మార్టిన్ క్రోవ్

న్యూజీలాండ్ క్రికెటర్, టెస్ట్, వన్డే కెప్టెన్, వ్యాఖ్యాత

మార్టిన్ డేవిడ్ క్రో (1962, సెప్టెంబరు 22 - 2016, మార్చి 3) న్యూజీలాండ్ క్రికెటర్, టెస్ట్, వన్డే కెప్టెన్, వ్యాఖ్యాత. 1982 - 1995 మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడాడు. దేశ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[1]

మార్టిన్ క్రో
2011లో ఒక ఛారిటీ గేమ్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్రోవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మార్టిన్ డేవిడ్ క్రో
పుట్టిన తేదీ(1962-09-22)1962 సెప్టెంబరు 22
Henderson, New Zealand
మరణించిన తేదీ2016 మార్చి 3(2016-03-03) (వయసు 53)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రమిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్
బంధువులులోరైన్ డౌన్స్ (భార్య)
డేవ్ క్రోవ్ (తండ్రి)
జెఫ్ క్రోవ్ (సోదరుడు)
రస్సెల్ క్రోవ్ (బంధువు)
మూస:నౌరాప్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 150)1982 26 February - Australia తో
చివరి టెస్టు1995 12 November - India తో
తొలి వన్‌డే (క్యాప్ 40)1982 13 February - Australia తో
చివరి వన్‌డే1995 26 November - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979/80–1982/83Auckland
1983/84–1989/90Central Districts
1984–1988Somerset
1990/91–1994/95Wellington
కెరీర్ గణాంకాలు
పోటీTestODIFCLA
మ్యాచ్‌లు77143247261
చేసిన పరుగులు5,4444,70419,6088,740
బ్యాటింగు సగటు45.3638.5556.0238.16
100లు/50లు17/184/3471/8011/59
అత్యుత్తమ స్కోరు299107*299155*
వేసిన బంతులు1,3771,2967,9213,994
వికెట్లు142911999
బౌలింగు సగటు48.2832.8933.6928.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు0040
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0000
అత్యుత్తమ బౌలింగు2/252/95/184/24
క్యాచ్‌లు/స్టంపింగులు71/–66/–226/–115/–
మూలం: ESPNcricinfo, 2009 30 May

క్రికెట్ రంగం

క్రోవ్ 17 సంవత్సరాల వయస్సులో ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 19 సంవత్సరాల వయస్సులో న్యూజీలాండ్ తరపున టెస్ట్ అరంగేట్రం చేసాడు. 1985లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. "ప్రపంచంలోని అత్యుత్తమ యువ బ్యాట్స్‌మెన్"గా గుర్తింపు పొందాడు.[2] 1990లో న్యూజీలాండ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1993 వరకు జట్టుకు నాయకత్వం వహించాడు. 1991లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 299 పరుగులు చేసి, న్యూజీలాండ్ ఆటగాడి అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అదే మ్యాచ్‌లో, అతను ఆండ్రూ జోన్స్‌తో కలిసి 467 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యానికి కొత్త రికార్డును కూడా నెలకొల్పాడు. 1992 ప్రపంచ కప్‌లో, న్యూజీలాండ్ ఆస్ట్రేలియాతో కలిసి ఆతిథ్యమిచ్చింది, క్రోవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. జట్టును సెమీ-ఫైనల్‌కు నడిపించాడు. 1995లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించే సమయానికి, అతను న్యూజీలాండ్ తరపున అత్యధిక టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ పరుగులు చేసిన రికార్డులను కలిగి ఉన్నాడు. ఆట నుండి రిటైర్ అయిన తర్వాత క్రికెట్‌లో రచయితగా, వ్యాఖ్యాతగా కొనసాగాడు.

అంతర్జాతీయ వన్డే సెంచరీలు[3]
నం.స్కోర్ప్రత్యర్థివేదికతేదీRef
1105 నాటౌట్  ఇంగ్లాండుఈడెన్ పార్క్, ఆక్లాండ్1984, ఫిబ్రవరి 25[4]
2104  భారతదేశంకారిస్‌బ్రూక్, డునెడిన్1990, మార్చి 1[5]
3100 నాటౌట్  ఆస్ట్రేలియాఈడెన్ పార్క్, ఆక్లాండ్1992, ఫిబ్రవరి 22[6]
4107 నాటౌట్  భారతదేశంకీనన్ స్టేడియం, జంషెడ్‌పూర్1995, నవంబరు 15[7]

మరణం

2012 నుండి లింఫోమాతో బాధపడ్డాడు. ఆ వ్యాధితో 2016లో మరణించాడు.[8]

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు