తరుణ్ గొగోయ్

తరుణ్ గొగోయ్ అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 6 సార్లు లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు పర్యాయాలు అసోం శాసనసభకు ఎన్నికై, మూడుసార్లు అసోం ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

తరుణ్ గొగోయ్
తరుణ్ గొగోయ్


అస్సాం 13వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
18 మే 2001[1] – 24 మే 2016
గవర్నరుశ్రీనివాస్ కుమార్ సిన్హా
అరవింద్ దావే
అజయ్ సింగ్
శివ చరణ్ మాథుర్
కే. శంకరనారాయణన్
సయెద్ రజి
జానకి బల్లభ్ పట్నాయక్
పద్మనాభ ఆచార్య
ముందుప్రఫుల్ల కుమార్ మహంత
తరువాతసర్బానంద సోనోవాల్

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
1993 – 1995
ప్రధాన మంత్రిపి. వి. నరసింహారావు
ముందుగిరిధర్ గమాంగ్
తరువాతకామాఖ్యా ప్రసాద్ సింగ్ దేవ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 2001
ముందుకేశాబ్ మహంత
తరువాతడిప్ గొగోయ్
నియోజకవర్గంకాళియబోర్
పదవీ కాలం
1991 – 1996
ముందుభద్రేశ్వర్ తంతి
తరువాతకేశాబ్ మహంత
నియోజకవర్గంకాళియబోర్
పదవీ కాలం
1971 – 1984
ముందురాజేంద్రనాథ్ బారువా
తరువాతపరాగ్ చలియా
నియోజకవర్గంజోర్హాట్

శాసనసభ్యుడు
పదవీ కాలం
20 సెప్టెంబర్ 2001 – 23 నవంబర్ 2020
ముందుడిప్ గొగోయ్
నియోజకవర్గంఠితబర్
పదవీ కాలం
1996 – 1998
ముందుకూల్ బహదూర్ ఛెత్రి
తరువాతప్రద్యుత్ బోర్డోలాయ్
నియోజకవర్గంమార్గెరిటా

వ్యక్తిగత వివరాలు

జననం(1936-04-01)1936 ఏప్రిల్ 1
రంగమాటి, జోర్హాట్ జిల్లా, అస్సాం
మరణం2020 నవంబరు 23(2020-11-23) (వయసు 84)
గువాహటి, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిడాలీ గొగోయ్
సంతానంచంద్రిమ గొగోయ్, గౌరవ్ గొగోయ్
పూర్వ విద్యార్థిగౌహతి యూనివర్సిటీ, (ఎల్‌ఎల్‌బీ)
వృత్తిన్యాయవాది, రాజకీయ నాయకుడు
పురస్కారాలుపద్మ భూషణ్
మూలంGovernment of Assam

జననం, విద్యాభాస్యం

తరుణ్ గొగోయ్ 1936 ఏప్రిల్ 1న అసోం రాష్ట్రం, జోర్హాట్ జిల్లా జిల్లా, రంగమాటిలో జన్మించాడు. ఆయన రంగాజన్ నిమ్న బునియాడి విద్యాలయ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అస్సాంలోని గువహాటి విశ్వవిద్యాలయం నుంచి 1963లో ఎల్ఎల్‌బీ పట్టా అందుకున్నాడు.

వివాహం

తరుణ్ గొగోయ్ కు 1972 జూలై 30లో డాలీ గొగోయ్ ను వివాహమాడాడు. వారికీ కొడుకు గౌరవ్ గోగొయ్, కూతురు చంద్రిమ గోగొయ్ ఉన్నారు.

రాజకీయ జీవితం

  • 1968: జోర్హాట్ మునిసిపల్ బోర్డు సభ్యుడు
  • 1971: 5వ లోక్‌సభకు ఎన్నిక
  • 1976: జాతీయ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి
  • 1977: 6వ లోక్‌సభకు ఎన్నిక (2వ సారి)
  • 1983: 7వ లోక్‌సభకు ఎన్నిక (3వ సారి).
  • 1983: జాతీయ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి
  • 1985: జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
  • 1986–1990: అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
  • 1991: 10వ లోక్‌సభకు ఎన్నిక (4వ సారి)
  • 1991–1993: కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
  • 1993–1995: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
  • 1993–1995: అసోం శాసనసభ సభ్యుడు
  • 1998: 12వ లోక్‌సభకు ఎన్నిక (5వ సారి).[2]
  • 2001 మే 18: అసోం ముఖ్యమంత్రి (మొదటి సారి)
  • సెప్టెంబరు - 2001: తితాబర్ నియోజకవర్గం నుంచి అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2006 మే 11: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2006 మే 14: అసోం ముఖ్యమంత్రి (2వ సారి)
  • 2011 మే 13: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2011 మే 18: అసోం ముఖ్యమంత్రి (3వ సారి)
  • 2016 మే 19: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక

మరణం

తరుణ్ గొగోయ్ 2020 నవంబరు 23న అనారోగ్యంతో బాధపడుతూ గౌహతిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించడంతో మరణించాడు.[3][4]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు