ఖడ్గం (సినిమా)

ఖడ్గం 2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన దేశభక్తి ప్రధాన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించాడు. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ రచన చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఖడ్గం
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ, సత్యానంద్, ఉత్తేజ్ (మాటలు)
నిర్మాతసుంకర మధుమురళి
తారాగణంమేకా శ్రీకాంత్
రవితేజ
ప్రకాశ్ రాజ్
ఛాయాగ్రహణంభూపతి
సంగీతందేవిశ్రీ ప్రసాద్
విడుదల తేదీ
29 నవంబరు 2002 (2002-11-29)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నవంబరు 29, 2002 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఐదు నంది పురస్కారాలను అందుకుంది.

కథ

కోటి సినిమా నటుడు కావాలని హైదరాబాదులో అడుగు పెడతాడు. అంజాద్ దైవభక్తి కలిగిన డ్రైవరు. మంచి దేశభక్తి కలవాడు. అతని తమ్ముడు అజర్ ఒక సంవత్సరం పాటు కనిపించకుండాపోయి ఉంటాడు. హైదరాబాదు పోలీసులు మసూద్ అనే తీవ్రవాదిని నిర్బంధిస్తారు. అతన్ని విడిపించడానికి పాకిస్థాన్ తీవ్రవాదులు అజహర్ కు శిక్షణ ఇచ్చి హైదరాబాదులో మతకలహాలు రేపడానికి పథకం వేస్తారు. అజర్ శిక్షణ తర్వాత ఏమీ ఎరగనట్లు వచ్చి తన అన్న అంజాద్ తో కలిసి నివాసం ఉంటూ జైలులో ఉన్న మసూద్ ని ఎలా విడుదల చేయాలో పథకాలు వేస్తుంటాడు.

రాధాకృష్ణ ఒక నిజాయితీ గల పోలీసు అధికారి. అతనికి పాకిస్థాన్ అంటే ద్వేషం. అందుకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. గతంలో అతని ప్రేయసి స్వాతిని ఐఎసై తీవ్రవాదులు చంపేసి ఉంటారు. కోటి, రాధాకృష్ణ, అంజాద్ లు కలిసి మసూద్ ని విడుదల చేసే పథకాన్ని ఎలా అడ్డుకున్నారన్నది మిగతా చిత్ర కథ.

తారాగణం

  • కోటిగా రవితేజ
  • రాధాకృష్ణగా శ్రీకాంత్
  • అంజాద్ గా ప్రకాష్ రాజ్
  • స్వాతిగా సోనాలి బెంద్రే
  • సంగీత
  • కిం శర్మ
  • షఫీ
  • పావలా శ్యామల
  • ఉత్తేజ్
  • పృథ్వీరాజ్
  • బ్రహ్మాజీ
  • సుబ్బరాజు
  • రఘుబాబు
  • ఎం. ఎస్. నారాయణ

పాటల జాబితా

ఈచిత్రం లోని పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి,, సుద్దాల అశోక్ తేజ, శక్తి.

మేమే ఇండియన్స్, గానం. హానీ

నువ్వు నువ్వు , గానం.సుమంగళి

ఆహా అల్లరి , గానం.కె ఎస్ చిత్ర , రాక్వైబ్

ఖడ్గం , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

గోవిందా గోవింద, గానం.దేవీశ్రీ ప్రసాద్

ముసుగు వేయ్యోద్దు , గానం.కల్పన .

బహుమతులు

సంవత్సరంప్రతిపాదించిన విభాగంపురస్కారంఫలితం
2002సుంకర మధు మురళి [1]సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలుగెలుపు
కృష్ణవంశీనంది ఉత్తమ దర్శకులుగెలుపు
ప్రకాష్ రాజ్నంది ఉత్తమ సహాయనటులుగెలుపు
పి రంగా రావునంది ఉత్తమ కళా దర్శకులుగెలుపు
కిషోర్నంది ఉత్తమ మేకప్ కళాకారులుగెలుపు
రవి తేజనంది విశేష పురస్కారంగెలుపు
కృష్ణవంశీఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు దర్శకులుగెలుపు
సంగీతఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు సహాయ నటిగెలుపు
షఫీఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు విలన్గెలుపు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ