డిమము

దశ రూపాకాలలో ఐదవ రూపకము డిమము. డిమం అనగా సంఘాతం, సమూహం, విద్రవం లేక ఉపద్రవం. ఈ రూపకాలలో యుద్ధం, జల, వాయు, అగ్ని, గజేంద్రోపద్రవముంటాయి.

దశ రూపకాలు

దశ రూపకాలు పది రకాలు;[1]

  1. నాటకము
  2. ప్రకరణము
  3. భాణము
  4. ప్రహసనము
  5. డిమము
  6. వ్యాయోగము
  7. సమవాకారము
  8. వీధి
  9. అంకము
  10. ఈహామృగము

డిమము - విధానం

ఈ రూపకాలలో దేవ, గంధర్వ, యక్ష, రక్షో, మహూరగ, భూత, విశాచాదుల వంటి 16 మంది నాయకులు, ప్రఖ్యాత ఇతివృత్తం ఉంటాయి. రౌద్రం ప్రధాన రసం. అంకాలు నాలుగు. సాత్త్వతార్భటి వృత్తులు, శాంత, శృంగార, హాస్య రసాలు కాక మిగిలిన ఆరురసాలు ఉంటాయి. విష్కంభ, ప్రవేశకాలు ఉండవు. విమర్శకాక మిగతా నాలుగు సంధులు ఉండాలి. మాయ, ఇంద్రజాలం, యుద్ధం, సూర్య చంద్రగ్రహణాలను వర్ణించాలి. నాటకంలో మాదిరిగానే ప్రస్తావనాది నాట్యధర్మాలు నిబంధించాలి.ఉదా. వృత్తోద్ధరణం, తారకోద్ధరణం, త్రిపురదాహం.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ