మోగా

పంజాబ్ లోని పట్టణం

మోగా, భారత పంజాబ్ రాష్ట్రం లోని పట్టణం. గిల్ సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మోగా సింగ్ గిల్ పేరు మీద పట్టణానికి ఈ పేరు పెట్టారు.

మోగా
City
ఫిన్లాండియా హోటల్
ఫిన్లాండియా హోటల్
మోగా is located in Punjab
మోగా
మోగా
పంజాబ్‌లో స్థానం
Coordinates: 30°49′19″N 75°10′26″E / 30.822°N 75.174°E / 30.822; 75.174
దేసం India
రాష్ట్రంపంజాబ్
జిల్లామోగా
జనాభా
 (2018)
 • Total2,98,432[1]
 • Rankపంజాబులో 6 వ
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
142001
టెలిఫోన్ కోడ్1636
Vehicle registrationPB-29
లింగ నిష్పత్తి1000:883 /

ఇది 1995 నవంబరు 24 న పంజాబ్ రాష్ట్రంలోని 17 వ జిల్లాగా మోగా, మోగా ముఖ్యపట్టణంగా ఏర్పడింది. అప్పటివరకు మోగా, ఫరీద్‌కోట్ జిల్లాలో భాగంగా ఉండేది.. మోగా పట్టణం జాతీయ రహదారి 95 (NH-95 ఫిరోజ్‌పూర్ - లుధియానా రహదారి) పై ఉంది. రోజ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే 150 గ్రామాల ధరమ్‌కోట్ బ్లాక్‌ను మోగా జిల్లాలో విలీనం చేసారు. NH5 రహదారి, మోగాను చండీగఢ్, సిమ్లా, ఫిరోజ్‌పూర్ లను కలుపుతుంది.

జనాభా

మోగా పట్టణంలో మతం[3]
మతంశాతం
సిక్కు మతం
  
50.46%
హిందూ మతం
  
46.83%
క్రైస్తవం
  
0.98%
ఇస్లాం
  
0.79%
ఇతరాలు
  
0.94%

2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం మోగా పట్టణ సముదాయంలో 1,59,897 జనాభా ఉంది. వీరిలో పురుషులు 84,808, ఆడవారు 75,089. అక్షరాస్యత రేటు 81.42%.[4]

2001 జనగణనలో,[5] మోగా పట్టణంలో 1,24,624 జనాభా ఉంది. పురుషులు 54%, స్త్రీలు 46%. మోగా అక్షరాస్యత 68%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీ అక్షరాస్యత 66%. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

విద్య

మోగా లోని ప్రముఖ విద్యా సంస్థల జాబితా ఇది.

  • కిచ్లు పబ్లిక్ స్కూల్
  • మౌంట్ లిటెరా జీ స్కూల్, మోగా
  • బాబా కుందన్ సింగ్ మెమోరియల్ లా కాలేజ్, మోగా

ప్రముఖ వ్యక్తులు

  • నరీందర్ సింగ్ కపనీ, ఫైబర్ ఆప్టిక్స్లో చేసిన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ సంతతి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త.
  • సిక్కు తీవ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే
  • లాలా లజపత్ రాయ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు
  • సోను సూద్, భారతీయ చిత్రం నటుడు
  • జోగిందర్ సింగ్ సాహ్నాన్, సైనికుడు భారత చైనా యుద్ధంలో చూపిన పరాక్రమానికి పరమవీరచక్ర గ్రహీత.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ