ప్రారంభించిన ఎయిర్ లైన్ సంస్థలు
  • ఎమిరెటీ బ్రాండ్స్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానాయాన సంస్థలు
  • 2003లో స్థాపించిన ఎయిర్ లైన్ సంస్థలు
  • అరబ్ ఎయిర్ క్యారియర్ ఆర్గనైజేషన్ సభ్యులు
  • చవక ధరల ఎయిర్ లైన్స్
  • షార్జా (ఎమిరేట్)
  • దుబాయి ఆర్థిక మార్కెట్ లో కంపెనీల జాబితా

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు