టి.కె.దొరైస్వామి

టి. కె. దొరైస్వామి (1921 ఆగష్టు 21 - 2007 మే 17), ఒక భారతీయ కవి, ఆంగ్లంలో ప్రొఫెసర్, నవలా రచయిత, అనువాదకుడు. అతని కలం పేరు నకులన్. ఆయన తమిళం, ఆంగ్లం రెండింటిలోనూ వ్రాసాడు. నాలుగు దశాబ్దాల పాటు తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసాడు.[2]

టి. కె. దొరైస్వామి
(నకులన్)
జననం(1921-08-21)1921 ఆగస్టు 21
మరణం2007 మే 17(2007-05-17) (వయసు 85)[1]
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లునకులన్ (కలం పేరు)
విద్యాసంస్థఅన్నామలై విశ్వవిద్యాలయం
కేరళ విశ్వవిద్యాలయం
వృత్తికవి, నవలా రచయిత, అనువాదకుడు, విద్యావేత్త
గుర్తించదగిన సేవలు
నినైవుప్ పాటై నీలకల్ (1972)
వర్డ్స్ ఆఫ్ ది విండ్ (1973)

ఆయన సి. ఎస్. చెల్లప్ప స్థాపించిన ఇజుతు (Ezhuthu) సాహిత్య పత్రికలో రాయడం ప్రారంభించాడు. ఆయన ఆంగ్లంలో ఒక నవల, ఆరు కవితల పుస్తకాలు; తమిళంలో తొమ్మిది నవలలు, ఐదు కవితల పుస్తకాలు రాసాడు. అతని తమిళ రచనలు కలం పేరు నకులన్ తో ఉంటాయి. అయితే, ఆంగ్ల రచనలు ఎక్కువగా అతని అసలు పేరుతోనే ప్రచురించబడ్డాయి.[3]

అతని నినైవుప్ పాటై నీలకల్ (1972) నవల తమిళ సాహిత్యంలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. దీంతో, ఆయన అవాంట్ గార్డ్ నవలా రచయితగా గుర్తింపుతెచ్చుకున్నాడు. తమిళంలో అతని ఇతర ముఖ్యమైన రచనలు, నిజల్గల్, నైకల్, నవీనంటే డైరీ కురిప్పుకల్, ఎజుత్తు కవితైకల్, ఇరునీండా కవితైకల్, అంతా మంచాల్ నిరా పూనైకుట్టి. కాగా ఆంగ్లంలో, వర్డ్స్ టు ది విండ్, 'నాన్-బీయింగ్', 'ఏ తమిళ్ రైటర్స్ జర్నల్' వంటివి చెప్పుకోవచ్చు.

1983లో, ఆయన తమిళ కవిత్వానికి ఆసన్ మెమోరియల్ అవార్డును అందుకున్నాడు.[4]

ప్రారంభ జీవితం

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో 1921లో జన్మించిన ప్రొ.దొరైస్వామి 14వ ఏట తిరువనంతపురం వెళ్లాడు.

ఆ తర్వాత అన్నామలై యూనివర్శిటీ నుంచి తమిళంలో ఎంఏ, కేరళ యూనివర్శిటీ నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసాడు.[5] ఆయన ఎం.ఫిల్. వర్జీనియా వూల్ఫ్ రచనలపై సాహిత్యంలో పొందాడు.

మరణం

ఆయన బ్రహ్మచారి. ఆయన 86 సంవత్సరాల వయస్సులో తిరువనంతపురంలో 2007 మే 17న మరణించాడు.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు