భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి

2011 డిసెంబరులో భారత పార్లమెంటుపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడి

2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారు.[3] భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు.[4] ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి - మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ దాడితో భారత పాక్ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమై, 2001-02 నాటి సైనిక మోహరింపుకు దారితీసింది.[5] 2001 నవంబరులో కాశ్మీరు శాసనసభపై జరిపిన ఇటువంటి దాడిలో ఉగ్రవాదులు 38 మంది ప్రజలను హతమార్చారు.[6]

2001 భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి
ప్రదేశంఢిల్లీ, భారతదేశం
తేదీ2001 డిసెంబరు 13 (UTC+05:30)
లక్ష్యంపార్లమెంటు భవనం
దాడి రకం
కాల్పులు
మరణాలు14 (5 గురు ఉగ్రవాదులతో సహా)
ప్రాణాపాయ గాయాలు
18
నేరస్తులులష్కర్-ఎ-తోయిబా[1]
జైష్-ఎ-మొహమ్మద్[2]

దాడి

2001 డిసెంబరు 13 న ఐదుగురు ఉగ్రవాదులు, గృహమంత్రిత్వ శాఖ, పార్లమెంటు గుర్తులు కలిగిన ఒక కారులో, భారత పార్లమెంటులోకి చొరబడ్డారు.[7] అప్పటికి లోక్‌సభ, రాజ్యసభలు రెండూ కూడా వాయిదా పడి 40 నిముషాలైంది. పార్లమెంటు సభ్యులు, అధికారులు అనేకమంది, ఎల్.కె.అడ్వాణీ, హరీన్ పాఠక్ వంటి మంత్రులూ దాడి సమయనికి పార్లమెంటు భవనంలోనే ఉన్నారని భావిస్తున్నారు.[8] 100 మందికి పైగా వ్యక్తులు ఆ సమయానికి భవనం లోపలే ఉన్నారు. ఉగ్రవాదులు తమ కారుపై దొంగ గుర్తింపు పత్రాన్ని అంటించి, భద్రతా వలయాన్ని వంచించారు.[6] ఉగ్రవాదులు AK47 తుపాకులు, గ్రెనేడ్ లాంచర్లు, పిస్టళ్ళు, గ్రెనేడ్లూ తీసుకువెళ్ళారు.[9] వీరు పాకిస్తాన్ నుండి సూచనలు అందుకున్నారని, పాకిస్తానుకు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ సంస్థ మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ జరిగిందనీ ఢిల్లీ పోలీసు శాఖ చెప్పింది.[9]

ఉగ్రవాదులు తమ కారును ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ కారుకు ఢీకొట్టి ఆపారు. వెంటనే దిగేసి, కాల్పులు మొదలుపెట్టారు. ఉపరాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు మొదలుపెట్టి, కాంపౌండు తలుపులు మూసేసారు.

బాధితులు

సిఆర్‌పిఎఫ్ కు చెందిన కమలేష్ కుమారి ఉగ్రవాదులను తొలుత గమనించి కేకలు వేసింది. ఉగ్రవాదులు వెంటనే కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మరణించింది. ఒక ఉగ్రవాదిపై భద్రతా దళాలు కాల్పులు జరిపినపుడు, అతడు చుట్టుకుని ఉన్న బాంబులు పేలి హతుడయ్యాడు. ఐదుగురు పోలీసులు, ఒక పార్లమెంటు గార్డు, ఒక తోటమాలి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. 18 మంది గాయపడ్డారు.[10] మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు అందరూ ఏ హానీ లేకుండా తప్పించుకున్నారు. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా 22 మంది గాయాల పాలయ్యారు.[11]

ముష్కరులు

ఢిల్లీ పోలీసు శాఖ ప్రకారం దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు: హమ్‌జా, హైదర్ అలియాస్ తుఫయీల్, రాణా, రణ్‌విజయ్, మొహమ్మద్.[12][13] కోర్టు విచారణలో మరో ముగ్గురు పాకిస్తానీయులు - మౌలానా మసూద్ అజర్, ఘాజీ బాబా అలియాఅస్ ఆఅబూ జిహాదీ, తారిక్ అహ్మద్ - కూడా ఈ దాడి రూపకల్పనలో పాల్గొన్నారు.[13]

అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష

ఈ దాడికి రూపకల్పన చేసి, నిర్వహించిన అఫ్జల్ గురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతణ్ణి 2006 అక్టోబరు 20 న ఉరి తీయాల్సి ఉండగా, అతడు పెట్టుకున్న క్షమాభిక్ష వినతిపత్రం పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును నిలిపేవేశారు. ఈ క్షమాభిక్ష కోసం అఫ్జల్ గురు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తూండగా, కమలేష్ కుమారి యాదవ్ కుటుంబ సభ్యులు అదే జరిగితే ఆమె కిచ్చిన అశోక చక్రను వాపసు చేస్తామని ప్రకటించారు. 2006 డిసెంబరు 13 న వీరమరణం పొందిన వారి కుటుంబసభ్యులు తమతమ పతకాలను ప్రభుత్వనికి వాపసు ఇచ్చేసారు.

ఈ చీకటి రోజు జ్ఞాపకార్థంగా భారతీయ జనతా పార్టీ, పార్లమెంట్‌పై జరిగిన సమయంలో తీసిన వీడియో చిత్రాలతో కూడిన సీడీని విడుదల చేసింది.[14] ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఉరిశిక్ష అమలు కాకుండా చూస్తోందని భారతీయ జనతా పార్టీ వాదించింది. పార్లమెంటుపై దాడి చేసిన అప్జల్‌ గురుకు బహిరంగంగా ఉరి శిక్ష అమలు చేసినట్లయితే కసబ్‌ లాంటి వాళ్ళు దేశంపై దాడి చేసే వారు కాదని విశ్వహిందూ పరిషత్‌ అభిప్రాయపడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలంటే భారత ప్రభుత్వం అప్జల్‌ గురు, కసబ్‌ను ఉరి తీయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు.[15] 2013 ఫిబ్రవరి 3 న అఫ్జల్ గురు క్షమాభిక్ష అభ్యర్ధనను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9 న అఫ్జల్ గురును తీహార్ జైల్లో ఉరి తీసి, కోర్టు తీర్పును అమలు చేసారు. అతణ్ణి తీహార్ జైల్లోనే అతడి మతవిశ్వాసాల కనుగుణంగా ఖననం చేసారు.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు