మైకెల్ గాఫ్

మైకెల్ ఆండ్రూ గాఫ్ (జననం 1979 డిసెంబరు 18) ఒక ఇంగ్లీష్ క్రికెట్ అంపైరు, మాజీ క్రికెటరు . అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్. గాఫ్ అంతర్జాతీయ అంపైరే కాక, ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ICC అంపైరుల ఎలైట్ ప్యానెల్‌లో సభ్యుడు. [1]

ఆటగాడిగా

1997లో రెండు యూత్ టెస్టు మ్యాచ్‌లు ఆడిన గాఫ్, 1998లో డర్హామ్ జట్టులో పూర్తి స్థాయి సభ్యుడిగా మారాడు. గతంలో వారి రెండవ XI జట్టులో అప్పుడప్పుడు సభ్యుడిగా ఉన్నాడు. ఈ పాత్రలో మరో ఐదు సంవత్సరాలు కొనసాగాడు. సెకండ్ XI క్రికెట్‌లో అతని తొలి మ్యాచ్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడాడు గానీ, రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. గాఫ్ పదకొండు యూత్ టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1997 డిసెంబరులో దక్షిణాఫ్రికాలో ఆడడం మొదలుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 130 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లాండ్ అండర్-19 జట్టు చివరికి డ్రా చేసుకుంది. అతను తరువాత పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండర్-19లతో ఆడాడు.

అత్యున్నత స్థాయిలో క్రీడపై అతనికి ఆసక్తి పోయి, 23 సంవత్సరాల వయస్సులో రిటైరయ్యాడు. హార్ట్‌పూల్‌లోని తన తండ్రి స్పోర్ట్స్ షాప్‌లో పని చేస్తున్న సమయంలో, అతను హోర్డెన్, స్పెన్నిమూర్ టౌన్, బారో కోసం ఫుట్‌బాల్ ఆడాడు. హార్ట్‌పూల్ సండే మార్నింగ్ లీగ్‌లో, అతను తిరిగి క్రికెట్‌లో కోచ్ లేదా అంపైరుగా పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతను 2005 శీతాకాలంలో స్టాక్‌టన్ క్రికెట్ క్లబ్‌లో అంపైరింగ్ పరీక్షలకు హాజరయ్యాడు. 2005 వేసవిలో (బిషప్ ఆక్లాండ్ 3వ వర్సెస్ సెడ్జ్‌ఫీల్డ్ 3వ) తన మొదటి మ్యాచ్‌కు అంపైరింగ్ చేశాడు. మైఖేల్ హార్ట్‌పూల్ సండే మార్నింగ్ ఫుట్‌బాల్ లీగ్‌లో కూడా రిఫరీగా ఉన్నాడు. [2]

అంపైరింగ్ కెరీర్

రెండవ XI ఛాంపియన్‌షిప్‌లోను, రెండవ XI ట్రోఫీలోనూ గాఫ్ అంపైరు అయ్యాడు. 2006 ఏప్రిల్లో తన మొదటి గేమ్‌ను నిర్వహించాడు [3] అతను, 2013లో అంతర్జాతీయ అంపైరుగా మొదలు పెట్టినప్పటి నుండి అతను అనేక వన్‌డే గేమ్‌లు, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో అంపైరుగా ఉన్నాడు.[4] అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో మ్యాచ్‌లలో నిలబడిన ఇరవై మంది అంపైరులలో ఒకరిగా ఎంపికయ్యాడు. అక్కడ అతను మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో ఆన్-ఫీల్డ్ అంపైరుగా ఉన్నాడు. [5] 2016 జూలై 28న బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వే, న్యూజిలాండ్‌ల మధ్య అతను తన మొదటి టెస్టు మ్యాచ్‌లో నిలిచాడు. [6]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన పదహారు మంది అంపైరులలో ఒకరిగా ఎంపికయ్యాడు. [7] [8] 2019 జూలైలో, ఇయాన్ గౌల్డ్ రిటైరవడం, సుందరం రవిని మినహాయించడంతో జోయెల్ విల్సన్‌తో పాటు గాఫ్, ICC అంపైరుల ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి పొందారు. [9]

మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలను సమీక్ష కోరిన సందర్భాల్లో అత్యధిక శాతం సరైనవిగా తేలినట్లు 2020 ఏప్రిల్లో ప్రకటించారు.[10] మొత్తం 14 అంపైరుల ఆన్-ఫీల్డ్ నిర్ణయాలను పరిశీలించగా, అతని నిర్ణయాల్లో 95.1% సరైనవిగా తేలాయి. 2017 సెప్టెంబరు 28 నుండి కనీసం 10 టెస్టు మ్యాచ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారి నిర్ణయాలను ఈ పరిశీలనలో పరిగణించారు.

2010 నుండి వరుసగా 8 సంవత్సరాల పాటు ECB అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా గాఫ్ ఎంపికయ్యాడు.[11] 2021 జూన్లో, 2021 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆన్-ఫీల్డ్ అంపైరులలో ఒకరిగా గాఫ్ ఎంపికయ్యాడు. [12]

వ్యక్తిగత జీవితం

అతను హార్ట్‌పూల్ యునైటెడ్ FCకి మద్దతుదారుడు. 2021 జనవరిలో హార్ట్‌పూల్ యునైటెడ్ సపోర్టర్స్ ట్రస్టు గౌరవ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. [13]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు