ఢిల్లీ దర్బారు పతకం (1911)

భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్‌డమ్ నెలకొల్పిన పతకాలను ఢిల్లీ దర్బారు పతకాలు అంటారు. [1] వీటిని రెండు సందర్భాలలో - 1903 లో ఎడ్వర్డ్ VII రాజైనపుడు ఒకసారి, మళ్ళీ 1911 లో జార్జ్ V రాజైన సందర్భంలో రెండోసారి ఈ పతకాలను ప్రదానం చేసారు. ఇవి ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగి, బంగారు, వెండి రెండింటి తోనూ ప్రదానం చేసారు. [2] వీటిని ఎడమ ఛాతీపై పట్టాభిషేకం, జూబ్లీ పతకాలతో పాటు తేదీ క్రమంలో ధరిస్తారు. దీన్ని ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న రిబ్బనుకు తగిలిస్తారు. [3] ఈ రాయల్ స్మారక పతకాలు 1918 నవంబరు వరకు ప్రచార పతకాల కంటే ముందు ధరించారు. [4] ఆ తర్వాత ధరించే క్రమాన్ని మార్చి, ప్రచార పతకాల తర్వాత, సుదీర్ఘ సేవా పురస్కారాలకు ముందూ ఈ దర్బారు పతకాలను ధరించారు.

Delhi Durbar Medal, 1911
Obverse and reverse of 1911 Durbar Medal
TypeCommemoration medal
Awarded forParticipation in Durbar or broader service to the Indian Empire
అందజేసినవారుUnited Kingdom and British Raj
Established1911
Total200 gold and 26,800 silver medals
Ribbon bar
ఢిల్లీ దర్బారు పతకం 1911
1911 దర్బారు పతకం ముందూ వెనుకా
Typeస్మారక పతకం
Awarded forదర్బారులో ఉండడం లేదా భారత సామ్రాజ్యానికి విస్తృతమైన సేవ
అందజేసినవారుయునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ రాజ్
Established1911
Total200 బంగారు, 26,800 వెండి పతకాలు
రిబ్బన్ పట్టీ

ఢిల్లీ దర్బారు పతకం, 1911

బొమ్మ వైపు: కిరీటంతో ఉన్న కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ ముఖాలు గులాబీల పూల దండలో ఎడమ వైపున ఉంటాయి.వెనక వైపు: పర్షియన్ భాషలో ఒక లెజెండ్ ఉంటుంది. దీని అర్థం - బ్రిటిష్ సామ్రాజ్య ప్రభువు, భారత చక్రవర్తి అయిన జార్జ్ V దర్బారు. [5]ఈ పతకంపై పేరేమీ లేకుండా ప్రదానం చేయబడింది. [4]

పాలక అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులకు బహూకరించేందుకు రెండు వందల బంగారు పతకాలను తయారు చేసారు. 30,000 వెండి పతకాలు ముద్రించగా, [6] వాటిలో 26,800 పౌర ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు ప్రదానం చేసారు. వీటిలో 10,000 పతకాలను బ్రిటిషు, భారతీయ సైనికాధికారులకు, సైనికులకూ ఇచ్చారు. [7] దర్బారులో ఉన్నవారికి మాత్రమే కాకుండా, భారతదేశానికి రాజ్‌కు సహకరించిన ఇతరులకు కూడా పతకాన్ని ప్రదానం చేసాదు. [8]

కింగ్ జార్జ్ పట్టాభిషేక పతకం కోసం వాడిన రిబ్బన్నే దీనికీ వాడారు. బొమ్మ వైపు డిజైను రెంటికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే, పట్టాభిషేక పతకం 1¼ అంగుళాల వ్యాసం ఉండగా, దర్బారు పతకం 1½ అంగుళాల వ్యాసంతో పెద్దదిగా ఉంటుంది. రెండు పతకాలు కలిసి ధరించలేరు. రెండింటినీ పొందినవారు తమ పట్టాభిషేక పతకపు రిబ్బన్‌పై 'ఢిల్లీ' అనే పదం ఉన్న పట్టీని ధరిస్తారు. [9]

పట్టాభిషేక పతకం రిబ్బన్ కోసం దర్బారు పట్టీ

ఇవి కూడా చూడండి

మూలాలు

 

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు