ఛాతి ఎత్తు వద్ద వ్యాసం

ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. DBH అత్యంత సాధారణ డెండ్రోమెట్రిక్ కొలతలలో ఒకటి. నిటారుగా ఉన్న చెట్టు యొక్క మాను లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఈ ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది. ఎలక్ట్రానిక్ కాలిపర్ ఛాతి ఎత్తు (డిబిహెచ్) వద్ద వ్యాసాన్ని కొలవగలదు, కొలిచిన డేటాను బ్లూటూత్ ద్వారా ఫీల్డ్ కంప్యూటర్‌కు పంపగలదు. చాలా దేశాలలో, DBH భూమికి 1.3 మీటర్ల (4.3 అడుగుల) ఎత్తులో కొలుస్తారు.[1][2] యునైటెడ్ స్టేట్స్లో, DBH సాధారణంగా భూమికి 4.5 అడుగుల (1.37 మీటర్ల) ఎత్తులో కొలుస్తారు.[3][4] ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బర్మా, ఇండియా, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి కొన్ని దేశాలలో, ఛాతి ఎత్తు వద్ద వ్యాసమును చారిత్రాత్మకంగా 1.4 మీటర్ల (4 అడుగుల 7 అంగుళాలు) ఎత్తులో కొలుస్తారు. అలంకార చెట్లను సాధారణంగా భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో కొలుస్తారు.

వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.

కాండం వ్యాసం, చెట్ల ఎత్తు, కలప పరిమాణం మధ్య అలోమెట్రిక్ సహసంబంధాన్ని ఉపయోగించి ఒకే చెట్టులో లేదా వరుస చెట్లలో కలప పరిమాణం మొత్తాన్ని అంచనా వేయడానికి DBH ఉపయోగించబడుతుంది.[5]

ఛాతి ఎత్తు వద్ద

ఒక మనిషి చక్కగా నిలబడి అతని ఛాతి ఎత్తు వద్ద, చెట్టు యొక్క చుట్టుకొలత లేక అడ్డుకొలతను కొలుస్తాడు. ఈ విధంగా చెట్టును కొలవడాన్ని ఛాతి ఎత్తు వద్ద అంటారు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ