ఢిల్లీ-చెన్నై రైలు మార్గము

ఢిల్లీ-చెన్నై రైలు మార్గము (లైన్) చెన్నై, ఢిల్లీ కలుపుతూ భారతదేశం యొక్క తూర్పు తీర మైదానాల యొక్క దక్షిణ భాగం అంతటా కట్టింగ్ చేస్తూ, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, యమునా లోయ మీదుగా సాగే రైల్వే (లైన్) మార్గము. ఇది ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు అంతటా 2,182 కిలోమీటర్లు (1,356 మైళ్ళు) దూరం విస్తరించివుంది. ఈ మార్గం గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ నకు ఉపయోగిస్తారు, అందువలన దీనిని గ్రాండ్ ట్రంక్ మార్గంగా అనేక మంది సూచిస్తారు.

ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
Delhi–Chennai line
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర,
ఆంధ్ర ప్రదేశ్
, తమిళనాడు
చివరిస్థానంన్యూ ఢిల్లీ
చెన్నై సెంట్రల్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1929
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు2,182 km (1,356 mi)
ట్రాకుల సంఖ్య2
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఎలక్ట్రిఫికేషన్1980-1991 సమయంలో 25 కెవి ఎసి రైల్వే విద్యుద్దీకరణ (25 కెవి 50 హెచ్‌జడ్ ఎసి ఓవర్హెడ్ లైనులు (ఒహెచ్‌ఎల్‌ఈ)
ఆపరేటింగ్ వేగం160 కి.మీ./గంటకు వరకు
మార్గ పటం

విభాగాలు

ఇది 2,182 కి.మీ. (1,356 మైళ్ళు) పొడవైన ట్రంక్ (లైన్) రైలు మార్గము, పొడవైన మార్గము, రద్దీ (బిజీ) గా ఉండి రాజధానులతో (కనెక్ట్) అనుసంధానం చేస్తున్న రైలు మార్గము మరింత వివరంగా చిన్న చిన్న విభాగాలుగా చేయబడింది:

  1. ఆగ్రా కార్డ్
  2. ఆగ్రా-భూపాల్ విభాగం
  3. భూపాల్-నాగ్పూర్ విభాగం
  4. నాగ్పూర్-ఖాజీపేట్ విభాగం
  5. కాజీపేట-విజయవాడ విభాగం
  6. విజయవాడ-చెన్నై విభాగం

చరిత్ర

ఆగ్రా-ఢిల్లీ రైలు మార్గము 1904 లో ప్రారంభించబడింది, [[1] దీనిలోని కొన్ని రైలు మార్గములు (1927-28 సం.లో ప్రారంభించబడినది) న్యూ ఢిల్లీ నిర్మాణ సమయంలో తిరిగి కొత్తగా వేశారు.[2]

ఆగ్రా-గౌలియార్ రైలు మార్గము (లైన్) 1881 సం.లో గౌలియార్ మహారాజుచే ప్రారంభించబడింది, ఇది సింధియా స్టేట్ రైల్వేగా మారింది. భారత మిడ్‌ల్యాండ్ రైల్వే వారు గౌలియార్-ఝాన్సీ రైలు మార్గము (లైన్), 1889 సం.లో ఝాన్సీ-భూపాల్ రైలు మార్గము (లైన్) నిర్మించారు.[3] భూపాల్-ఇటార్సి రైలు మార్గము (లైన్) 1884 సం.లో భూపాల్ యొక్క బేగంచే ప్రారంభించబడింది..[3] ఇటార్సి నాగ్‌పూర్ తో 1923, 1924 మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశారు.[4] నాగ్పూర్-బల్లార్షా రైలు మార్గము (లైన్) నిర్మాణం కాలం మాత్రము అనిశ్చితంగా ఉంది. [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై లైన్]] 1899 సం.లో నిర్మించారు.[3] వాడి-సికింద్రాబాద్ రైలు మార్గము (లైన్) హైదరాబాద్ నిజాం ద్వారా ఆర్థిక సహాయం (ఫైనాన్సింగ్) చేయబడి 1874 సం.లో నిర్మించారు. ఇది తరువాత నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో భాగమయింది. 1889 సం.లో, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన రైలు మార్గము (లైన్) అప్పుడు బెజవాడ అని పిలువబడే విజయవాడ వరకు విస్తరించారు.[3] 1929 సం.లో కాజీపేట-బల్లార్షా లింక్ పూర్తికావడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి రైలు మార్గము (లైన్) కలిపింది.[1]

విద్యుధ్ధీకరణ

విజయవాడ-చెన్నై విభాగం 1980 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.[5] విజయవాడ-కాజీపేట విభాగం 1985-88 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6] కాజీపేట-రామగుండం-బల్లార్షా -నాగ్‌పూర్ విభాగం 1987-89 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది. భూపాల్-ఇటార్సి విభాగం 1988-89 సం.లో, నాగ్పూర్-ఇటార్సి విభాగం 1990-91 సం.లో వీటి విద్యుధ్ధీకరణ జరిగింది. ఆగ్రా-భూపాల్ విభాగం 1984-89 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది. ఆగ్రా-ఫరీదాబాద్ విభాగం 1982-85 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6]

వేగ పరిమితులు

చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వరకు ఉన్న రైలు మార్గము (గ్రాండ్ ట్రంక్ మార్గంగా), 160 కి.మీ/గంటకు వేగాన్ని అందుకోవచ్చును. ఇది ఒక "గ్రూప్ ఏ" మార్గముగా వర్గీకరించారు.[7]

ప్రయాణీకులు ప్రయాణాలు

ఈ మార్గములోని, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రా కంటోన్మెంట్., గౌలియార్, ఝాన్సీ, భూపాల్, భూపాల్ హబీబ్‌గంజ్, నాగ్‌పూర్, విజయవాడ, నెల్లూరు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లు భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషనులలలో ఇవి ఉన్నాయి.[8]

గోల్డెన్ క్వాడ్రిలేటరల్

హౌరా-చెన్నై ప్రధాన లైన్ స్వర్ణ చతుర్భుజి లోని ఒక భాగం. ఈ రైలు మార్గములు నాలుగు ప్రధాన మహానగరాలను (న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోలకతా) కలుపుతూ ఉన్నటువంటి వాటి కర్ణాలు, కలిసి సుపరిచితమైన స్వర్ణ చతుర్భుజిగా, ఈ స్వర్ణ చతుర్భుజి రైలు మార్గము పొడవు 16 శాతం మాత్రమే అయిననూ; దాదాపుగా సగం రవాణా సరుకు, అదేవిధముగా సగభాగం ప్రయాణీకుల రవాణా ఈ మార్గము గుండానే జరుగుతున్నది.[9][10]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు