మహ్మద్ వసీం జూనియర్
మొహమ్మద్ వసీం వజీర్[1] (జననం 2001, ఆగస్టు 25) పాకిస్తానీ క్రికెటర్. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ వసీం వజీర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఉత్తర వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 2001 ఆగస్టు 25|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 ft 2 in (188 cm) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 253) | 2022 డిసెంబరు 17 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 26 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 232) | 2022 మార్చి 29 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 ఆగస్టు 26 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 94) | 2021 జూలై 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 27 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2020/21–present | Khyber Pakhtunkhwa | |||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 4 May 2023 |
తొలి జీవితం
ఇతను ఉత్తర వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో నివసించే పష్టూన్ కుటుంబానికి చెందిన వజీర్ తెగలో జన్మించాడు. ప్రారంభంలో టేప్-బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత ప్రావిన్స్ రాజధాని పెషావర్‌కు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అతను జిల్లా స్థాయిలో, తరువాత ప్రాంతీయస్థాయిలో ఆడే ముందు క్రికెట్ క్లబ్లో చేరాడు. పాకిస్తాన్ అండర్19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[3]
కెరీర్
2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ జట్టులో వసీం సభ్యుడిగా ఉన్నాడు.[4] 2020-21 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీలో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున 2020 నవంబరు 26న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5] 2021 జనవరిలో 2020–21 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7] 2020–21 పాకిస్తాన్ కప్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా కోసం 2021 జనవరి 18న లిస్ట్ ఎ జట్టులోకి అరంగేట్రం చేశాడు.[8] 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున 2021 ఫిబ్రవరి 21న ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[9]
2021 మార్చిలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో ఎంపికయ్యాడు.[10][11] 2021 జూన్ లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[12] 2021 జూలై 28న టీ20 అరంగేట్రం చేసాడు, వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున[13] క్రిస్ గేల్ వికెట్ తీసుకున్నాడు.[14]
2021 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[15] 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[16] 2021 డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం ఈసారి పాకిస్తాన్ వన్డే జట్టులో మళ్ళీ ఎంపికయ్యాడు.[17]
2022 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ టెస్ట్ జట్టులో వాసిమ్ని ఎంపికయ్యాడు.[18] తరువాత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్‌కు పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[19] 2022 మార్చి 29న పాకిస్తాన్ తరపున ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే అరంగేట్రం చేసాడు.[20]
2022 డిసెంబరు 17న మూడవ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున తన టెస్ట్ అరంగేట్రం చేసాడు.[21]