రవితేజ

నటుడు
(రవితేజ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

రవితేజ (జననం 1968 జనవరి 26) తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

రవితేజ
2017 లో రవితేజ
జననం
భూపతిరాజు రవిశంకర్ రాజు [1]

(1968-01-26) 1968 జనవరి 26 (వయసు 56)[2]
జగ్గంపేట, ఆంధ్రప్రదేశ్, భారతదేశం [2]
విద్యాసంస్థసిద్ధార్థ డిగ్రీ కాలేజీ, విజయవాడ
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కళ్యాణి
(m. 2000)
పిల్లలు2

వ్యక్తిగత సమాచారం

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్ లు కూడా నటులే. రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. తరువాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్ళారు. అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బి.ఎ కోర్సులో చేరాడు. రవితేజ నాయనమ్మ, తాతగారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం.

ప్రస్థానం

మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు, దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడు.1997 లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేసాడు. కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. తరువాత అనేక సినిమాల్లో గుర్తింపు వున్న వేషాలు వేసాడు కానీ బ్రేక్ రాలేదు.1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేసాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో హీరోగా చేయగా సూపర్ హిట్ అయి హీరోగా గుర్తింపు వచ్చి ఇడియట్ తో సెటిల్ అయ్యాడు. తరువాత ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వీడే, దొంగోడు, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో లాంటి పెద్ద పెద్ద విజయాలతో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.2017 లో రాజా ధి గ్రేట్ తో మరొక విజయాన్ని అందుకున్నారు.

చిత్రాలు

సంవత్సరంచిత్రంపాత్రఇతర విశేషాలు
1991కర్తవ్యం
చైతన్య
1992ఆజ్ కా గూండా రాజ్గ్యాంగ్ లీడర్ చిత్రం యొక్క హిందీ పునఃనిర్మాణం
1993అల్లరి ప్రియుడు
1994క్రిమినల్
1996నిన్నే పెళ్ళాడుతాఅతిథి పాత్ర
1998సింధూరంచంటి
పాడుతా తీయగా
1999మనసిచ్చి చూడు
ప్రేమకు వేళాయెరారవి
నీ కోసంరవివిజేత,నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
సముద్రంచేపల నాని
ఓ పనై పోతుంది బాబు
ప్రేమించేమనసు
2000క్షేమంగా వెళ్ళి లాభంగా రండిఅతిథి పాత్ర
తిరుమల తిరుపతి వెంకటేశతిరుపతి
సకుటుంబ సపరివార సమేతంఅతిథి పాత్ర
అన్నయ్యరవి
2001చిరంజీవులుచందు
అమ్మాయి కోసంరవి
బడ్జెట్ పద్మనాభంరవి
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంసుబ్రహ్మణ్యం
2002వందేమాతరంరవి
అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారుఅనీల్
ఇడియట్చంటి
అన్వేషణ''అవినాష్
ఖడ్గంకోటివిజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2003ఈ అబ్బాయి చాలా మంచోడువివేకానంద
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిచందు
ఒక రాజు ఒక రాణిరవి
దొంగోడుమాధవ
వీడేఏడుకొండలు
2004వెంకీవెంకీ
నా ఆటోగ్రాఫ్శీను
చంటిచంటి
2005భద్రభద్ర
భగీరథచందు
2006షాక్శేఖర్
విక్రమార్కుడుఅత్తిలి సత్తిబాబు,
విక్రమ్ సింగ్ రాథోడ్ IPS
ద్విపాత్రాభినయం
ఖతర్నాక్దాసు
2007దుబాయ్ శీనుశీను
శంకర్‌దాదా జిందాబాద్అతిథి పాత్ర
2008కృష్ణకృష్ణపేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
బలాదూర్శీను
నేనింతేరవివిజేత, నంది ఉత్తమ నటుడు పురస్కారం
2009కిక్కళ్యాణ్పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు
ఆంజనేయులుఆంజనేయులు
2010శంభో శివ శంభోకర్ణ
మర్యాద రామన్నవ్యాఖ్యాత
డాన్ శీనుడాన్ శీను
2011మిరపకాయ్రిషీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజుఅతిథి పాత్ర
దొంగల ముఠాసుధీర్
వీరవీర
2012నిప్పుసూర్య
దరువుబుల్లెట్ రాజా,
రవీంద్ర
ద్విపాత్రాభినయం
దేవుడు చేసిన మనుషులురవితేజ
సారొచ్చారుకార్తీక్ నారాయణ
2013బలుపుశంకర్
దూసుకెళ్తావాయిస్
2014పవర్ద్విపాత్రాభినయం
రోమియో (2014)[3][4]అతిథి పాత్ర
2015కిక్ 2కిక్ సినిమా యొక్క తరువాయి భాగం
బెంగాల్ టైగర్ఆకాష్ నారాయణ్
2017రాజా ది గ్రేట్రాజా
2018టచ్ చేసి చూడుకార్తికేయ
నేల టిక్కెట్టు
అమర్ అక్బర్ ఆంటోని
2020డిస్కో రాజా[5][6]డిస్కో రాజా
2021క్రాక్[7]వీర శంకర్
2021ఖిలాడిమోహన్ గాంధీ[8]
2022రామారావు ఆన్ డ్యూటీరామారావు[9]
2022రావణాసుర
2022టైగర్ నాగేశ్వరరావు
2022ధమకా
2023వాల్తేరు వీరయ్యఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్[10]
2024ఈగల్నిర్మాణంలో ఉంది.[11]

నిర్మాత

సంవత్సరంసినిమా పేరుగమనికలుమూలాలు
2022మట్టి కుస్తీతమిళ సినిమా[12]
2023రావణాసురుడు[13]
ఛాంగురే బంగారు రాజా[14][15]
సుందరం మాస్టర్[16][17]

సోదరుడు భరత్

రవితేజ తమ్ముడు భరత్ పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్, జంప్ జిలాని (2014)[18] లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. భరత్ (52) 2017, జూలై 24 రాత్రి హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ దగ్గర త‌న కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న భరత్ ఆగివున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో భరత్ అక్కడిక్కడే మృతిచెందాడు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు