నిజాంసాగర్ ప్రాజెక్టు

తెలంగాణలో నీటి పారుదల ఆనకట్ట

నిజాంసాగర్ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంవద్ద మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టు.[1] నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాంసాగర్‌గా నామకరణం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 145 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు 58 టీయంసీల సామర్ధ్యంతో 2.75 లక్షల ఎకరాలకు నీరందించడం లక్ష్యంతో నిర్మితమైంది. ఈ ప్రాజెక్టులో బోటింగ్‌ సౌకర్యంతోపాటు పర్యాటకులను అలరించే ఆహ్లాదకరమైన సుందరమైన వనం ఉంది.[2]

నిజాంసాగర్ ప్రాజెక్టు
నిజాంసాగర్ డ్యామ్
నిజాంసాగర్ ప్రాజెక్టు is located in Telangana
నిజాంసాగర్ ప్రాజెక్టు
Telangana లో నిజాంసాగర్ ప్రాజెక్టు స్థానం
నిజాంసాగర్ ప్రాజెక్టు is located in India
నిజాంసాగర్ ప్రాజెక్టు
నిజాంసాగర్ ప్రాజెక్టు (India)
ప్రదేశంఅచ్చంపేట, నిజాంసాగర్‌ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు18°12′09″N 77°55′26″E / 18.20250°N 77.92389°E / 18.20250; 77.92389
నిర్మాణం ప్రారంభం1923
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుగోదావరి నది
పొడవు3 కిలోమీటర్లు
పటం
Map

చరిత్ర

అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలో 1923లో ప్రారంభమై, నవాబ్‌ ఆలీ నవాజంగ్‌ బహదూర్‌ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయింది. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టుకోసం బంజపల్లి వద్ద పరిసర 40 గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. మంజీర నది వద్ద సింగూరు మిగులు జలాలను ఆధారంగా చేసుకుని ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు.

ప్రాజెక్టు వివరాలు

  • ప్రారంభం: 31.10.1931
  • నిర్మాణ వ్యయం: రూ.3.15 కోట్లు
  • నీటి నిలువ సామర్థ్యం: నిర్మాణ సమయంలో 29.72 టీఎంసీలు, ప్రస్తుతం 17.80 టీఎంసీలు
  • ఆయకట్టు విస్తీర్ణం: 2.75 లక్షల ఎకరాలు
  • లబ్ధిపొందే మండలాలు: కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, దోమకొండ, భిక్నూర్‌, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలు
  • ప్రధాన కాలువ పొడవు: 155 కిలోమీటర్లు
  • పంపిణీ కాలువల సంఖ్య: 82
  • ఉపకాలువల సంఖ్య: 283
  • పంపిణీ, ఉపకాలువల పొడవు: 1771 కిలో మీటర్లు

ఇతర వివరాలు

ఈ ప్రాజెక్టు నుండి నాగమడుగు ఎత్తిపోతల పథకానికి నీటి పంపిణీ చేయబడుతుంది. నాగమడుగు ఎత్తిపోతల పథకం కింద దాదాపు 40 వేల 768 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది.

చిత్రమాలిక

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు