రాహుల్ బోస్

నటుడు, సామాజిక కార్యకర్త, రగ్బీ క్రీడాకారుడు

రాహుల్ బోస్ (జననం 1967 జూలై 27) భారతీయ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, సామాజిక కార్యకర్త. క్రీడాకారుడు కూడా అయిన ఆయన ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్(Rugby India) అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు.

రాహుల్ బోస్
2008లో రాహుల్ బోస్
జననం (1967-07-27) 1967 జూలై 27 (వయసు 56)
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
  • సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం

ఆయన మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ (2002), కాల్ పురుష్ (2005), అనురానన్ (2006), అంతహీన్ (2009), ది జపనీస్ వైఫ్ (2010), ల్యాప్‌టాప్ (2012) వంటి బెంగాలీ చిత్రాలలో నటించాడు. అలాగే ఆయన ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ (2006), మాన్ గయే ముఘల్-ఏ-ఆజం (2008), ఝంకార్ బీట్స్ (2003), కుచ్ లవ్ జైసా (2011), దిల్ ధడక్నే దో (2015), చమేలీ (2004), శౌర్య (2008) వంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆయన తమిళ థ్రిల్లర్ విశ్వరూపం (2013), దాని సీక్వెల్‌లో కూడా ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు.[1]

ఆయన 2004లో సునామీ సమయంలో సహాయక చర్యలలో పాల్గొని తన సామాజిక క్రియాశీలతకు కూడా ప్రసిద్ది చెందాడు. ప్రభుత్వేతర సంస్థను కూడా స్థాపించాడు.[2][3]

జీవితం తొలి దశలో

రాహుల్ బోస్ 1967 జూలై 27న రూపన్, కుముద్ బోస్‌లకు జన్మించాడు.[4] ఆయన ఆరేళ్ల వయస్సులో తన స్కూళ్లో టామ్, ది పైపర్స్ సన్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.

అలాగే తన తల్లి అతన్ని చిన్నతనంలోనే రగ్బీ యూనియన్‌కు పరిచయం చేయడంతో బాక్సింగ్, క్రికెట్ క్రీడలపట్ల కూడా ఆసక్తి పెంచుకున్నాడు. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి వద్ద శిక్షణ పొందాడు.[5]

ఆయన ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఆయన సిడెన్‌హామ్ కళాశాలలో చేరాడు. ఆ సమయంలో రగ్బీ జట్టులో ఆడాడు. వెస్ట్రన్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, బాక్సింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

1987లో తన తల్లి మరణం తర్వాత, ఆయన రీడిఫ్యూజన్‌లో కాపీ రైటర్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అడ్వర్టైజింగ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. అయితే తన మొదటి చిత్రం ఇంగ్లీష్, ఆగస్ట్ (1994) విడుదలైన తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.[6]

ఆయన సోదరి అనురాధ, మిడ్-డే మల్టీమీడియా యజమాని, డైరెక్టర్ అయిన తారిక్ అన్సారిని వివాహం చేసుకుంది.[7] ఎవ్రీబడీ సేస్ ఐ యామ్ ఫైన్! చిత్రంలో ఆమె అతిధి పాత్రలో నటించింది.[8]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు