నెల్పినవిర్

Nelfinavir, నెల్పినవిర్ ([ (3S,4aS,8aS) -N-tert-butyl-2-[ (2R,3R) -2-hydroxy-3-[ (3-hydroxy-2-methylphenyl) formamido]-4- (phenylsulfanyl) butyl]-decahydroisoquinoline-3-carboxamide, NFV, brand name Viracept®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె Protease Inhibitor అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు NFV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 14-Mar-1997 [1] రోజున అమోదించబడింది.

మోతాదు ( Dosage )

ఎయిడ్స్
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

ఈ మందును రోజుకు రెండుసార్లు గాని మూడు సార్లు గాని వెసుకొనవలసి వుంటుంది

రోజుకు రెండుసార్లు మోతాదు వేసుకోవాలంటె. - 1250Mg ప్రతె రోజు రెండు సార్లు ( ప్రతి 12 గంటలకు )

రోజుకు మూడు సార్లు మోతాదు వేసుకోవాలంటె. - 750Mg మూడుసార్లు ప్రతి రోజు ( ప్రతి 8 గంటలకు )

ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వేసుకొవచ్చు. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects )

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడె వారిలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఉంది.
  2. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. గుండె సంబంధిత సమస్యలు వుండి వుంటె, అలాగెమధుమేహం ఉండివుంటె ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు