తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా

భారతదేశం, మేఘాలయ రాష్ట్రం లోని ఒక జిల్లా.

తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, భారతదేశం, మేఘాలయ రాష్ట్రం లోని ఒక జిల్లా. ఇది రాష్ట్రరాజధాని షిల్లాంగ్‌కు పశ్చిమాన దాదాపు 25 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఇప్పటికే ఉన్న పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించగా 2021లో కొత్తగా ఏర్పడింది. [4] 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాను రూపొందించిన భూభాగాల లోని జనాభా మొత్తం 1,31,451 మంది జనాభాను నమోదు చేసింది. జిల్లా ప్రధాన కార్యాలయం మైరాంగ్ పట్టణం.

Eastern West Khasi Hills
District of Meghalaya
Coordinates: 25°34′N 91°37′E / 25.56°N 91.62°E / 25.56; 91.62
Country India
StateMeghalaya
Established10 November 2021
CapitalMairang
Government
 • Deputy CommissionerWilfred Nongsiej
Area
 • Total1,356.77 km2 (523.85 sq mi)
Highest elevation
[3] (Mawthadraishan Peak)
1,924.5 మీ (6,314.0 అ.)
Population
 (2011)[2]
 • Total1,31,451
 • Density97/km2 (250/sq mi)
Time zoneUTC+5:30 (IST)

భౌగోళిక శాస్త్రం

తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా, మధ్య మేఘాలయ లోని ఖాసీ కొండలలో ఉంది. ఇది ఉత్తరాన రి భోయ్, ఆగ్నేయంలో తూర్పఖాసీ కొండలు, దక్షిణాన నైరుతి ఖాసీ కొండలు, పశ్చిమాన పశ్చిమ ఖాసీ కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. దీని వైశాల్యం 1,356.77 చ.కి.మీ. (523.85 చ.మైళ్లు) విస్తీరణంలో విస్తరించి ఉంది. ఇది మేఘాలయ రాష్ట్ర విస్తీర్ణంలో 6% కలిగి ఉంది.

మౌతడ్రైషన్ శ్రేణి జిల్లా గుండా తూర్పునుండి పడమరకు వెళుతుంది. [5] జిల్లాలో అత్యధిక ఎత్తులో ఉన్న మౌతడ్రైషన్ శిఖరం సముద్ర మట్టానికి 1,924.5 (6,314 అడుగులు) పైన, నాంగ్‌స్టోయిన్, మైరాంగ్ పట్టణాల మధ్యలో ఉంది. జిల్లాలో మరొక ముఖ్యమైన ఎత్తులో కిల్లాంగ్ రాయి ఉంది. ఇది 9 కి.మీ (5.6 మైళ్లు) దూరంలో ఉన్న ఒక పెద్ద రాతి గోపురం. వాయువ్యంగా 1,774 మీటర్లు (5,820 అడుగులు) సముద్ర మట్టానికి పైన ఎత్తులో ఉంది. [6]

జిల్లామధ్య ఎత్తైన ప్రాంతాలు, ఉత్తరాన బ్రహ్మపుత్రా నది, దక్షిణాన మేఘనా నది పారుదల మైదాన ప్రాంతం మధ్య విభజనను ఏర్పరుస్తాయి. జిల్లాలో గుర్తించదగిన నదులు దక్షిణాన కిన్షి నది, ఉత్తరాన ఉన్న క్రి నది, ఇది ఉకియం వద్ద అస్సాం లోకి ప్రవేశించినప్పుడు కుల్సీ నదిగా మారుతుంది.ఖ్రి నది ఉపనది క్రిసిన్నియా నది.[5]

జిల్లా వాతావరణం మధ్య ఎత్తైన ప్రాంతాలలో సమశీతోష్ణ స్థితి నుండి ఉత్తర, దక్షిణ పర్వత ప్రాంతాలలో తేలికపాటి ఉష్ణమండల వాతావరణంగా మారుతూ ఉంటుంది. జిల్లాలో అత్యధిక వర్షపాతం మే, ఆగస్టు మధ్య నైరుతి రుతుపవనాల సమయంలో సంభవిస్తుంది. [7] మైరాంగ్ సగటు వార్షిక వర్షపాతం దాదాపు 2,500 మి.మీటర్లు ఉంటుంది.

చరిత్ర

ఖాసీ ప్రజలు ఈ ప్రాంతంలోని స్థానికులు.1829-1833 ఆంగ్లో-ఖాసీ యుద్ధంలో ఖాసీ ప్రతిఘటన నాయకుడు తిరోట్ సింగ్, దాదాపు 15 కి.మీ. దూరంలో ఉన్న నోంగ్‌ఖ్లావ్‌కు చెందిన వ్వక్తి. ఉత్తరాన అతని గౌరవార్థం మైరాంగ్‌లో 1953-1954లో స్మారక చిహ్నం నిర్మించారు. అధికారికంగా బ్రిటిష్ ఇండియాలో ఎప్పుడూ భాగం కాదు.25 ఖాసీ రాష్ట్రాలు 1948లో భారతదేశ డొమినియన్‌లో ప్రవేశించాయి. వీటికి భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి ఇవ్వబడ్డాయి. [8] [9]

1972లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఖాసీ కొండలు యునైటెడ్ ఖాసీ, జైంతియా హిల్స్ జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఆ సంవత్సరం తరువాత ఖాసీ హిల్స్, జైంతియా హిల్స్ జిల్లాలుగా విభజించబడ్డాయి. ఖాసీ హిల్స్ జిల్లా 1976 అక్టోబరు 28న పశ్చిమ, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలుగా విభజించబడ్డాయి. పశ్చిమ ఖాసీ హిల్స్‌లో 1976 నవంబరు 10న మైరాంగ్ ఉప విభాగం సృష్టించబడింది. [10] మౌతడ్రైషన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ 2001 మార్చి 20న మైరాంగ్, మౌకిర్వాట్, నాంగ్‌స్టోయిన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌ల నుండి సృష్టించబడింది. 2021 నవంబరు 10న, పశ్చిమ ఖాసీ హిల్స్ నుండి మైరాంగ్, మౌతడ్రైషన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు వేరు చేయబడి తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్‌లో కొత్త జిల్లాగా ఏర్పడ్డాయి. భౌగోళిక నామకరణంపై భౌగోళిక క్రమరాహిత్యం అయినందున జిల్లాకు ఎంపిక చేసిన పేరు గురించి చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి.

పరిపాలన

ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, మైరాంగ్, మౌతడ్రైషన్ అనే రెండు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లుగా విభజించబడ్డాయి. జిల్లా ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తుంది. [11]

జనాభా శాస్త్రం

తూర్పు పశ్చిమ ఖాసీ కొండలలో మత వివరాలు (2011)[12]
మతాలు
క్రైస్తవులు
  
94.94%
ఇతరులు*
  
3.69%
మతం పాటించనివారు
  
0%
* భారతదేశంలో గిరిజన మతాలు, యానిమిస్ట్‌లు

జిల్లాలో మొత్తం జనాభా 1,31,451, అందులో పురుషులు 66,016 మంది కాగా, స్త్రీలు 65,435 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరసగా 11 (0.01%) మంది, (98.71%) 129,758 మంది ఉన్నారు. [13]

ఆర్థిక వ్యవస్థ,

జిల్లాలో ప్రధాన ఆర్థికవనరులు వ్యవసాయం. ప్రధాన పంటలుగా వరి, మొక్కజొన్న, బంగాళదుంపలు పండిస్తారు.

మౌలిక సదుపాయాలు

జాతీయ రహదారి 106 తూర్పు నుండి పశ్చిమాన జిల్లా గుండా వెళుతుంది, దీనిని తూర్పున షిల్లాంగ్ , పశ్చిమాన నాంగ్‌స్టోయిన్‌కు కలుపుతుంది. మేఘాలయ రాష్ట్ర రహదారి 3 మైరాంగ్ నుండి ఉత్తరాన నోంగ్ఖ్లావ్ గుండా వెళుతుంది. ఇది జిల్లాను రి భోయ్ జిల్లా, అస్సాం రాష్ట్రానికి కలుపుతుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు