పంజాబ్

భారతీయ రాష్ట్రం

పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైరుతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.

పంజాబ్
Map of India with the location of పంజాబ్ highlighted.
Map of India with the location of పంజాబ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
చండీగఢ్
 - 30°44′N 76°47′E / 30.73°N 76.78°E / 30.73; 76.78
పెద్ద నగరంలూధియానా
జనాభా (2000)
 - జనసాంద్రత
24,289,296 (15వ స్థానం)
 - 482/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
50,362 చ.కి.మీ (19వ స్థానం)
 - 19
సమయ ప్రాంతంIST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[పంజాబ్ |గవర్నరు
 - [[పంజాబ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1956-11-01
 - V.P.సింగ్
 - కెప్టెన్ అమరేంద్ర సింగ్
 - ఒకే సభ (117)
అధికార బాష (లు)పంజాబీ
పొడిపదం (ISO)IN-PB
దస్త్రం:Punjabseal.png

పంజాబ్ రాజముద్ర

'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.

ప్రాచీన చరిత్ర

భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రథమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉంది.

భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును[1]

విభజన తర్వాత చరిత్ర

1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. సిక్కు, హిందూ మతస్తులు అధికంగా ఉన్న (తూర్పు) పంజాబు భారతదేశంలో ఉంది.

రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు.[2]

పాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు - బ్రిటిష్‌పాలనలో ఉన్న పంజాబును "పంజాబు" రాష్ట్రమనీ, అక్కడి రాజసంస్థానాలనన్నిటినీ కలిపి "పాటియాలా, తూర్పు పంజాబు సంయుక్త రాష్ట్రము" (Patiala and East Punjab States Union-PEPSU) అనీ అన్నారు. 1956లో PEPSU కూడా పంజాబు రాష్ట్రంలో విలీనం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాది జిల్లాలను మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు.

ఆంతకుపూర్వపు పంజాబు ప్రావిన్సు రాజధాని లాహోరు పాకిస్తాన్‌కు చెందిన పంజాబులో ఉన్నందున భారత పంజాబుకు కొత్త రాజధాని అవసరమయ్యింది. అప్పుడు చండీగఢ్ నగరాన్ని క్రొత్త రాజధానిగా నిర్మించారు. 1966 నవంబరు 1న పంజాబులో హిందువులు ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి హర్యానా రాష్ట్రంగా ఏర్పరచారు. రెండు రాష్ట్రాలకూ మధ్యనున్న చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించారు. పంజాబుకూ, హర్యానాకూ కూడా రాజధాని చండీగఢ్‌ రాజధానిగా కొనసాగుతున్నది.

భాష

సరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' పంజాబీ' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను 'గురుముఖి' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను 'షాహ్‌ముఖి' లిపి (అరబిక్ లిపినుండి రూపాంతరం చెందినది) లో వ్రాస్తారు.

సంస్కృతి

పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు.

మతం

భారతదేశంలో హిందువులు ఆధిక్యత లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.[3]అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం అని ప్రసిద్ధమైన హర్‌మందిర్ సాహిబ్ సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము.

సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో. ఇది జైన మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము.

జిల్లాలు

భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్

ఆర్ధిక వ్యవస్థ

స్థూల ఆర్ధిక స్థితి

పంజాబు స్థూల ఆర్థిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది.భారత ప్రభుత్వ గణాంక విభాగం అంచనా .

సంవత్సరంరాష్ట్రం స్థూల ఆర్థిక ఉత్పత్తి
198050,250
198595,060
1990188,830
1995386,150
2000660,100

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 2004లో పంజాబు స్థూల ఉత్పత్తి 27 బిలియన్ డాలర్లు అని అంచనా.

మౌలిక సదుపాయాలు

వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి.

పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని "భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ" (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి.

అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది.

  • మొత్తం రోడ్లు: 47,605 కి.మీ. - జాతీయ రహదారులు రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాలకు, ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయి. 97% గ్రామాలకు పక్కా రోడ్లున్నాయి.
    • జాతీయ రహదారులు: 1000 కి.మీ.
    • రాష్ట్రం హైవేలు: 2166 కి.మీ.
    • జిల్లా స్థాయి రోడ్లు: ముఖ్యమైనవి 1799 కి.మీ. + ఇతరం 3340 కి.మీ.
    • లింకు రోడ్లు: 31,657 కి.మీ.

వ్యవసాయం

పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. గోధుమ ప్రధానమైన పంట. ఇంకా పత్తి, చెరకు, వరి, జొన్న, ఆవాలు, బార్లీ వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు.

పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి.

పరిశ్రమలు

పంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు.

పర్యాటక రంగం

పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది. కొన్ని పర్యాటక స్థలాలు:

విద్య

పంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో హరితవిప్లవం విజయవంతం కావడానికి పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర వహించింది.ఇది లూథియానా లో ఉంది. అలాగే ఫగ్వారా లోని లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం (L.P.U) ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు.

  1. గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్.
  2. పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలా.
  3. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
  4. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానా.
  5. పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, జలంధర్.
  6. పంజాబ్ వైద్య విశ్వవిద్యాలయం, ఫరీద్‌కోట్.
  7. పంజాబ్ పశువైద్య విశ్వవిద్యాలయం, తల్వాండీ సాబో[4].
  8. గురు అంగద్‌దేవ్ పశువైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం.
  9. నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్.
  10. థాపర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, పాటియాలా.

ఇతరాలు

1980 దశకంలో ఖలిస్తాన్ అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్థిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది.

ప్రముఖులు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు