మెహమూద్ (నటుడు)

మెహమూద్ అలీ (1932 సెప్టెంబరు 29 - 2004 జూలై 23) ఒక భారతీయ నటుడు, గాయకుడు, దర్శకుడు. సినీ నిర్మాత కూడా అయిన ఆయన హిందీ చిత్రాలలో హాస్య పాత్రలు పోషించడంలో ప్రసిద్ధి చెందాడు.[1][2][3]

మెహమూద్ అలీ
1955లో మెహమూద్ అలీ
జననం(1932-09-29)1932 సెప్టెంబరు 29
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం ముంబై)
మరణం2004 జూలై 23(2004-07-23) (వయసు 71)
డన్మోర్, పెన్సిల్వేనియా, అమెరికా
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
  • చిత్ర నిర్మాత
  • దర్శకుడు
పిల్లలు7, పక్కి అలీ, లక్కీ అలీ, మాకీ అలీ, గిన్నీ అలీ
తల్లిదండ్రులుముంతాజ్ అలీ (తండ్రి)
బంధువులుమీనా కుమారి (కోడలు)
భారతదేశం 2013 స్టాంపుపై మెహమూద్

నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో 300 పైచిలుకు హిందీ చిత్రాలలో నటించాడు. ఆయన జాతీయ హాస్యనటుడిగా గుర్తింపు పొందాడు.[2][4] మెహమూద్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు 25, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎ కామిక్ రోల్ కి 19 నామినేషన్లు అందుకున్నాడు. ఈ అవార్డులు 1954లో ప్రారంభం కాగా ఉత్తమ హాస్యనటుడి విభాగంలో అవార్డులు 1967లో మొదలయ్యాయి. అంతకు ముందు మెహమూద్ ఉత్తమ సహాయ నటుడికి కూడా 6 నామినేషన్లు అందుకున్నాడు.

జీవితం తొలి దశలో

బొంబాయిలో 1940, 1950లలో చలనచిత్ర రంగానికి చెందిన భారీ స్టార్ అయిన లతీఫున్నీసా, నటుడు ముంతాజ్ అలీలకు మెహమూద్ అలీ 1932 సెప్టెంబరు 29న జన్మించాడు. అతను ఎనిమిది మంది సంతానంలో రెండవవాడు. ఆయన సోదరి మినూ ముంతాజ్ కూడా బాలీవుడ్ సినిమాల్లో పేరు పొందిన నర్తకి, క్యారెక్టర్ నటి. ఆయన తమ్ముడు అన్వర్ అలీ కూడా నటుడు, అలాగే ఖుద్-దార్, కాష్ వంటి చిత్రాలకు నిర్మాత.[3][4]

మరణం

2004 జులై 23న అమెరికాలోని పెన్సిల్వేనియాలో మెహమూద్ మరణించాడు. గుండె సంబంధిత జబ్బుల చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడు. ముంబైలోని బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోలో ఆయన అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.[2][3][4]

అవార్డులు

  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు - విజేత - 1963 దిల్ తేరా దివానా
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ హాస్యనటుడు అవార్డు - విజేత

1967 - ప్యార్ కియే జా

1970 వారిస్ – రామ్ కుమార్ /తల్లి (ద్విపాత్ర)

1972 పరాస్ - మున్నా సర్కార్

1975 - వర్దాన్

  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ హాస్యనటుడు అవార్డు - నామినేట్

1967 లవ్ ఇన్ టోక్యో – మహేష్

1968 మెహర్బన్

1969 నీల్ కమల్ - గిర్ధర్ గోపాల్ అగర్వాల్

1969 సాధు ఔర్ షైతాన్ – బజరంగ్/రామ్

1970 మేరీ భాభి – శంబు

1971 హంజోలి - శివరామ్

1972 మెయిన్ సుందర్ హూన్ – సుందర్

1973 బొంబాయి నుండి గోవా – ఖన్నా, బస్ కండక్టర్

1974 దో ఫూల్ – పవిత్ర కుమార్ రాయ్ 'పుట్టన్'/మణి

1975 దునియా క మేళా

1975 కున్వారా బాప్ – మహేష్/రిక్షా వాలా

1976 ఖైద్ - బజరంగీ

1977 సబ్సే బడా రూపయ్య – నేకి రామ్

1980 నౌకర్ – దయాళ్

1983 ఖుద్-దార్ - జగ్గన్

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు