మాల్గాడి శుభ

గాయని

మాల్గాడి శుభగా ప్రసిద్ధి చెందిన మాల్గుడి శుభ ఒక పాప్ గాయని, భారతీయ సినిమా నేపథ్య గాయని. 2000లో విడుదలైన చిక్‌పక్ చిక్‌భం అనే ప్రైవేటు ఆల్బమ్‌లో ఈమె పాడిన "మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడ వచ్చినా" పాట బంపర్ హిట్ కావడంతో ఈమె పేరు మాల్గాడి శుభగా స్థిరపడి పోయింది.

శుభ
నివాస ప్రాంతంచెన్నై
వృత్తిభారతీయ చలనచిత్ర నేపథ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు1992 నుండి ప్రస్తుతం
మతంహిందూ మతం

విశేషాలు

తమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరుకు చెందిన శుభ ముంబాయిలో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. ఢిల్లీ లోని హోటల్ అశోకాలో పాటలు పాడటం ద్వారా పాప్ గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది. ఉషా ఉతుప్ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను కోల్‌కాతాకు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో చెన్నైలో స్థిరపడింది.[1] దక్షిణ భారత నటి ప్రియమణి ఈవిడ మేనకోడలు.

గాయనిగా

ఈమె సెట్ మీ ఫ్రీ, చిక్ పక్ చిక్ భం, సునేరె నాచేరె, ఆటం కొండాట్టం మొదలైన ప్రైవేటు ఆల్బమ్‌లు చేసింది. తెలంగాణ యాసలో రాజ్ కోటి సంగీతంలో వెలువడిన చిక్ పక్ చిక్ బం ఆల్బం పదహారు లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఈమె ఇంకా భక్తి గీతాలు, నర్సరీ రైమ్స్ పాడింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల చలనచిత్రాలలో 3000కు పైగా పాటలు పాడింది.

తెలుగు సినిమా పాటల జాబితా

ఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

సంవత్సరంసినిమా పేరుపాటసంగీతంసాహిత్యంసహ గాయకులు
1992అలెగ్జాండర్వల వేసి పట్టేది వాడే గురి చూసి కొట్టేది వాడేరాజ్ కోటిభువనచంద్ర
1992అలెగ్జాండర్హేపీ హేపీ హేపీ హేపీ తేరా పాపిరాజ్ కోటిభువనచంద్ర
1993అక్కాచెల్లెళ్లుకొక్కోకోలా కొక్కో కోలా నీకోడి నా డిస్కో కోలాశ్రీవేటూరిమనో
1993జెంటిల్ మేన్ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మాఎ.ఆర్.రెహమాన్రాజశ్రీసాహుల్ హమీద్, స్వర్ణలత
1993రక్షణనీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేనుఎం.ఎం.కీరవాణిసిరివెన్నెల సీతారామశాస్త్రి
1994గోవిందా గోవిందాఅమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో...రాజ్ కోటిసిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
1996అప్పాజిమమ్ము సాప్ప మమ్ము సాప్పఎం.ఎం.కీరవాణివెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1996ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..?ఇప్పసారా తాగి ఈడుతేజభారతీబాబు
1997గోకులంలో సీతతళక్ తళక్ అని తళకుల తారకోటివేటూరిచిత్ర
1997గోకులంలో సీతహే పాప దిల్ దేదే పాపకోటివేటూరిమనో
1997చిన్నబ్బాయివసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాటఇళయరాజాసిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
1998పెళ్ళి కానుకసువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాలఎం.ఎం.కీరవాణిసిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
1999హలో ప్రేమిస్తావాక్యాంపన్‌లో ర్యాగింగ్వి.మనోహర్భారతీబాబుబృందం
2010కొమరం పులిపిచ్చి కుచ్చిఎ.ఆర్.రెహమాన్చంద్రబోస్ఉదిత్ నారాయణ్, మధుశ్రీ
2012జులాయిపకడో... ఓ... పకడో... ఓ... పకడో పకడో పకడో పకడోదేవిశ్రీ ప్రసాద్రామజోగయ్య శాస్త్రిదేవీశ్రీ ప్రసాద్
2013అత్తారింటికి దారేదిఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడేదేవిశ్రీ ప్రసాద్రామజోగయ్య శాస్త్రిడేవిడ్ సిమోన్ బృందం

మూలాలు

బయటిలింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు