కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం.

కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఢిల్లీ, ముంబై తరువాత భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మూడవ మెట్రోపాలిటన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 37 పురపాలక సంఘాలు, 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి.[2][3] ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికల కొరకు కోల్‌కాతా మహానగర అభివృద్ధి సంస్థ (కెఎండిఎ)కు పూర్తి అధికారం ఉంటుంది.

కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం (కెఎంఏ)
పట్టణ ప్రాంతం
పై నుండి సవ్య దిశలో: విక్టోరియా మెమోరియల్, సెయింట్ పాల్స్ కాథెడ్రల్, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, రవీంద్రసేతు, సిటీ ట్రామ్‌లైన్, విద్యాసాగర్ సేతు
పై నుండి సవ్య దిశలో: విక్టోరియా మెమోరియల్, సెయింట్ పాల్స్ కాథెడ్రల్, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, రవీంద్రసేతు, సిటీ ట్రామ్‌లైన్, విద్యాసాగర్ సేతు
Location of కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం (కెఎంఏ)
దేశంభారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
కోర్ సిటీకోల్‌కతా
జిల్లాలుకోల్‌కాతా జిల్లా
ఉత్తర 24 పరగణాలు
దక్షిణ 24 పరగణాలు
నదియా జిల్లా
హౌరా జిల్లా
హుగ్లీ జిల్లా
Area
 • Metro
1,886.67 km2 (728.45 sq mi)
Population
 (2011 జనగణన)[1]
 • Metro
1,41,12,536
 • Metro density7,480/km2 (19,400/sq mi)
Time zoneUTC+5.30 (IST)

చరిత్ర

కోల్‌కాతా అనే పేరు కొలికత (తెలుగులో కాళిక) అనే బెంగాలి పదం నుండి వచ్చింది. ఈ నగరం కోల్‌కాతా, కలికత అని పిలువబడుతూ వచ్చింది. ఈ పేరును ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో నగరం పేరును అధికారికంగా కోల్‌కాతాగా మార్చారు.

కోల్‌కాతా చారిత్రకాధారాలు 1690 నుండి లభ్య మౌతున్నాయి. కాలికత, సూతనుతి, గోవిందపూరు అనే మూడు గ్రామాల చుట్టూ క్రమంగా నగరం విస్తరించిందని భావిస్తున్నారు. కాలికత జాలరి పల్లెగా ఉండేది, సూతనుతి నదీతీర సాలెవారి పల్లె. 1712 లో బ్రిటిష్ ప్రభుత్వం హుగ్లీ నది తూర్పుతీరంలో ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత కోల్‌కాతా ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించబడింది. 1772లో ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిగా చేసారు. 18వ శతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపెనీ ఓపీయం వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.

1850 నాటికి కోల్‌కాతాలో ప్రధానంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఒకటి వైట్ టౌన్ (శ్వేతనగరం) రెండవది బ్లాక్ టౌన్ (నల్లవారి నగరం). చౌరింఘీని కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ ప్రజలు నివాసాలు అభివృద్ధి చేసుకున్నారు. ఉత్తర కోల్‌కాతాలో భారతీయులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషను నిర్మాణం కొనసాగింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి, స్వదేశీ ఉద్యమం రూపుదిద్దుకుని, బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి మార్చుకుంది.

ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరికొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పు పాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు. 1971లో బంగ్లాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కోల్‌కాతా నగరం నిండిపోయింది. 1990 తరువాత నగరం ఆర్థికంగా కోలుకోసాగింది. 2000లో దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం బాగా అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలపడడం మొదలైంది.

అధికార పరిధి

అధికార పరిధి
విభాగాలుపేరుమొత్తం
నగరపాలక సంస్థలుకోల్‌కాతా, బిధన్నగర్,[4][5] హౌరా,[6] చదన్నగర్4
పురపాలక సంఘాలు
1. ఉత్తర 24 పరగణాల జిల్లా
బారానగర్, బరాసత్, బర్రక్పూర్, భత్పారా, దమ్ దమ్, గరూలియా, హలీసహర్, కమర్హతి, కాంచ్రాపారా, ఖర్ధా, మధ్యాంగ్రామ్, నైహతి, న్యూ బర్రక్పూర్, ఉత్తర బర్రక్పూర్, ఉత్తర డండం, పనిహతి, దక్షిణ డండం, టిటాగర్
2. దక్షిణ 24 పరగణాల జిల్లా
బరుయిపూర్, బడ్జ్ బడ్జ్, జయానగర్ మజిల్ పూర్, మహేశ్తల, పూజలి, రాజ్పూర్ సోనార్పూర్
3. హౌరా జిల్లా
ఉలుబేరియా
4. నాదియా జిల్లా
గాయెస్పూర్, కళ్యాణి
5. హుగ్లీ జిల్లా
బైద్యాబతి, భద్రేశ్వర్, బన్స్ బేరియా, చంప్ దని, డంకుని, హుగ్లీ-చిన్ సురా, కొన్నగర్, రిశ్రా, సెరంపోర్, ఉత్తర్పర కోట్రుంగ్
37

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో మొత్తం జనాభా 14,112,536 ఉన్నారు. మొత్తం వైశాల్యం 1,886.67 కి.మీ.² కాగా, కి.మీ.కి జనాభా సాంద్రత 7,480.[7]

ఇవికూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు