చెన్నమనేని రాజేశ్వరరావు

చెన్నమనేని రాజేశ్వరరావు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, సిరిసిల్ల మాజీ శాసనసభ్యుడు. రాజేశ్వరరావు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిశారు.[1] 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్‌పల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు రాజకీయ జీవితం సీపీఐ పార్టీతో ప్రారంభమైంది.

చెన్నమనేని రాజేశ్వరరావు
చెన్నమనేని రాజేశ్వరరావు

చెన్నమనేని రాజేశ్వరరావు


మాజీ శాసనసభ్యుడు
నియోజకవర్గంసిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం(1923-08-31)1923 ఆగస్టు 31
మారుపాక , కరీంనగర్ జిల్లా
మరణంమే 9 2016
హైదరాబాదు
రాజకీయ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలుకమ్యూనిస్టు పార్టి
తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిలలితాదేవి
సంతానంముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు
మతంహిందూ

జీవిత విశేషాలు

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు 1923 ఆగస్టు 31న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్.ఎల్.బి.పట్టా పొందారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15, న హైదరాబాదులో జాతీయజెండాను ఎగురవేశారు. హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం కమ్యూనిస్టు పార్టిలో చేరి కమ్యూనిస్టు, పీడీఎఫ్ తరఫున 5 సార్లు శాసనసభకు ఎన్నికైనాడు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించాడు. 1999లో టీడీపీలో చేరారు.తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో శాసనసభ్యులుగా గెలుపొందాడు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగి, అతని కుమారుడు చెన్నమనేని రమేష్‌ బాబుకు టికెట్ ఇప్పించి గెలిపించాడు.

వ్యక్తిగత జీవితం

ఇతని సోదరుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టికి చెందిన ప్రముఖుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా యున్నారు. మరో సోదరుడు చెన్నమనేని హన్మంతరావు జాతీయస్థాయిలో పేరుపొందిన ఆర్థికవేత్త. రాజేశ్వరరావు కుమారుడు చెన్నమెనేని రమేష్ బాబు ప్ వేములవాడ నియోజకవర్గం శాసనభ్యులుగా పనిచేసాడు.[2] రాజేశ్వరరావు చిన్న కుమారుడు చెన్నమనేని వికాస్ వైద్యరంగంలో రేడియాలజిస్ట్‌గా పేరుపొందాడు.

రాజకీయ జీవితం

చెన్నమనేని రాజేశ్వర్‌రావు పదమూడేండ్ల ప్రాయంలోనే సిరిసిల్లలో జరిగిన నాలుగో ఆంధ్రమహాసభలకు స్వచ్ఛంద సేవకులుగా హాజరయ్యాడు. ఆయన స్కాలర్స్‌ డిబేటింగ్‌ సొసైటీ పేరుతో స్థాపించిన సంఘానికి కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించాడు. రాజేశ్వర్‌రావు క్విట్‌ ఇండియా ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులను సమీకరించాడు. ఆయన 1947 నాటికి అఖిల భారత విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగి 1951లో కమ్యూనిస్టు ఉద్యమం సాగుతున్న సమయంలో రావినారాయణరెడ్డితో పాటుగా రాజేశ్వర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1952లో ఆయన జైల్లో ఉన్న సమయంలో పేరోల్‌పై మెట్‌పల్లి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసేందుకురాగా రెండు నిమిషాల సమయం ఎక్కువవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. 1957లో చొప్పదండి నుంచి పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం నుండి 1967, 1978, 1985, 1994, 2004ల్లో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రాజేశ్వర్‌రావు మూడు పర్యాయాలు శాసనసభలో 1967, 1978, 1985ల్లో సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌గా, సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశాడు.

మరణం

అనారోగ్యంతో అతను సోమవారం 2016 మే 9 తెల్లవారు జామున 3 గంటలకు సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]

గుర్తింపు

రాజేశ్వర్‌రావు శత జయంతి సందర్భంగా ఆగస్టు 31 ఆయన చేసిన సామాజిక సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 9 పనులకు (మల్కపేట రిజర్వాయర్‌తో పాటు దాని పరిధిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా) చెన్నమనేని రాజేశ్వర్‌రావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించాడు.[4][5]

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు