దుస్సల

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి.[1] సింధు దేశ రాజు సైంధవుడిని వివాహం చేసుకుంది.[2] కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు.

దుస్సల
మహాభారతం పాత్ర
సమాచారం
కుటుంబంధృతరాష్ట్రుడు (తండ్రి), గాంధారి (తల్లి), కౌరవులు (సోదరులు), శకుని (మేనమామ)
దాంపత్యభాగస్వామిసైంధవుడు
పిల్లలుసురధుడు

జననం

గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువు బూడిదరంగులో ఉన్న ముద్దలాగా పుడుతుంది. తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుందని గాంధారి కోరగా, ఆ కోరికను మన్నించి వ్యాసుడు గాంధారి గర్భస్థ శిశువుని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా 100మంది సోదరులు, ఒక సోదరి దుస్సల జన్మించారు.[3]

ఇతర వివరాలు

దుస్సల పాండవులకు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెడతాడు. దుస్సల మనవడిని సింధు రాజ్యానికి రాజుగా చేసి అక్కడినుండి తిరిగి వచ్చేశాడు. సోదరి దుస్సల కారణంగా పాండవ, కౌరవుల మధ్య ఉన్న వైరం నిలిచిపోతుంది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు